108 MP కెమెరాతో Poco M6 Plus 5G ఫీచ‌ర్స్ చూస్తే మ‌తిపోతుంది!

108 MP కెమెరాతో Poco M6 Plus 5G ఫీచ‌ర్స్ చూస్తే మ‌తిపోతుంది!
ముఖ్యాంశాలు
  • Poco M6, Poco M6 Pro లైనప్‌లో Poco M6 plus వ‌చ్చేసింది
  • 6GB RAM + 128GB స్టోరేజీ, 8GB RAM + 128GB స్టోరేజీతో రెండు వేరియంట్‌ల‌లో
  • ఇన్-ఇయర్ డిజైన్‌తో కేవ‌లం రూ.1799కే Poco బడ్స్ X1
ప్రకటన
భారత మార్కెట్‌లోకి ప్ర‌ముఖ మొబైల్ త‌యారీ సంస్థ‌ POCO మ‌రో 5G ఫోన్‌ను లాంచ్ చేసింది. Poco M6 Plus 5G పేరుతో స్మార్ట్ ఫోన్‌తోపాటు బడ్స్ X1 వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఈ రెండు డివైజ్‌లూ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అయిన‌ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. Poco M6, Poco M6 Pro లైనప్‌లో ఈ కొత్త‌ Poco M6 plusను తీసుకువ‌చ్చారు. ఇందులో గ్లాస్‌డిజైన్‌, 108 MP కెమెరా లాంటి మంచి ప్రధాన ఫీచర్స్‌తో అంద‌రికీ అందుబాటులో ఉండేలా బడ్జెట్‌ ధరలో దీనిని Poco అందిస్తోంది. అలాగే, Poco బడ్స్ X1 కూడా IP54 రేటింగ్‌ను కలిగి ఉండ‌డంతోపాటు బ‌య‌ట శబ్దాల‌ను నియంత్రించేలా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఫీచర్‌తో రూపొందించ‌బ‌డ్డాయి. 

ప్ర‌స్తుతం ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్న ఈ Poco M6 Plus 5G ఫోన్‌ 6GB RAM + 128GB స్టోరేజీ అలానే, 8GB RAM + 128GB స్టోరేజీతో రెండు వేరియంట్‌ల‌లో వ‌స్తున్నాయి. వ‌రుస‌గా వీటి ధ‌ర రూ. 13,499, రూ. 14,499గా ఉంది. ఇది గ్రాఫైట్ బ్లాక్, ఐస్ సిల్వర్, మిస్టీ లావెండర్ రంగుల్లో లభిస్తోంది. అలాగే, ఫ్లిప్‌కార‌డ్‌ Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి కొనుగోళ్లు చేసేవారికి ఐదు శాతం డిస్కౌంట్‌ను ఆఫ‌ర్ చేశారు. నెల‌కు రూ.4,500లో నో-కాస్ట్ EMI ఎంపికలు ఉన్నాయి. 
108 MP కెమెరాతో అధిరిపోయే ఫోటోలు..

Poco M6 Plus 5G స్మార్ట్‌ ఫోన్ 6.79 అంగుళాల ఫుల్‌ HD+ (2,400 x 1,080 pixels) డిస్‌ప్లేను అందించారు. అలాగే, 120Hz రీఫ్రెష్‌ రేటు కూడా ఉంటుంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌ 3తో రూపొందించ‌డింది.  స్నాప్‌డ్రాగన్‌ 4 జన్‌2 ఏఈ (యాక్సిలిరేటెడ్‌ వెర్షన్‌)తో ప్రాసెసర్ అమర్చ‌డంతోపాటు 8GB వర్చువల్‌ RAM కూడా ల‌భిస్తోంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత హైపర్‌ OSతో పనిచేస్తోంది. ఈ ఫోన్ వెనకవైపున‌ రెండు కెమెరాలను అందించారు. వాటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 MP కాగా, దీంతోపాటు 2 MP మాక్రో సెన్సార్ కూడా అమ‌ర్చారు. అలాగే, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ప్ర‌త్యేకంగా 13 MP కెమెరాను అందించారు. 5030mAh బ్యాటరీ సామ‌ర్థ్యంతో 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్ చేస్తుంద‌ని సంస్థ వెల్ల‌డించింది. అలాగే, సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌తోపాటు IP53 రేటింగ్ ఉన్న‌ట్లు తెలిపింది. దీంతోపాటు 5జీ, 4జీ ఎల్టీఈ డ్యూయల్ బ్యాండ్ వైఫై, యూఎస్‌బీ టైప్-సీ వంటి కనెక్టివిటీ ఫీచర్స్‌ను అందించారు. ఇక దీని ప‌రిమాణం విషాయానికి వ‌స్తే.. 0.83 సెంటీమీటర్ల మందంతో 205 గ్రాముల బ‌రువు ఉంటుంది. 
ఇన్-ఇయర్ డిజైన్‌తో..

Poco బడ్స్ X1 ఇన్-ఇయర్ డిజైన్‌తో వస్తోంది. అలాగే, 12.4mm డైనమిక్ టైటానియం డ్రైవర్‌లతో టచ్ కంట్రోల్‌లను కలిగి ఉంటాయి. 40dB వ‌ర‌కూ హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) వరకు సపోర్ట్ చేస్తాయి. AI- సపోర్టెడ్ ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC)తో కూడిన క్వాడ్-మైక్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. 480mAh బ్యాటరీ సామ‌ర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ బ‌డ్స్ ఒక‌ ఛార్జ్‌పై ప్లేబ్యాక్ 36 గంటల వరకు అందజేస్తాయని సంస్థ పేర్కొంది. బ్లూటూత్ 5.3 కనెక్టివిటీతోపాటు దుమ్ము ధూళిని నియంత్రించేలా రూపొందించారు. దీని మార్కెట్ ధ‌ర‌ను రూ.1799గా నిర్ణ‌యించారు. మ‌రెందుకు ఆల‌స్యం మీరు కూడా Poco అభిమానులైతే వెంట‌నే Poco M6 Plus 5G ఫోన్‌తోపాటు Poco బడ్స్ X1ను కూడా ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేసేయండి మ‌రి!
Comments
Facebookలో షేర్‌ Gadgets360 Twitter Shareట్వీట్ షేర్ Snapchat రెడ్డిట్ వ్యాఖ్యానించండి
 
 

ప్రకటన

ప్రకటన

© Copyright Red Pixels Ventures Limited 2024. All rights reserved.
Trending Products »
Latest Tech News »