అదే రోజున యూరప్ మార్కెట్‌లో కూడా ఇది OnePlus Watch Liteతో కలిసి పరిచయం కానుంది.

కనెక్టివిటీ పరంగా కూడా ఈసారి OnePlus ఆసక్తికరమైన అప్‌డేట్స్ అందిస్తోంది. టాబ్లెట్‌లో Bluetooth BR, EDR, BLE, అలాగే WiFi 6 సపోర్ట్ కలదు. 2.4GHz మరియు 5GHz రెండు బ్యాండ్లను కూడా దీని WiFi సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా, ఈసారి 5G సపోర్ట్ కూడా అందిస్తున్నారు...అంటే 2G నుండి 5G వరకు అన్ని నెట్‌వర్క్ బ్యాండ్లలో పని చేయగలదు.

అదే రోజున యూరప్ మార్కెట్‌లో కూడా ఇది OnePlus Watch Liteతో కలిసి పరిచయం కానుంది.

డిసెంబర్ 17న భారతదేశంలో ప్యాడ్ గో 2 లాంచ్ అవుతుందని వన్‌ప్లస్ ఇప్పటికే ప్రకటించింది.

ముఖ్యాంశాలు
  • OxygenOS 16 తో రానున్న Pad Go 2
  • షాడో బ్లాక్ మరియు పర్పుల్ కలర్ ఆప్షన్స్‌లో లభ్యం.
  • అందుబాటులోకి రానున్న కొత్త AI ఫీచర్లు.
ప్రకటన

అమెరికాలో విడుదలకు సిద్ధమైన OnePlus Pad Go 2 తాజాగా FCC వెబ్‌సైట్‌లో కనిపించింది. TheTechOutlook గుర్తించిన ఈ లిస్టింగ్‌లో టాబ్లెట్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని వెల్లడించారు. OPD2504 అనే మోడల్ నంబర్‌తో కనిపించిన ఈ డివైస్‌కు FCC ID 2ABZ2-OPD2504 కేటాయించబడింది. ఇందులో Android 16 బేస్డ్ OxygenOS 16 పనిచేస్తుండగా, హార్డ్‌వేర్ వెర్షన్‌ను 11గా పేర్కొన్నారు. కనెక్టివిటీ పరంగా కూడా ఈసారి OnePlus ఆసక్తికరమైన అప్‌డేట్స్ అందిస్తోంది. టాబ్లెట్‌లో Bluetooth BR, EDR, BLE, అలాగే WiFi 6 సపోర్ట్ కలదు. 2.4GHz మరియు 5GHz రెండు బ్యాండ్లను కూడా దీని WiFi సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా, ఈసారి 5G సపోర్ట్ కూడా అందిస్తున్నారు...అంటే 2G నుండి 5G వరకు అన్ని నెట్‌వర్క్ బ్యాండ్లలో పని చేయగలదు.

ఇప్పటికే OnePlus ప్రకటించినట్లుగా, Pad Go 2 ఇండియాలో డిసెంబర్ 17, 2025న OnePlus 15Rతో పాటు అధికారికంగా లాంచ్ కానుంది. OnePlus India, Amazon, Flipkartలో కూడా టాబ్లెట్‌కు సంబంధించిన ల్యాండింగ్ పేజీలు ఇప్పటికే యాక్టివ్లో ఉన్నాయి. అదే రోజున యూరప్ మార్కెట్‌లో కూడా ఇది OnePlus Watch Liteతో కలిసి పరిచయం కానుంది.

