Photo Credit: Meizu
Meizu Note 16 Pro (చిత్రంలో) 16GB వరకు RAM మరియు 512GB వరకు నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంది
గ్లోబల్ మార్కెట్‌లోకి స్నాప్‌డ్రాగన్ 8 లైట్ ప్రాసెసర్‌తో Samsung Galaxy S25 Edge గ్రాండ్‌గా అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ సరికొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ మన దేశంలో ప్రీ ఆర్డర్‌లకు కంపెనీ అవకాశం కల్పించింది. మరీ ముఖ్యంగా, 200 మెగాపిక్సెల్స్ డ్యూయల్ రియల్ కెమెరా యూనిట్ కొనుగోలుదారులను మరింత ఆకర్షిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీని డిస్‌ప్లే ప్రొటక్షన్ కోసం క్రోనింగ్ గెరిల్లా గ్లాస్ Ceramic 2 తో రూపొందించారు. ఈ హ్యాండ్‌సెట్ 12జీబీ ర్యామ్‌తో 256జీబీ, 512జీబీ స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తుంది. కొత్త Samsung Galaxy S25 Edge స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన ధరతోపాటు పూర్తి స్పెసిఫికేషన్స్‌ను కంపెనీ వెల్లడించింది.
కంపెనీ Samsung Galaxy S25 Edge కు సంబంధించిన స్పెసిఫికేషన్స్‌తోపాటు ధరలను కూడా వెల్లడించింది. దీని 12జీబీ+256జీబీ వేరియంట్ రూ.1,09,999 నుంచి మొదలవుతుంది. అలాగే, ఇందులోని 12జీబీ+512జీబీ ఆప్షన్ ధర 1,21,999గా ఉంది. అయితే, మన దేశంలో ప్రీ ఆర్డర్ ఆఫర్‌లో భాగంగా కొనుగోలుదారులు 512జీబీ వేరియంట్‌ను 256జీబీ వేరియంట్ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ టైటానియం సిల్వర్, టైటానియం జెట్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.
కొత్త Samsung Galaxy S25 Edge స్మార్ట్ ఫోన్ డిస్‌ప్లే గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది కార్నింగ్ గ్లాస్ సిరామిక్ 2 ప్రొటక్షన్‌తో 6.7 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండి, 120 హెచ్‌జెడ్ వరకూ రిఫ్రెష్ రేట్‌తో వస్తోంది. అలాగే, దీనికి స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను 12జీబీ ర్యామ్, 512జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజీతో అటాచ్ చేసి, అందిస్తున్నారు. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఒన్ యూఐ 7 తో వస్తోంది.
కెమెరా విషయానికి వస్తే.. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ను 2ఎక్స్ ఆప్టికల్ ఇన్ సెన్సార్ జూమ్, ఓఐఎస్ సపోర్ట్‌తో Galaxy S25 Edge రూపొందించబడింది. అలాగే, 12 మెగాపిక్సెల్ ఆల్ట్రా వైడ్ షూటర్‌ను వెనుక భాగంలో అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ప్రత్యేకంగా 12 మెగాపిక్సెల్ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ కెమెరా ఫీచర్స్ కొనుగోలుదారులను ఆకర్షిస్తాయని కంపెనీ భావిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Samsung Galaxy S25 Edge ఫోన్ 158.2 x 75.6 x 5.8 ఎంఎం పరిమాణంతో 163 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. ఈ మోడల్ హ్యాండ్‌సెట్ కనెక్టివిటీ ఆప్షన్‌ల విషయానికి వస్తే, ఇది 5జీ, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 5.4, Wi-Fi 7, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్‌లు ఉంటాయి. ఇది 3,900 mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీతో 25 W వైర్డ్, క్యూఐ వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రూపొందించబడింది. దుమ్ము, నీటి నియంత్రణకు ఐపీ68- రేటెడ్ బిల్డ్‌తో వస్తుంది.
ప్రకటన
ప్రకటన