రియల్ మీ నుంచి 15, 15 ప్రో 5జీ మోడల్స్ ఇండియన్ మార్కెట్లోకి వచ్చాయి.
Photo Credit: Realme
Realme 15 5G సిరీస్ ఫోన్లు IP66+IP68+IP69 దుమ్ము మరియు నీటి నిరోధక రేటింగ్‌లను కలుస్తాయని క్లెయిమ్ చేయబడ్డాయి
ప్రపంచంలోనే భారత్ అత్యధిక మార్కెట్ కలిగిన దేశం. ఎక్కువగా వినియోగదారులున్న ఈ దేశంలో నిత్యం వేల కోట్ల డీల్స్ జరుగుతుంటాయి. ఇక భారత్‌లోని యువత ఎక్కువగా సాంకేతికను వాడుకుంటోంది. వీటికి తగ్గట్టుగా ఫోన్ల వినియోగం కూడా పెరిగిపోయింది. నిత్యం మార్కెట్లోకి కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి. ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో యూజర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా తాజాగా మరో కొత్త మోడల్ ఇండియన్ మార్కెట్లోకి వచ్చింది.రియల్ మీ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్‌ను ఊపేస్తోంది. ఎక్కువ మంది వినియోగదారులు రియల్ మీ ఫోన్లను వాడుతున్నారు. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్ వస్తుండటంతో రియల్ మీ ఫోన్ల డిమాండ్ పెరిగిపోతోంది.
ఈ క్రమంలో రియల్ 15 ప్రో 5జీ అనే ఈ కొత్త మోడల్‌ను మార్కెట్లోకి తీసుకు వచ్చారు. ఇందులోని ఫీచర్స్ చూస్తే అవాక్కవ్వాల్సిందే. బ్యాటరీ బ్యాకప్ అయినా, ఫాస్ట్ ఛార్జింగ్ అయినా, కెమెరా క్వాలిటీ అయినా అదిరిపోవాల్సిందే. స్నాప్ డ్రాగన్ 7 జెన్ 4 SoCతో ఈ కొత్త మోడల్ వచ్చింది.
రియల్ మీ 15జీ అనేది మీడియా టెక్ 7300కి పైగా డైమెన్సిటీ చిప్‌సెట్స్‌తో వచ్చింది. ఇక అదే తరుణంలో రియల్ మీ 15 ప్రో 5జీ అనేది స్నాప్ డ్రాగన్ 7 జెన్ 4 SoCతో వచ్చింది. ఇక ఇందులో LPDDR4X 12జీబీ కెపాసిటీతో ర్యామ్, ఇక స్టోరేజ్ అయితే UFS3.1 512జీబీతో వస్తోంది. ఆండ్రాయిడ్ 15, UI 6 సాఫ్ట్ వేర్‌తో ఈ కొత్త మోడల్ వచ్చింది.
కెమెరా విషయంలోనూ ఈ కొత్త మోడల్ అదరగొట్టేలా ఉంది. 50 మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో సెన్సార్ పెయిర్డ్ కెమెరా కూడా ఉంటుంది. ఇక ఫ్రంట్ కెమెరా సైతం 50 మెగా పిక్సెల్ ఉంటుంది. 60 fpsతో 4K వీడియో రికార్డింగ్ ఫీచర్ కూడా ఉంది. ఈ కొత్త మోడల్‌లో ఏఐ ఫీచర్స్ కూడా ఉంటాయి. ఎడిటింగ్ చేసుకునేందుకు వీలైన ఏఐ ఎడిట్ జెనీ, ఏఐ పార్టీ వంటి టూల్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
వాయిస్ బేస్డ్ ఫోటో ఎడిటింగ్, షట్టర్ స్పీడ్, కాంట్రాస్ట్, సాట్యురేషన్ ఇలాంటివన్నీ కూడా వాతావరణాన్ని బట్టి ఆటో మేటిక్‌గా అడ్జస్ట్ అయ్యే ఫీచర్ కూడా ఉంది. ఏఐ మ్యాజిక్ గ్లో 2.0, ఏఐ ల్యాండ్ స్కేప్, ఏఐ గ్లేర్ రిమూవర్, ఏఐ మోషన్ కంట్రోల్, ఏఐ స్నాప్ మోడ్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. జీటీ బూస్ట్ 3.0 టెక్నాలజీని కూడా ఈ మోడల్ సపోర్ట్ చేస్తుంది. గేమ్స్ ఆడేవారి కోసం గేమింగ్ కోచ్ 2.0 అనే అధునాతన టెక్నాలజీని కూడా ఇందులో పొందు పరిచారు.
డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ను తట్టుకునేలా ఈ మోడల్‌ను డిజైన్ చేశారు. 5జీ, 4జీ, వైఫై, బ్లూటూత్ 5.4, జీపీఎస్, యూఎస్‌బీ టైప్ సీ వంటివి సపోర్ట్ చేస్తుంది. 162.27×76.16×7.66 మి.మీ సైజ్‌తో వచ్చిన ఈ రియల్ మీ 15 5జీ మోడల్ అత్యంత తేలికగా ఉంటుంది. ఈ కొత్త మోడల్ ఫోన్ బరువు దాదాపు గ్రా. 187. సిల్క్ పర్పుల్ వేరియంట్‌తో వచ్చిన రియల్ 15 ప్రో 5జీ 162.26×76.15×7.69 మి. మీ కొలతలతో వచ్చింది. ఇక సిల్వర్, వెల్వెట్ గ్రీన్ కలర్స్‌లో ఉండే మోడల్స్‌కి 7.79 మి. మీ, 7.84 మి. మీ సైజ్ ఉంటుంది.
రియల్ మీ 15 ప్రో 5జీ మోడల్ (8 GB + 128 GB) ప్రారంభ ధర రూ. 31, 999. అదే ఒక వేళ 8 GB + 256 GB అయితే ధర రూ. 33, 999. అదే విధంగా 12 GB + 256 GB అయితే రూ. 35, 999 ఉంటుంది. ఇక చివరగా 12 GB + 512 GB స్టోరేజీ అయితే రూ. 38, 999.
రియల్ మీ 15జీ (8 GB + 128 GB)ప్రారంభ ధర రూ. 25, 999. స్టోరేజీని బట్టి 8GB + 256GBకి రూ. 27, 999 కాగా, 12GB + 256GBకి రూ. 30, 999.
జూలై 30 నుంచి ఇండియన్ మార్కెట్‌లో ఈ కొత్త మోడల్‌ను అందరూ కొనుగోలు చేయవచ్చు. రియల్ మీ ఇండియా వెబ్ సైట్ లేదా ఫ్లిప్ కార్ట్ లేదా ఇతర స్టోర్‌లో ఈ కొత్త మోడల్స్ అందుబాటులో ఉంటాయి. కొన్ని నిర్దిష్టమైన బ్యాంక్ ఖాతాలా ద్వారా కొనుగోలు చేస్తే రియల్ మీ 15 ప్రో 5జీ మోడల్‌పై గరిష్టంగా రూ. 3000, రియల్ మీ 15 మోడల్‌పై గరిష్టంగా రూ. 2000 డిస్కౌంట్ లభిస్తుంది. పైగా ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది. సిల్వర్, వెల్వెట్ గ్రీన్, వెనీలా వేరియంట్, సిల్క్ పింక్ వంటి కలర్స్‌లో రియల్ మీ 15 ఉంటే.. సిల్క్ పర్పుల్‌లో రియల్ మీ 15 ప్రో 5G మోడల్ అందుబాటులో ఉంటుంది.
(Disclaimer: New Delhi Television is a subsidiary of AMG Media Networks Limited, an Adani Group Company.)
ప్రకటన
ప్రకటన