ఫీచర్ల విషయానికి వస్తే, Pad Go 2 ఒకే ఒక్క రియర్ కెమెరాతో రానుంది. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ను కంపెనీ అందిస్తుంది. షాడో బ్లాక్, పర్పుల్ అనే రెండు రంగులలో ఇది లభిస్తుంది. స్టైలస్‌ను వినియోగించే వారికి ఇది ఒక ప్రత్యేక అప్డేట్...OnePlus Pad Go 2 Stylo 4096 లెవల్స్ ప్రెషర్ సెన్సిటివిటీని అందిస్తుంది. OnePlus తెలిపిన ప్రకారం, కొత్త టాబ్లెట్‌లో AI ఫీచర్లు, ప్రొడక్టివిటీ టూల్స్ కూడా ఉండనున్నాయి. అయితే వాటి పూర్తి వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది.

మొదటి తరం OnePlus Pad Go గురించి మాట్లాడుకుంటే..దీనిలో 11.35 అంగుళాల LCD డిస్‌ప్లే, 2.4K రిజల్యూషన్, Redlift Eye Care టెక్నాలజీ, డాల్బీ ఆట్మాస్‌తో కూడిన క్వాడ్ స్పీకర్లు ఉన్నాయి. మెమరీని 1TB వరకు విస్తరించుకునే అవకాశం ఇచ్చారు. MediaTek Helio G99 చిప్‌సెట్‌తో 8000mAh బ్యాటరీ, 514 గంటల స్టాండ్బై, OxygenOS 13.2 వంటి ఫీచర్లు అందించారు. అదనంగా, TÜV Rheinland బ్లూ లైట్ ప్రొటెక్షన్, ఇంటెలిజెంట్ బ్రైట్‌నెస్, DC డిమ్మింగ్, బెడ్‌టైం మోడ్ వంటి స్మార్ట్ ఐ-ప్రొటెక్షన్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

కొత్త Pad Go 2 ఈ పాత మోడల్‌పై ఎలాంటి మెరుగుదలలను తీసుకురానుంది అనేది తెలియాలి అంటే అధికారిక లాంచ్ దగ్గరలోనే ఉన్నందున OnePlus ఏ స్క్రీన్ టెక్నాలజీ లేదా ప్రాసెసర్‌ను అందిస్తుందో చూడాలి. ప్రస్తుతం లభ్యమైన సమాచారాన్ని బట్టి చూస్తే, ఇది మధ్యస్థ ధరలో మంచి పనితీరును కోరుకునే వినియోగదారులకు ఆకర్షణీయమైన ఎంపికగా మారే అవకాశం ఉంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. ఈ ఫోన్‌లోని 7,000mAh బ్యాటరీకి 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అందించనున్నట్లు కంపెనీ టీజ్ చేసింది.
  2. అదిరే ఫీచర్స్‌తో రియల్ మీ వాచ్ 5 .. 20 రోజుల వరకు ఛార్జింగ్ లేకుండా వాడొచ్చా?
  3. ఫోటోల్ని ఇష్టపడే వారికి గుడ్ న్యూస్.. రెడ్ మీ నోట్ 16 ప్రో ప్లస్ గురించి ఇది తెలుసా?
  4. లీక్ అయిన సమాచారాన్ని బట్టి చూస్తే, Lava Play Max కూడా అదే MediaTek Dimensity 7300 చిప్‌సెట్‌ను ఉపయోగించే అవకాశం ఉంది.
  5. అదే రోజున యూరప్ మార్కెట్‌లో కూడా ఇది OnePlus Watch Liteతో కలిసి పరిచయం కానుంది.
  6. ఐఫోన్ ఎయిర్‌పై అదిరే ఆఫర్.. బ్లాక్ ఫ్రైడే సేల్‌లో కొనేవారికి సదావకాశం
  7. ఈ రెండు ఆఫర్లను కలిపి తీసుకుంటే iPhone 16 ధర రూ. 62,900 వరకు దిగుతుంది.
  8. ఎక్స్‌లో ఫీడ్‌ విషయంలో మరింత సాయపడనున్న గ్రోక్
  9. కెమెరా విభాగంలో ఈసారి నథింగ్ ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను అందించింది.
  10. నోయిడా స్టోర్ కూడా అదే థీమ్‌ను కొనసాగించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »