రెడ్‌మీ K90 వైట్, బ్లాక్, ఆక్వా బ్లూ, లైట్ పర్పుల్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. ప్రో మాక్స్ మోడల్ డెనిమ్, గోల్డెన్ వైట్, బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.
Photo Credit: Redmi
ఈ ఫోన్‌లో 3nm టెక్‌తో రూపొందించిన తాజా Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్ ఉంది
రెడ్‌మీ చైనాలో తన తాజా ఫ్లాగ్‌షిప్ సిరీస్ రెడ్‌మీ K90 ప్రో మాక్స్ మరియు రెడ్‌మీ K90 స్మార్ట్‌ఫోన్‌లను గురువారం అధికారికంగా ఆవిష్కరించింది. ఈ సిరీస్‌లోని ప్రో మాక్స్ మోడల్ అత్యాధునిక Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్‌తో వస్తుంది. రెండు ఫోన్‌లు కూడా చైనాలో కంపెనీ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా విక్రయించబడతాయి. రెడ్‌మీ K90 వైట్, బ్లాక్, ఆక్వా బ్లూ, లైట్ పర్పుల్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. ప్రో మాక్స్ మోడల్ డెనిమ్, గోల్డెన్ వైట్, బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.
రెడ్‌మీ K90 ప్రో మాక్స్ బేస్ వేరియంట్ ధర CNY 3,999 (సుమారు రూ. 49,000).ఇది 12GB RAM + 256GB స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుంది.
ఇక 12GB + 512GB వేరియంట్ ధర CNY 4,499 (రూ.55,000), 6GB + 512GB వేరియంట్ ధర CNY 4,799 (రూ. 59,000).
అత్యున్నత వేరియంట్ 16GB RAM + 1TB స్టోరేజ్ డ్రా CNY 5,299 (రూ.65,000) గా ఉంది.
ఇక రెడ్‌మీ K90 ధరలు తక్కువగా ఉంటాయి. 12GB + 256GB మోడల్ CNY 2,599 (రూ. 32,000) నుండి ప్రారంభమవుతుంది. 16GB + 256GB మోడల్ CNY 2,899 (రూ. 35,000),12GB + 512GB మోడల్ CNY 3,199 (రూ. 39,000), 16GB + 512GB మోడల్ CNY 3,499 (రూ. 43,000). అత్యధిక వేరియంట్ 16GB + 1TB ధర CNY 3,999 (రూ.49,000)గా ఉంది.
ఈ రెండు ఫోన్‌లు Android 16 బేస్డ్ HyperOS 3 పై నడుస్తాయి. ప్రో మాక్స్ మోడల్‌లో 6.9 అంగుళాల (1,200×2,608 పిక్సెల్స్) OLED డిస్‌ప్లే ఉంది. దీనికి 120Hz రిఫ్రెష్ రేట్, 480Hz టచ్ శాంప్లింగ్ రేట్, 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, మరియు HDR10+, డాల్బీ విజన్, DCI-P3 కలర్ గ్యామట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆడియో విభాగంలో, ఇది Bose ట్యూన్ చేసిన 2.1 ఛానల్ ట్రిపుల్ స్పీకర్ సిస్టమ్ కలిగి ఉంది.
కెమెరా పరంగా, ఇది 50MP ప్రైమరీ సెన్సార్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, మరియు 50MP అల్ట్రావైడ్ లెన్స్ కలయికతో వస్తుంది. ఫ్రంట్‌లో 32MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే, 7,560mAh బ్యాటరీ తో పాటు 100W వైర్డ్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్, అలాగే 22.5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్, 5G, Wi-Fi 7, Bluetooth 5.4, NFC, NavIC, Galileo, GLONASS, A-GNSS వంటి కనెక్టివిటీ ఆప్షన్‌లు కూడా ఉన్నాయి. ఫోన్ బరువు 218 గ్రాములు, మందం 7.9mm మాత్రమే.
రెడ్‌మీ K90 కూడా అదే HyperOS 3 పై నడుస్తుంది. దీని 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే రిజల్యూషన్ 1,156×2,510 పిక్సెల్స్. కెమెరా సెటప్‌లో 50MP ప్రైమరీ సెన్సార్, 50MP టెలిఫోటో లెన్స్, మరియు 8MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 20MP. బ్యాటరీ కెపాసిటీ 7,100mAh, ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 22.5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.ఇది కూడా అదే కనెక్టివిటీ ఆప్షన్‌లను కలిగి ఉంటుంది. ఫోన్ బరువు 206 గ్రాములు, మందం 8mm.
ప్రకటన
ప్రకటన
Kepler and TESS Discoveries Help Astronomers Confirm Over 6,000 Exoplanets Orbiting Other Stars
Rocket Lab Clears Final Tests for New 'Hungry Hippo' Fairing on Neutron Rocket