Turbo 6V: Snapdragon 7s Gen4, Adreno 810, 12GB RAM, 512GB స్టోరేజ్
Photo Credit: OnePlus
ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంది. Turbo 6V కూడా 9,000mAh బ్యాటరీ, 80W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్తో దీర్ఘకాలిక బ్యాటరీ బ్యాక్అప్ను అందిస్తుంది
చైనా మార్కెట్లో OnePlus తన కొత్త OnePlus Turbo 6 మరియు OnePlus Turbo 6V స్మార్ట్ఫోన్లను గురువారం అధికారికంగా విడుదల చేసింది. భారీ బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్లు, ప్రీమియం డిజైన్తో ఈ రెండు ఫోన్లు మిడ్-రేంజ్ మరియు ఫ్లాగ్షిప్-లెవల్ వినియోగదారులను ఆకర్షించేలా రూపొందించబడ్డాయి. ముఖ్యంగా 9,000mAh భారీ బ్యాటరీ, IP66 + IP68 + IP69 + IP69K రేటింగ్స్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లను ప్రత్యేకంగా నిలబెట్టాయి. OnePlus Turbo 6 ధరలు చైనాలో CNY 2,099 నుంచి ప్రారంభమవుతున్నాయి. 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.27,000 కాగా, 12GB+512GB వేరియంట్కు CNY 2,399 (సుమారు రూ.30,000), 16GB+256GB మోడల్కు CNY 2,599 (సుమారు రూ.33,000), 16GB+512GB టాప్ వేరియంట్కు CNY 2,899 (సుమారు రూ.37,000)గా నిర్ణయించారు. ఈ ఫోన్ Light Chaser Silver, Lone Black, Wild Green రంగుల్లో లభిస్తుంది.
OnePlus Turbo 6V ధర మరింత అందుబాటులో ఉంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్ ధర CNY 1,699 (సుమారు రూ.21,000). అలాగే 12GB+256GB వేరియంట్ CNY 1,899 (సుమారు రూ.24,000), 12GB+512GB వేరియంట్ CNY 2,199 (సుమారు రూ.28,000)గా ఉంది. ఇది ఫియర్లెస్ బ్లూ, లోన్ బ్లాక్, నోవా వైట్ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది.డ్యూయల్ నానో సిమ్ సపోర్ట్తో వచ్చే OnePlus Turbo 6, Android 16 ఆధారిత ColorOS 16 పై పనిచేస్తుంది. ఇందులో 6.78 అంగుళాల ఫుల్ HD+ ఫ్లెక్సిబుల్ AMOLED డిస్ప్లే ఉంది. 60Hz నుంచి 165Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 100% DCI-P3 కలర్ గ్యామట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో ఈ స్క్రీన్ విజువల్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్లో Snapdragon 8s Gen 4 ప్రాసెసర్తో పాటు Adreno 825 GPU ఉంది. గరిష్టంగా 16GB LPDDR4X ర్యామ్, 512GB UFS 3.1 స్టోరేజ్ అందించారు. కెమెరా విభాగంలో 50MP ప్రధాన సెన్సార్తో పాటు 2MP మోనోక్రోమ్ కెమెరా ఉన్న డ్యూయల్ రియర్ సెటప్ ఉంది. సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. కనెక్టివిటీకి 5G, Wi-Fi 7, బ్లూటూత్, NFC, USB Type-C వంటి అన్ని ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సార్ అందించారు. 9,000mAh భారీ బ్యాటరీతో పాటు 80W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్కు ప్రధాన హైలైట్.
Turbo 6V కూడా అదే డిస్ప్లే సైజ్, సాఫ్ట్వేర్, IP రేటింగ్స్ను కలిగి ఉంది. అయితే ఇందులో Snapdragon 7s Gen 4 ప్రాసెసర్ మరియు Adreno 810 GPU ఉన్నాయి. గరిష్టంగా 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది.
డిస్ప్లేలో 93.5% స్క్రీన్-టు-బాడీ రేషియో, 1,800 నిట్స్ బ్రైట్నెస్, 300Hz టచ్ సాంప్లింగ్ రేట్ అందించారు. కెమెరా సెటప్ Turbo 6లానే 50MP ప్రధాన కెమెరా, 2MP మోనోక్రోమ్ సెన్సార్తో వస్తుంది. ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంది. Turbo 6V కూడా 9,000mAh బ్యాటరీ, 80W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్తో దీర్ఘకాలిక బ్యాటరీ బ్యాక్అప్ను అందిస్తుంది.
ces_story_below_text
ప్రకటన
ప్రకటన