డిజైన్ విషయానికి వస్తే, OnePlus Ace 6T ఫ్లాష్ బ్లాక్, ఫాంటమ్ గ్రీన్, ఎలక్ట్రిక్ పర్పుల్ వంటి మూడు రంగుల్లో రాబోతోంది. మెటల్ ఫ్రేమ్, చిన్న మరియు తక్కువగా బయటకు వచ్చిన మెటల్ క్యుబ్ కెమెరా డెకో, అల్ట్రా-నారో బెజెల్స్‌తో పెద్ద ఫ్లాట్ AMOLED స్క్రీన్, 165Hz రిఫ్రెష్ రేట్, అలర్ట్ స్లైడర్ స్థానంలో కొత్త షార్ట్‌కట్ కీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
డిసెంబర్ 3న ప్రకటించనున్న OnePlus Ace 6T
కొన్ని రోజులుగా టీజర్లు విడుదల చేస్తూ ఆసక్తిని పెంచిన OnePlus, చివరకు OnePlus Ace 6T ను చైనాలో డిసెంబర్ 3న లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తాజా Snapdragon 8 Gen 5 SoC ను ఉపయోగించే మొదటి స్మార్ట్‌ఫోన్‌గా ఇది నిలవబోతోంది. ఈ చిప్‌సెట్‌ను OnePlus మరియు Qualcomm కలిసి అభివృద్ధి చేసి ప్రత్యేకంగా ఆప్టిమైజ్ చేశాయి. Snapdragon 8 Elite Gen 5 తో సమానమైన ప్రాసెస్, ఆర్కిటెక్చర్‌పై రూపొందించిన ఈ చిప్‌సెట్‌లో కొత్త తరం “Wind Chaser Gaming Kernel” ను ఉపయోగించారు. దీని వల్ల పనితీరు, బ్యాటరీ సామర్థ్యం, గేమింగ్ అనుభవం అన్నీ గణనీయంగా మెరుగుపడతాయని కంపెనీ చెబుతోంది. AnTuTu 11 బెంచ్‌మార్క్‌లో 3.56 మిలియన్లకు పైగా స్కోర్ సాధించడం, 165fps ఫుల్ ఫ్రేమ్ గేమింగ్‌ను అందించడం వంటి ఫలితాలు ఈ ఫోన్‌ను ఇండస్ట్రీలో టాప్-టియర్ కేటగిరీలో ఉంచుతున్నాయి.
డిజైన్ విషయానికి వస్తే, OnePlus Ace 6T ఫ్లాష్ బ్లాక్, ఫాంటమ్ గ్రీన్, ఎలక్ట్రిక్ పర్పుల్ వంటి మూడు రంగుల్లో రాబోతోంది. మెటల్ ఫ్రేమ్, చిన్న మరియు తక్కువగా బయటకు వచ్చిన మెటల్ క్యుబ్ కెమెరా డెకో, అల్ట్రా-నారో బెజెల్స్‌తో పెద్ద ఫ్లాట్ AMOLED స్క్రీన్, 165Hz రిఫ్రెష్ రేట్, అలర్ట్ స్లైడర్ స్థానంలో కొత్త షార్ట్‌కట్ కీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వెనుక భాగంలో సిల్క్ గ్లాస్ మరియు ఫైబర్‌గ్లాస్ ఫినిష్‌ను ఉపయోగించారు.
ఫోన్‌లో 8000mAh కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న పెద్ద బ్యాటరీ ఉండనున్నట్లు కంపెనీ తెలిపింది. 100W ఫాస్ట్ చార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఉండవచ్చని లీకులు సూచిస్తున్నాయి.
ఈ ఫోన్ డిసెంబర్ 17న భారత మార్కెట్లో OnePlus 15R పేరుతో విడుదల కాబోతోంది. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో గ్లోబల్‌గా లాంచ్ అయ్యే మొదటి ఫోన్ కూడా ఇదే కావడం విశేషం. అయితే ఈ ఫోన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న OnePlus అభిమానులు దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే లాంచింగ్ అయ్యేవరకు ఎదురు చూడాల్సిందే.ఫోన్‌లో 8000mAh కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న పెద్ద బ్యాటరీ ఉండనున్నట్లు కంపెనీ తెలిపింది. 100W ఫాస్ట్ చార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఉండవచ్చని లీకులు సూచిస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన