OnePlus 13s లో ప్లస్ కీతో ఈ ఫీచర్ యాక్టివేట్ చేయబడింది
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus తన తాజా OnePlus 13 సిరీస్ ఫోన్‌లకు కొత్తగా 'Plus Mind' అనే ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఈ ఫీచర్‌ను ముందుగా జూన్‌లో లాంచ్ అయిన OnePlus 13s మోడల్‌తో పరిచయం చేశారు. ఇప్పుడు అదే ఫీచర్‌ను OnePlus 13 మరియు OnePlus 13R యూజర్లకూ అందుబాటులోకి తెస్తున్నారు. ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు ఏదైనా సమాచారాన్ని తక్షణమే సెంట్రలైజ్డ్ హబ్‌లో సేవ్ చేసుకొని, తమకి అవసరమైనప్పుడు సులభంగా గుర్తుచేసుకోవచ్చు.Plus Mind ఫీచర్ విశేషాలు,OnePlus విడుదల చేసిన ప్రకటన ప్రకారం, Plus Mind ఫీచర్ సహాయంతో యూజర్లు ఇమేజ్‌లు, మెసేజ్‌లు, సోషల్ మీడియా పోస్టులు మరియు వెబ్‌పేజీలు వంటి కంటెంట్‌ను స్టోర్ చేసుకోవచ్చు. OnePlus 13s మోడల్‌లో ఈ ఫీచర్ కోసం ప్రత్యేకంగా ప్లస్ కీ అందిస్తే, OnePlus 13 మరియు 13R యూజర్లు తమ స్క్రీన్‌పై మూడు వేళ్లతో పైకి స్వైప్ చేస్తే ఈ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది.
ఫీచర్ యాక్టివేట్ అయిన తర్వాత, ఇది స్క్రీన్‌పై కనిపించే సమాచారాన్ని విశ్లేషించి తగిన సూచనలు ఇస్తుంది. OnePlus AI టెక్నాలజీ ఆధారంగా ఇది డేటాను చదివి వివరణలు జెనరేట్ చేయగలదు, స్థానిక భాషలోకి అనువదించగలదు, ట్యాగ్‌ల రూపంలో క్లాసిఫై చేయగలదు, సంబంధిత అదనపు సమాచారాన్ని చూపించగలదు.డేటా స్టోరేజ్‌కి సెంట్రలైజ్డ్ హబ్,యూజర్ స్టోర్ చేసిన సమాచారం మొత్తం "Mind Space" అనే హబ్‌లో స్టోర్ చేయబడుతుంది. ఉదాహరణకి, మీరు స్క్రీన్‌పై ఓ ఈవెంట్ పోస్టర్ చూస్తున్నప్పుడు Plus Mind ఫీచర్‌ను యాక్టివేట్ చేస్తే, ఈవెంట్ డేట్‌ను మీ కాలెండర్‌లో చేర్చడమే కాకుండా, పోస్టర్‌లో ఉన్న ఇతర ముఖ్యమైన సమాచారం కూడా Mind Spaceలో సేవ్ అవుతుంది.
ఇంకొక సందర్భంలో, మీరు ఫ్యాషన్ వెబ్‌సైట్‌లో బ్రౌజ్ చేస్తుండగా మూడు వేళ్లతో పైకి స్వైప్ చేస్తే, స్క్రీన్‌పై ఉన్న "లుక్స్" గురించి ఫీచర్ విశ్లేషించి టోటల్ సమరీ ఇస్తుంది. అలా సేవ్ చేసిన సమాచారాన్ని మళ్లీ Mind Spaceలో చూడవచ్చు. ఆ సమయానికి సంబంధించిన వెబ్‌పేజీకి తక్షణమే నావిగేట్ అయ్యే షార్ట్‌కట్ కూడా అందుబాటులో ఉంటుంది.ఫీచర్ ఎలా యాక్సెస్ చేయాలంటే...!ఈ కొత్త Plus Mind ఫీచర్ OnePlus 13 సిరీస్‌కి తాజా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో వస్తోంది. యూజర్లు దీన్ని యాప్ డ్రాయర్‌లో చూడవచ్చు లేదా హోం స్క్రీన్‌పై డౌన్ స్వైప్ చేసినప్పుడు కనిపించే AI సెర్చ్ బార్ ద్వారా న్యాచురల్ లాంగ్వేజ్ సెర్చ్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు.
AI ఆధారిత ఈ కొత్త Plus Mind ఫీచర్ OnePlus 13 సిరీస్ ఫోన్లలో యూజర్ అనుభవాన్ని మరింత ఇన్‌టెలిజెంట్ గా మార్చనుంది. డేటా సేవ్ చేయడం, క్లాసిఫై చేయడం, తిరిగి గుర్తు చేయడం అన్నీ జీరో కంఫ్యూజన్‌తో జరగనున్నాయి. OnePlus అభిమానులకు ఇది మరోక బెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు.
ప్రస్తుతం AI టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న నేపధ్యంలో ఈ ఫీచర్ గేమ్ చేంజర్ అవనుండి. ఇది స్టూడెంట్స్ కి, ఎంప్లాయిస్ కి బాగా యూస్ అవుతుంది.
ప్రకటన
ప్రకటన