Photo Credit: Realme
Realme GT 7 Pro (చిత్రంలో) 6,500mAh బ్యాటరీని కలిగి ఉంది
గతంలోనే అనేక సర్టిఫికేషన్, బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్‌లలో కనిపించిన Realme GT 7 మోడల్ ఇప్పుడు మరొక కొత్త లీక్‌తో ప్రత్యక్షమయ్యింది. ఈ లీక్, హ్యాండ్‌సెట్ త్వరలో లాంఛ్ కావచ్చని సూచిస్తోంది. అంతే కాదు, ఫోన్‌కు సంబంధించిన అనేక కీలక స్పెసిఫికేషన్‌లను కూడా బహిర్గతం చేస్తోంది. అలాగే, ఇది నవంబర్ 2024లో చైనాలో ఆవిష్కరించబడిన Realme GT 7 Proలో జాబితాలో చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో మరొక లీక్ రాబోయే Realme GT 8 Pro స్మార్ట్ ఫోన్ యొక్క కొన్ని ముఖ్యమైన ఫీచర్స్‌ను సూచింస్తోంది. ఈ రెండు హ్యాండ్‌సెట్‌ల లాంఛ్‌ను కంపెనీ అయితే, ఇంకా ధృవీకరించలేదు.
ఈ Realme GT 7 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందే అవకాశం ఉందని టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వీబో పోస్ట్‌లో వెల్లడించింది. అలాగే, ఈ హ్యాండ్‌సెట్ 7000 mAh కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీతో వస్తుందని టిప్‌స్టర్ అంచనా వేస్తూ, మరో పోస్ట్‌ను అటాచ్ చేసింది. అంతేకాదు, ఈ పోస్ట్‌లో టిప్‌స్టర్ దీనిని 7X00mAh బ్యాటరీతో సూచిస్తోంది.
టిప్‌స్టర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. వెనిల్లా Realme GT 7 స్మార్ట్ ఫోన్ 100W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే, ఈ ఫోన్ ప్రస్తుత Realme GT 6 ఫోన్ కంటే సన్నగా, తేలికైన బిల్డ్‌తో ఫ్లాట్ స్క్రీన్‌ను కలిగి ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. అంతే కాదు, ఇది 206 గ్రా బరువు, 8.43 మిమీ ప్రొఫైల్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
షేర్ చేసిన పోస్ట్ కింద ఒక లైన్‌లో టిప్‌స్టర్ Realme GT 7 హ్యాండ్‌సెట్ ఏప్రిల్‌లో చైనాలో లాంఛ్ అయ్యే అవకాశం ఉందని స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే, జూలై 2024లో చైనాలో ఆవిష్కరించిన ప్రస్తుత Realme GT 6 స్మార్ట్ ఫోన్ మైక్రో-కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనికి స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్, 120W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,800 mAh బ్యాటరీని అందించారు.
ఇంతలో, మరో టిప్‌స్టర్ స్మార్ట్ పికాచు వీబో పోస్ట్‌లో ఇంకా ప్రకటించని Realme GT 8 ప్రో హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ 2 ప్రాసెసర్‌ను కలిగి ఉండవచ్చని అంచనా వేశారు. ఇది 2 కె రిజల్యూషన్, 7,000 mAh బ్యాటరీ సామర్థ్యంతో ఫ్లాట్ OLED స్క్రీన్‌తో వచ్చే అవకాశం ఉంది. ఈ Realme GT 8 ప్రో స్మార్ట్ ఫోన్ బయోమెట్రిక్ అథంటికేషన్ కోసం అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో రూపొందిచబడి ఉంటుందని సమాచారం. కెమెరా విభాగంలో, ఇది పెరిస్కోప్ టెలిఫోటో షూటర్‌తో వస్తుందని భావిస్తున్నారు. అయితే, హ్యాండ్‌సెట్ ఇతర అంచనా వివరాలు, లాంచ్ టైమ్‌లైన్ వెల్లడించలేదు.