Photo Credit: Samsung
ఇప్పటికే దేశీయ మార్కెట్‌లో విడుదలైన Galaxy A15 5G, Galaxy A15 4G హ్యాండ్‌సెట్‌లకు కొనసాగింపుగా Samsung Galaxy A16 5G, 4G వేరియంట్‌లు లాంచ్ కానున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ల గురించిన వివరాలు ఇటీవల ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో వచ్చిన లీక్‌లను బట్టీ 5G వెర్షన్‌తోపాటు 4G కూడా లాంచ్‌కు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. Galaxy A16 4G వెర్షన్ ప్రారంభ ధర కూడా అంచనా వేయబడింది. తాజాగా ఓ నివేదిక ఆదారంగా Galaxy A16 5G, 4G వేరియంట్‌ల స్పెసిఫికేషన్స్ బయటకొచ్చాయి.
తాజా Saminsider నివేదిక ప్రకారం.. Samsung Galaxy A16 4G, Galaxy A16 5G హ్యాండ్‌సెట్‌లు 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్-HD+ (2,340 x 1,080 పిక్సెల్‌లు) సూపర్ AMOLED స్క్రీన్‌లతో ఉంటాయని అంచనా వేస్తున్నారు. 6.5-అంగుళాల స్క్రీన్‌లతో ఇప్పటికే లాంచ్‌యిన Galaxy A15 ఫోన్‌ల కంటే ఈ హ్యాండ్‌సెట్‌లు పెద్ద డిస్‌ప్లేలను రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Galaxy A16 4G వేరియంట్ MediaTek Helio G99 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుందని అంచనా వేయబడింది. గత మోడల్ ప్రాసెసర్ కూడా ఇదే. అలాగే, Galaxy A16 5G Exynos 1330 ప్రాసెసర్‌తో వస్తుందని ఊహిస్తున్నారు. 5G వెర్షన్ మైక్రో SD కార్డ్ ద్వారా 1.5TB వరకు స్టోరేజీ విస్తరించుకోవచ్చు. 4G వేరియంట్ 1TB వరకు మాత్రమే స్టోరేజీని పెంచుకునే అవకాశం ఉంటుందని అంచనా. ప్రాసెసర్, స్టోరేజీ విస్తరణతోపాటు Galaxy A16 హ్యాండ్‌సెట్‌లు పలు ఫీచర్లను పంచుకోవచ్చని భావిస్తున్నారు. ఈ ఫోన్‌లలో 4GB RAM, 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. ఇవన్ని ఇతర శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే ఆండ్రాయిడ్ ఆధారిత యూజర్ ఇంటర్‌ఫేస్‌లో రన్ అవుతాయని భావిస్తున్నారు.
Samsung Galaxy A16 4G, 5G వేరియంట్‌లు రెండు కూడా ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌లను కలిగి ఉంటాయి. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, అల్ట్రా-వైడ్ లెన్స్‌తో కూడిన 5-మెగాపిక్సెల్ సెన్సార్, 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ ఉన్నాయి. వీటి కనెక్టివిటీ విషయానికి వస్తే.. డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.3, GPS, USB టైప్-సి పోర్ట్‌లు అందించనున్నారు. 5G వెర్షన్ NFCకి కూడా సపోర్ట్ చేస్తుంది. దుమ్ము, స్ప్లాష్ నిరోధకత కోసం IP54-రేటెడ్ బిల్డ్‌తో వస్తుంది.
అలాగే, భద్రత కోసం Galaxy A16 5G సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉండనున్నట్లు సమాచారం. Samsung Galaxy A16 5G, 4G రెండు వేరియంట్‌లు కూడా 5,000mAh బ్యాటరీ సమర్థ్యంతో 25W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసేలా రూపొందించినట్లు భావిస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్‌లు 164.4 x 77.9 x 7.9 మిమీ పరిమాణంతో ఒక్కొక్కటి 200 గ్రాముల బరువు ఉంటాయి.
ప్రకటన
ప్రకటన