Photo Credit: Realme
Realme Narzo 80 Lite 5G ક્રિસ્ટલ પર્પલ અને ઓનીક્સ બ્લેક કલર વિકલ્પોમાં આવે છે
ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో భారీ బ్యాటరీ కలిగిన స్మార్ట్ ఫోన్ కోరుకునేవారి కోసం Realme మన ఇండియాలో Narzo 80 Lite 5G అనే ఓ కొత్త మోడల్‌ను పరిచయం చేసింది. 6000mAh బ్యాటరీతో వస్తోన్న ఈ ఫోన్‌కు 30 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను అందించారు. దీని 6.67 అంగుళాల డిస్‌ప్లే వినియోగదారులను మరింత ఆకట్టుకోనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ కలిగిన ఈ హ్యాండ్‌సెట్, దేశీయ మార్కెట్‌లో ఏప్రిల్‌లో అడుగుపెట్టిన Narzo 80x, Narzo 80 ప్రో మోడల్స్ జాబితాలో చేరనుంది.
జూన్ 23 నుంచి మన దేశంలో అమెజాన్ ద్వారా కొనుగోలు చేసేందుకు Realme Narzo 80 Lite 5G అందుబాటులో ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. అలాగే, ఈ హ్యాండ్‌సెట్ క్రిస్టల్ పర్పుల్, ఒనిక్స్ బ్లాక్ రంగులలో లభించనుంది. దీని ధర విషయానికి వస్తే, 4జీబీ+ 128జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 10, 499గా కంపెనీ నిర్ణయించింది. ఇందులోనే 6జీబీ RAM + 128జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 11,499గా ఉంది. దీనిపై రూ. 700 వరకూ తగ్గింపును పొందే అవకాశం ఉంది.
6000mAh భారీ బ్యాటరీతో వస్తోన్న ఈ Narzo 80 Lite 5G ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీనిలో హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ స్లాట్ ఉంది. దీంతో రెండు సిమ్ కార్డ్‌లు లేదా ఒక సిమ్, ఒక మైక్రో ఎస్ డీ కార్డ్ మాత్రమే వేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఓఎస్‌తో రన్ అవుతుంది. Google జెమిని ఇంటిగ్రేషన్‌ను కలిగి ఉంటుంది. 6జీబీ వరకూ RAM, 128జీబీ వరకూ ఆన్ బోర్డ్ స్టోరేజీతో అటాచ్ చేయబడి ఉంది.
Narzo 80 Lite 5G కెమెరా విషయానికి వస్తే, ఈ హ్యాండ్‌సెట్‌కు వెనుక భాగంలో ఆటోఫోకస్ సపోర్ట్‌తో పిల్ ఆకారపు ఎల్ఈడీ ఫ్లాష్ కలిగన 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను ముందు భాగంలో అమర్చారు. ఈ ఫోన్ ఏఐ ఆధారిత ఇమేజింగ్, ఏఐ క్లియర్ ఫెస్ లాంటి ఏఐ బ్యాక్డ్ ఇమేజింగ్, ఎడిటింగ్ ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుందని కంపెనీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.
ఈ ఫోన్‌కు సెక్యూరిటీ కోసం ఫింగర్ ఫ్రింట్ సెన్సార్‌ను కూడా అందించారు. దుమ్ము- నీటి నియంత్రణకు ఐపీ 64 రేటింగ్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే, డ్యూయల్ 5జీ సిమ్, బ్లూటూత్ 5.3, జీపీఎస్, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్, Wi-Fi వంటి ఫీచర్స్‌ను అందించారు. ఈ ఫోన్ 7.94 మందంతో 197 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. ఈ ధర రేంజ్‌లో ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న ఇతర ఫోన్‌లకు ఇది గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన