కంపెనీ తాజాగా విడుదల చేసిన టీజర్‌లో Ace 6 యొక్క మొదటి లుక్‌ను చూపించింది.
Photo Credit: weibo / OnePlus
OnePlus 15లో Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్, 165Hz 1.5K OLED డిస్‌ప్లే ఉంటాయి
OnePlus తన తాజా ఫ్లాగ్‌షిప్ OnePlus 15 లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఊహాగానాలకు ముగింపు పలుకుతూ, కంపెనీ చైనాలో ఈ ఫోన్‌ను అక్టోబర్ 27 సాయంత్రం 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు) విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ఈవెంట్‌లో OnePlus Ace 6 అనే మరో హై-పర్ఫార్మెన్స్ మోడల్ కూడా వేదికపైకి రానుంది.కంపెనీ తాజాగా విడుదల చేసిన టీజర్‌లో Ace 6 యొక్క మొదటి లుక్‌ను చూపించింది. ఈ ఫోన్‌లో ఉన్న కెమెరా డిజైన్ OnePlus 15 లో దానిని పోలి ఉన్నప్పటికీ, ఇందులో మూడు కెమెరాల బదులుగా రెండు సెన్సర్లు మాత్రమే ఉండనున్నాయి. టీజర్‌లో ఫోన్ రెండు రంగుల్లో కనిపించింది.... వెనుక భాగంలో “ACE” బ్రాండింగ్‌తో సిల్వర్ వేరియంట్, అలాగే కూల్ గోల్డెన్ షేడ్ వేరియంట్.
ప్రస్తుతం OnePlus 15 మరియు Ace 6 రెండు ఫోన్లు కూడా Oppo e-Shop, JD Mall వంటి ఈ-కామర్స్ సైట్‌లలో ప్రీ-రిజర్వేషన్ కోసం అందుబాటులో ఉన్నాయి. లాంచ్ తర్వాత వీటి సేల్స్ అక్టోబర్ 27 నుంచే ప్రారంభం కావొచ్చని అంచనా.
కంపెనీ ధృవీకరించిన సమాచారం ప్రకారం, OnePlus 15 వన్‌ప్లస్ నుంచి వచ్చే మొదటి ఫోన్‌గా Qualcomm Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌తో రానుంది. ఈ ఫోన్‌లో 165Hz రిఫ్రెష్ రేట్ ఉన్న 1.5K OLED డిస్‌ప్లే ఇవ్వబడనుంది. పనితీరులో వేగాన్ని పెంచే ఈ డిస్‌ప్లే కొత్త అప్‌గ్రేడ్‌గా నిలవనుంది. పవర్ విభాగంలో 7,000mAh బ్యాటరీ, అలాగే 100W వైర్డ్ మరియు 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించబడుతుంది.
ఇక OnePlus Ace 6 విషయానికి వస్తే, దీనిలో 1.5K BOE OLED స్క్రీన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ ఉండనుంది. భద్రత కోసం అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్ ఇవ్వబోతున్నారు. ఈ ఫోన్ కూడా Snapdragon 8 Elite చిప్‌సెట్ తో రానుందని, అలాగే 7,800mAh బ్యాటరీ మరియు 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉండబోతుందని లీకులు సూచిస్తున్నాయి. OnePlus అభిమానులందరికీ అక్టోబర్ 27 ఒక కీలకమైన రోజు కానుంది . ఎందుకంటే ఈ రెండు మోడళ్లు కంపెనీకి గేమ్‌చేంజర్‌గా నిలుస్తాయనే అంచనా ఉంది.
ప్రకటన
ప్రకటన