OnePlus షేర్ చేసిన టీజర్‌లో Ace 6 ఫోన్ సిల్వర్ కలర్ లో కనిపిస్తుంది.
Photo Credit: Weibo / Oneplus
Ace 6, OnePlus 15 ప్రీ-రిజర్వేషన్ Oppo e-Shop, JD Mallలో అందుబాటులో ఉన్నాయి
OnePlus తన కొత్త స్మార్ట్‌ఫోన్ OnePlus Ace 6 ను ఈ నెల చివరిలో చైనాలో అధికారికంగా ఆవిష్కరించబోతోంది. ఈ ఫోన్‌తో పాటు కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ మోడల్ OnePlus 15 ను కూడా విడుదల చేయనుంది. ఇప్పటి వరకు OnePlus Ace సిరీస్ గురించి ఎక్కువ సమాచారం బయటపెట్టకపోయినా, తాజాగా విడుదల చేసిన టీజర్ ఫోన్ యొక్క డిజైన్ మరియు కలర్ వేరియంట్స్‌పై ఆసక్తికరమైన వివరాలను వెల్లడించింది.OnePlus షేర్ చేసిన టీజర్‌లో Ace 6 ఫోన్ సిల్వర్ కలర్ లో కనిపిస్తుంది. ఫోన్ వెనుక భాగంలో “ACE” అనే బ్రాండింగ్ నిలువుగా ఉంచబడింది. ఎడమ పై మూలలో రీఫ్రెష్ చేసిన కెమెరా డిజైన్ కనిపిస్తుంది, ఇది OnePlus 15 లో ఉన్న కెమెరా సెటప్‌ను పోలి ఉంటుంది. అయితే, Ace 6 లో డ్యుయల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉండబోతుందని సమాచారం, అంటే ఫ్లాగ్‌షిప్ మోడల్‌లో ఉన్న ట్రిపుల్ కెమెరా సెటప్ కంటే ఒక సెన్సార్ తక్కువగా ఉంటుంది.
కంపెనీ ఈ ఫోన్‌ను మూడు రంగులలో అందించబోతోంది... సిల్వర్ షేడ్, క్లాసిక్ వైట్, అలాగే డార్క్ బ్లూ లేదా బ్లాక్ కలర్ ఆప్షన్‌లు. వాటిలో సిల్వర్ వేరియంట్ ఎక్కువగా హైలైట్ అవుతుందని చెప్పవచ్చు.
అంతేకాక, OnePlus Ace 6 కి మెటల్ ఫ్రేమ్ బాడీ ఉంటుందని లీకులు సూచిస్తున్నాయి. ఫోన్ పైభాగంలో మూడు చిన్న ఓపెనింగ్స్ కనిపిస్తున్నాయి. ఇవి మైక్రోఫోన్‌లు మరియు IR బ్లాస్టర్ కోసం కావచ్చని అంచనా.
ప్రస్తుతం Ace 6 మరియు OnePlus 15 రెండూ Oppo e-Shop, JD Mall మరియు కంపెనీకి చెందిన ఇతర ఆన్‌లైన్ స్టోర్లలో ప్రీ-రిజర్వేషన్ కోసం అందుబాటులో ఉన్నాయి. కేవలం CNY 1 (సుమారు రూ.12) చెల్లించి బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ చేసిన వారికి CNY 3,255 (సుమారు రూ.40,000) విలువైన ప్రయోజనాలు అందనున్నాయి.
స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, OnePlus Ace 6 లో 1.5K BOE OLED డిస్‌ప్లే ఉండవచ్చని, ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుందని సమాచారం. భద్రత కోసం అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఇవ్వబోతున్నారని లీకులు చెబుతున్నాయి. ఫోన్‌లో Snapdragon 8 Elite చిప్‌సెట్ ఉపయోగించే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం OnePlus 13 లోనూ ఉపయోగిస్తున్న ప్రాసెసర్.
బ్యాటరీ పరంగా, Ace 6 లో భారీ 7,800mAh బ్యాటరీని, అలాగే 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ని అందించనున్నట్లు సమాచారం. OnePlus Ace 6 అధికారిక లాంచ్ అక్టోబర్ 27న జరగనుంది. ఆ సమయానికి మరిన్ని ఆసక్తికరమైన వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
ప్రకటన
ప్రకటన