Photo Credit: Samsung
Samsung అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Galaxy S25 సిరీస్ 2025 ప్రథమార్ధంలో విడుదల కానుంది. రాబోయే Galaxy S కూడా మునుపటి లైనప్‌ల మాదిరిగా వనిల్లా, ప్లస్, అల్ట్రా మోడల్‌లలో వస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. తాజాగా Galaxy S25+ వేరియంట్‌కు సంబంధించిన కీలక వివరాలు Geekbench బెంచ్‌మార్కింగ్ సైట్‌లో ప్రత్యక్షమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని Galaxy S25 ఫోన్‌లకు Samsung Snapdragon ప్రాసెసర్‌లను అందిస్తుందని గతంలోనే వార్తలు వచ్చాయి. ఈ మోడల్‌కు సంబంధించిన పలు సరికొత్త ఫీచర్స్ సైతం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో Geekbench బెంచ్‌మార్కింగ్ సైట్‌లో కనిపిస్తోన్న ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం!
Geekbench డేటాబేస్‌లో మోడల్ నంబర్ SM-S936Bతో గుర్తించబడిన Samsung హ్యాండ్‌సెట్ చాలావరకు Galaxy S25+ ప్రోటోటైప్‌ను పోలివుంది. లిస్టింగ్‌లో చూసినట్లుగా, ఇది సింగిల్-కోర్ స్కోర్ 2,359, మల్టీ-కోర్ స్కోర్ 8,141ని పొందగలిగింది. ఈ హ్యాండ్‌సెట్‌లో 10.72GB RAM ఉంది. ఇది పేపర్‌పై 12GBకి ట్రాన్స్‌లేట్ చేయవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 15లో రన్ అవుతోంది.
అలాగే, s5e9955 కోడ్‌నేమ్ గల మదర్‌బోర్డ్‌తో కూడిన టెన్-కోర్ చిప్‌సెట్ ఫోన్‌కు శక్తినిస్తుందని లిస్టింగ్ సూచిస్తుంది. CPU 1+2+5+2 ఆర్కిటెక్చర్‌ను కలిగి ఉంది. ఈ జాబితాలో 3.30GHz క్లాక్ స్పీడ్‌తో ఒక ప్రధాన CPU కోర్‌ను చూపుతుంది. అలాగే, రెండు కోర్లు 2.75GHz వద్ద, ఐదు కోర్‌లు 2.36GHz వద్ద ఉంటాయి. చివరగా, CPU 1.80GHz వద్ద రెండు కోర్లను కలిగి ఉంది. ఈ CPU వేగం Exynos 2500 ప్రాసెసర్‌తో అసోషియేట్ చేయబడింది.
సింగిల్-కోర్, మల్టీ-కోర్ స్కోర్‌లు రెండూ Qualcomm తాజా స్నాప్‌డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ కంటే Exynos 2500ని గణనీయంగా వెనుక ఉంచాయి. కొన్ని నెలల క్రితం Snapdragon 8 Elite ప్రాసెసర్ (SM-S938U)తో Galaxy S25 Ultra US వేరియంట్ సింగిల్-కోర్ టెస్టింగ్‌లో 3,069 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్టింగ్‌లో 9,080 పాయింట్లతో Geekbench జాబితా చేయబడింది. దీంతో ఈ మోడల్‌పై మార్కెట్ వర్గాలు మరింత ఆసక్తి కనబరుస్తున్నాయి.
Samsung Galaxy S25 లైనప్‌లో Snapdragon 8 Elite ప్రాసెసర్‌లను ఉపయోగిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది గుర్తించబడిన మార్కెట్‌లలో Snapdragon 8 Gen 4 SoC ప్రాసెసర్‌తో గెలాక్సీ S24 సిరీస్‌ను అందించింది. మిగిలిన గ్లోబల్ మార్కెట్ కోసం Exynos 2400 చిప్‌ను అందించింది. 2023లో ఈ బ్రాండ్ అన్ని Galaxy S సిరీస్ ఫోన్‌లను స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌లతో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది. రానున్న ఈ మోడల్‌లో కొన్ని చిన్న మార్పులతో 2024 మోడల్‌ల మాదిరిగానే ఉంటుందని, అయితే, గెలాక్సీ S25 సిరీస్ ప్రస్తుత మోడల్ కంటే సన్నగా ఉంటుందని భావిస్తున్నారు. Galaxy S25 సిరీస్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
ప్రకటన
ప్రకటన