Photo Credit: Samsung
అతి త్వరలోనే Samsung Galaxy M55s హ్యాండ్‌సెట్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టనున్నట్లు ఆ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ గెలాక్సీ M సిరీస్ స్మార్ట్‌ఫోన్ రెండు రంగులలో అందుబాటులోకి రానుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరాతో పాటు అదే రిజల్యూషన్‌తో సెల్ఫీ కెమెరా అమర్చారు. దీనికి ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయిన Samsung Galaxy M55 (రివ్యూ) మాదిరి 256GB వరకు స్టోరేజీతో జత చేయబడిన స్నాప్‌డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్‌ను అందించారు. Samsung Galaxy M55sకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం..!
దేశీయ మార్కెట్‌లోకి Samsung Galaxy M55s సెప్టెంబర్ 23న విడుదల కానున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో కోరల్ గ్రీన్, థండర్ బ్లాక్ కలర్‌వేస్‌లో అందుబాటులోకి రానుంది. అయితే, Galaxy M55s హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన RAM మరియు స్టోరేజ్ కాన్ఫిగరేషన్ విషయాలను Samsung ఇంకా ప్రకటించలేదు. అమెజాన్‌లోని మైక్రోసైట్ Samsung Galaxy M55sకు చెందిన కొన్ని స్పెసిఫికేషన్‌లను విడుదలకు ముందే వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1,000నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో 6.7-అంగుళాల సూపర్ AMOLED+ డిస్‌ప్లేను కలిగి ఉన్నట్లు దృవీకరించింది. అలాగే, ఏప్రిల్‌లో భారతదేశంలో లాంచ్ చేసిన గెలాక్సీ M55 మోడల్‌తో సమానంగా ఈ ఫోన్ 7.8mm థిక్‌నెస్‌తో ఉంటుందని Samsung చెబుతోంది.
మరీ ముఖ్యంగా Samsung Galaxy M55s హ్యాండ్‌సెట్ కెమెరా స్పెసిఫికేషన్‌లు కొనుగోలుదారులను ఎంతగానో ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇది 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాతో పాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరాను కలిగి ఉన్నట్లు లీక్ అయింది. అలాగే, తక్కువ కాంతిలో మెరుగైన కెమెరా ఫీచర్స్ అయిన Samsung నైటోగ్రఫీ, నో షేక్ కామ్ మోడ్ రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్‌తో Galaxy M55s స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారుల నుంచి మంచి ఆదరణ పొందే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత ఫోన్‌లతో పోల్చి చూసినప్పుడు దీని డిజైన్ కూడా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
కంపెనీ చెబుతున్నదాని ప్రకారం.. Samsung Galaxy M55s 50-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో మార్కెట్‌లోకి విడుదల కానుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఈ హ్యాండ్‌సెట్ వినియోగదారులు ముందు మరియు వెనుక కెమెరాలను ఉపయోగించి ఏకకాలంలో ఫోటోలను, వీడియోలను క్యాప్చర్ చేయడానికి అవకాశం కూడా ఉన్నట్లు కంపెనీ చెబుతోంది. ఈ ఫీచర్ రాబోయే మోడల్ స్మార్ట్‌ఫోన్‌పై ఆసక్తిని పెంచుతోంది. మొత్తంగా పరిశీలిస్తే.. Galaxy M55sకి సంబంధించిన పూర్తి వివరాలు దాని విడుదలకు ముందు రోజుల్లో వెల్లడయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మరి పూర్తి స్పెసిఫికేషన్స్‌తోపాటు ధర తెలుసుకోవాలంటే సెప్టెంబర్ 23 వరకూ వేచి చూడాల్సిందే!
ప్రకటన
ప్రకటన