Photo Credit: Realme
Realme Narzo 80 Pro 5G (ચિત્રમાં) IP66, IP68 અને IP69 રેટિંગ્સને પૂર્ણ કરે છે તેવો દાવો કરવામાં આવે છે
ఇండియాలో Realme Narzo 80 Pro 5G, Narzo 80x 5G లాంఛ్ అయ్యాయి. వీటిలో Pro వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్, Narzo 80x మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌తో వస్తున్నాయి. ఈ రెండు ఫోన్‌లు 6,000mAh బ్యాటరీ సామర్థ్యంతో Pro 80W, 80x 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. అలాగే, Pro 6,050mm² VC కూలింగ్ సిస్టమ్‌తోపాటు BGMI కోసం 90fps (సెకనుకు ఫ్రేమ్‌లు) సపోర్ట్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. రెండు ఫోన్‌లు Android 15-ఆధారిత Realme UI 6పై రన్ అవుతున్నాయి.మన దేశంలో ధరలు,మన దేశంలో Pro 5G 8GB + 128GB వేరియంట్ ధర రూ. 19,999 నుండి ప్రారంభమవుతుంది. అలాగే, 8GB + 256GB, 12GB + 256GB వేరియంట్ ధరలు వరుసగా రూ. 21,499, రూ. 23,499గా ఉన్నాయి. ఇది రేసింగ్ గ్రీన్, స్పీడ్ సిల్వర్ ఫినిషింగ్‌తో లభిస్తోంది. Narzo 80x 5G 6GB + 128GB వెర్షన్ ధర రూ. 13,999 కాగా, 8GB + 128GB కాన్ఫిగరేషన్ ధర రూ. 14,999గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ డీప్ ఓషన్, సన్‌లైట్ గోల్డ్ షేడ్స్‌లో లభిస్తుంది.
ఈ Realme Narzo 80 సిరీస్ హ్యాండ్‌సెట్‌లు Amazon, Realme India వెబ్‌సైట్ ద్వారా ఇండియాలో కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. Pro వేరియంట్ ముందస్తు అమ్మకాలు ఇప్పటికే మొదలుకాగా, Narzo 80x 5G ఏప్రిల్ 11న సాయంత్రం 6 గంటల నుండి అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటుంది. అంతేకాదు, ముందస్తు కొనుగోలుదారులకు రూ. 2,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. విద్యార్థులు Narzo 80 Pro 5G కొనుగోలుపై రూ. 1,299 విలువైన ప్రత్యేక ప్రయోజనాలను పొందొచ్చని కంపెనీ ప్రకటించింది.
కొత్త Narzo 80 Pro 5G 6.77-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,392 పిక్సెల్స్) కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 180Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్, 800nits పీక్ బ్రైట్‌నెస్ లెవల్, ఐ ప్రొటెక్షన్ మోడ్‌తో ఉంటుంది. ఇది డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో వస్తుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2-మెగాపిక్సెల్ సెకండరీ యూనిట్ ఉంటాయి. సెల్ఫీల కోసం 16-మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు. హ్యాండ్‌సెట్ IP66, IP68, IP69 డస్ట్-వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌లతో వస్తుంది. ఫోన్ 162.75x74.92x7.55mm పరిమాణంతో 179గ్రాముల బరువు ఉంటుంది.
ఇది 6.72-అంగుళాల ఫుల్-HD+ (1,080X2,400 పిక్సెల్స్) ఫ్లాట్ LCD స్క్రీన్‌ను 120Hz రిఫ్రెష్ రేట్, 180Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్, 20:09 యాస్పెక్ట్ రేషియో, 690nits వరకూ హై బ్రైట్‌నెస్ లెవల్‌తో వస్తుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రధాన వెనుక సెన్సార్‌తో పాటు 2-మెగాపిక్సెల్ సెన్సార్, 8-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ను అందించారు. ఫోన్ 165.70x76.22x7.94mm పరిమాణంతో 197గ్రాముల బరువు ఉంటుంది.
ప్రకటన
ప్రకటన