GT 7 మోడల్‌కు ట్రిపుల్ కెమెరా సెటప్, GT 7Tకు డ్యూయల్ రియల్ కెమెరా యూనిట్‌తో రూపొందించారు. GT 7 Dream ఎడిషన్ ఆస్టన్ మార్టిన్ F1 టీమ్‌తో రూపొందించబడిన ప్రత్యేకమైన ఫోన్‌గా గుర్తింపు పొందింది.
Photo Credit: Realme
Realme GT 7 మరియు Realme GT 7T ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 పై నడుస్తాయి
Realme అభిమానులకు ఇదో గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ సంస్థ నుంచి Realme GT 7, Realme GT 7T, Realme GT 7 Dream ఎడిషన్ పేరుతో మన దేశంతోపాటు గ్లోబల్ మార్కెట్‌లలో సరికొత్త మోడల్స్ లాంఛ్ అయ్యాయి. ఈ GT సిరీస్ నుంచి వస్తోన్న హ్యాండ్‌సెట్స్‌కు మీడియాటెక్ Dimensity ప్రాసెసర్‌తోపాటు 120W ఛార్జింగ్ సపోర్ట్‌తో 7000mAh బ్యాటరీని అందించారు. కెమెరా విషయానికి వస్తే.. GT 7 మోడల్‌కు ట్రిపుల్ కెమెరా సెటప్, GT 7Tకు డ్యూయల్ రియల్ కెమెరా యూనిట్‌తో రూపొందించారు. GT 7 Dream ఎడిషన్ ఆస్టన్ మార్టిన్ F1 టీమ్‌తో రూపొందించబడిన ప్రత్యేకమైన ఫోన్‌గా గుర్తింపు పొందింది.వివరాలు ఇలా,కొత్తగా పరిచయం అయిన ఈ మోడల్స్ ధరల విషయానికి వస్తే.. 8జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజీ గల GT 7 ధర 39,999గా ఉంది. అలాగే, 12జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజీ ఉన్న GT 7T వేరియంట్ ధరను 34,999గా కంపెనీ నిర్ణయించింది. ఇప్పటికే ప్రీ బుకింగ్ మొదలవ్వగా, మే 30 నుంచి అమెజాన్, Realme ఆన్‌లైన్ స్టోర్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. 16జీబీ ర్యామ్+512జీబీ స్టోరేజీ గల GT 7 Dream ఎడిషన్ వేరియంట్ రూ. 49,999 లకు అమ్మకానికి లభిస్తున్నట్లు కంపెనీ ధృవీకరించింది. ఇది జూన్ 13 నుంచి అందుబాటులోకి రానుంది.
ఈ మోడల్ డ్యూయల్ సిమ్‌తో ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme యూఐ 6.0 పై రన్ అవుతుంది. 6.78 అంగుళాల డిస్‌ప్లేను 6000 నిట్స్ బ్రైట్‌నెస్, 360 హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్, 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో రూపొందించబడింది. దీని స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటక్షన్‌తో వస్తుంది. ఇది ఆక్టా కోర్ 4ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 9400సీ ప్రాసెసర్‌పై రన్ అవుతోంది. దీనికి ట్రిపుల్ కెమెరా యూనిట్‌ను అమర్చారు. ఇందులో ప్రధానంగా 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.
ఈ మోడల్ GT 7 మాదిరిగానే సిమ్‌తోపాటు సాఫ్ట్‌వేర్, సెల్ఫీ కెమెరా, బ్యాటరీ, ఛార్జింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అలాగే, డిస్‌ప్లే 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 360 హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.80 అంగుళాల AMOLED డిస్‌ప్లేను అందించారు. 12జీబీ ర్యామ్‌తో 512జీబీ స్టోరేజీని కలిగి ఉండి, మీడియాటెక్ Dimensity 8400 Max ప్రాసెసర్‌తో రూపొందించబడి ఉంటుంది.
కొత్త GT 7 Dream ఎడిషన్ ఆస్టన్ మార్టిన్ అరాంకో ఫార్ములా వన్ టీమ్‌తో కలిసి రూపొందించబడింది. దీని వెనుక భాగంలో సిల్వర్ వింగ్ లోగోను ఫార్ములా వన్ టీమ్ ట్యాగ్ లైన్‌తో చెక్కబడి ఉంటుంది. ఇది కస్టమ్ వాల్ పేపర్స్, సింబల్స్, థీమ్‌లను కూడా అందిస్తోంది. ఇది చాలా వరకూ GT 7 స్పెసిఫికేషన్స్‌ను కలిగి ఉంటుంది.
ప్రకటన
ప్రకటన
Vivo V70 FE Design Seen in Leaked Promo Image; Tipster Leaks RAM and Storage Configurations