Photo Credit: Xiaomi
Redmi Note 14 5G Xiaomi యొక్క Android 14-ఆధారిత HyperOS 1.0 ఇంటర్‌ఫేస్‌పై నడుస్తుంది
మన దేశంలో Redmi Note 14 5G ఇప్పుడు సరికొత్త ఫిన్షింగ్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ డిసెంబర్ 2024లోనే భారత్‌లో Mystique White, Phantom Purple, Titan Black షేడ్స్‌లో కలర్ ఆప్షన్‌లలో పరిచయం అయ్యింది. కొత్త కలర్ ఆప్షన్ మొబైల్‌లోని కిలక స్పెసిఫికేషన్స్‌లను చూస్తే.. ఇది 6.67-అంగుళాల డిస్‌ప్లే, MediaTek Dimensity 7025-Ultra ప్రాసెసర్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లను అందించారు. ఇది 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5110mAh బ్యాటరీతో IP64-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది.
తాజాగా, కొత్త ఐవీ గ్రీన్ కలర్ ఆప్షన్‌తో Redmi Note 14 5G ఇండియాలో 6GB + 128GB వెర్షన్ ధర రూ. 18,999గా ఉంది. అలాగే, 8GB + 128GB, 8GB + 256GB మోడల్‌ల ధర వరుసగా రూ. 19,999, రూ. 21,999గా ఉన్నాయి. అంతే కాదు, కొనుగోలుదారులు ICICI, HDFC, SBI క్రెడిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలతో రూ. 1,000 తక్షణ తగ్గింపును పొందొచ్చు. వీరు ఆరు నెలల వరకు నో-కాస్ట్ EMI ఆప్షన్‌ను కూడా సొంతం చేసుకోవచ్చు.
ఈ Redmi Note 14 5G తాజా కలర్ వేరియంట్ Mi వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేసుకునేందుకు సిద్ధంగా ఉంది. అలాగే, కొత్త మోడల్ గత సంవత్సరం డిసెంబర్‌లో మన దేశంలో ఫోన్ లాంఛ్ చేసినప్పటికే అందుబాటులో ఉన్న మిస్టిక్ వైట్, ఫాంటమ్ పర్పుల్, టైటాన్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లతో పాటు అందుబాటులో ఉంటుంది. తాజా Redmi Note 14 5G ఐపీ గ్రీన్ కలర్ వెర్షన్ ఇప్పటికే అందుబాటులో ఉన్న ఇతర కలర్ వేరియంట్‌ల మాదిరిగానే స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటుంది.
ఇది Xiaomi Android 14-ఆధారిత HyperOS 1.0 ఇంటర్‌ఫేస్‌పై రన్ అవుతుంది. అలాగే, 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 2,100 nits పీక్ బ్రైట్‌నెస్‌తో 6.67-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,400 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్‌తో వస్తుంది. 8GB వరకు RAM, 256GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో అండర్ ది హుడ్ MediaTek డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది.
ఫోన్ వెనుకవైపున 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సోనీ LYT-600 సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్-యాంగిల్ కెమెరా, 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను అందించారు. ఇది 20-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అలాగే, దుమ్ము నియంత్రణ కోసం IP64-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది. డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను, రెండు మైక్రోఫోన్‌లను అందించారు. ఈ హ్యాండ్‌సెట్ 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5110mAhని బ్యాటరీని కలిగి ఉంది. రెండు OS అప్‌గ్రేడ్‌లు, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుందని కంపెనీ స్పష్టం చేసింది.
ప్రకటన
ప్రకటన