Photo Credit: Poco
భారత్ మొబైల్ మార్కెట్‌లోకి Poco M7 Pro 5G, Poco C75 5G హ్యాండ్‌సెట్‌లు డిసెంబర్ 17న లాంచ్ కాబోతున్నాయి. ఈ Xiaomi సబ్-బ్రాండ్ రాబోయే స్మార్ట్ ఫోన్‌ల కెమెరా, డిస్‌ప్లే సామర్థ్యాలతోపాటు అనేక కీలక స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. ఈ Poco M7 Pro 5G హ్యాండ్‌సెట్ సోనీ సెన్సార్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో రానున్నట్లు స్పష్టం చేసింది. అలాగే, Poco C75 5G ఫోన్ కంపెనీ C సిరీస్‌లో Xiaomi హైపర్‌ఓఎస్‌లో రన్ అవుతోన్న మొదటి ఫోన్‌గా గుర్తింపు పొందుతోంది.
కంపెనీ రాబోతున్న స్మార్ట్ ఫోన్‌ల గురించి Xలో వెల్లడించిన వివరాల ప్రకారం.. Poco M7 Pro 5G హ్యాండ్‌సెట్ 6.67-అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 2,100 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌తో రూపొంచినట్లు తెలిపింది. ఈ హ్యాండ్‌సెట్ TUV ట్రిపుల్ సర్టిఫికేషన్, SGS ఐ కేర్ డిస్‌ప్లే సర్టిఫికేషన్ రెండింటినీ కలిగి ఉన్నట్లు స్పష్టం చేసింది. Poco M7 Pro 5G 92.02 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోను కూడా కలిగి ఉన్నట్లు ప్రకటించింది.
కెమెరా విషయానికి వస్తే.. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, మల్టీ-ఫ్రేమ్ నాయిస్ రిడక్షన్, ఫోర్-ఇన్-వన్ పిక్సెల్ బిన్నింగ్‌తో 50-మెగాపిక్సెల్ సోనీ LYT-600 కెమెరాతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను అందించారు. సూపర్ రిజల్యూషన్ టెక్నాలజీతో పాటు ఇన్-సెన్సార్ జూమ్‌ను కూడా అందించనున్నట్లు కంపెనీ చెబుతోంది. ఈ రాబోయే Poco M7 Pro 5G హ్యాండ్‌సెట్ ఇతర ఫీచర్స్‌ను పరిశీలిస్తే.. 300 శాతం సూపర్ వాల్యూమ్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మోస్ సపోర్ట్, 3.5 మిమీ హెడ్‌ఫోన్ జాక్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాంటివి ఉన్నాయి.
Poco C75 5G ఫోన్ వేరియంట్ ఫోన్ హైపర్‌ఓఎస్ ప్లాట్‌ఫారమ్‌లో రన్ అయ్యే సిరీస్‌లో మొదటి మోడల్‌గా కంపెనీ ప్రచారం చేస్తోంది. అంతేకాదు, ఈ మోడల్ ధరను సైతం వెల్లడించింది. దీని ధర రూ. 9,000గా నిర్ణయించారు. ఇది సోనీ సెన్సార్‌తో సెగ్మెంట్-ఫస్ట్ అని క్లెయిమ్ చేయబడుతోంది. అలాగే, రాబోయే ఈ హ్యాండ్‌సెట్ 4nm ఆర్కిటెక్చర్‌తో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4s Gen 2 ప్రాసెసర్‌తో వస్తున్నట్లు స్పష్టమైంది.
ఈ Poco C75 5G ఫోన్ గరిష్టంగా 8GB RAM (4GB టర్బో RAMతో సహా)తో 1TB వరకు స్టోరేజీని పెంచుకునే అవకాశం కల్పించారు. కంపెనీ రెండు సంవత్సరాల OS, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తున్నట్లు ధృవీకరించింది. ఈ హ్యాండ్‌సెట్ ఇతర ఫీచర్స్‌ను పరిశీలిస్తే.. ట్యాప్ సంజ్ఞలతో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యూయల్-సిమ్ సపోర్ట్, MIUI డయలర్ వంటివి అందించారు. మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం డిసెంబర్ 17 వరకూ వేచి చూడాల్సిందే.
ప్రకటన
ప్రకటన