Photo Credit: Samsung
Samsung Galaxy S25 Ultraలో క్వాడ్ రియర్ కెమెరా యూనిట్ ఉంది
శాంసంగ్ గ్యాడ్జెట్ ప్రియులకు అదిరిపోయే వార్త. ఫ్లాగ్‌షిప్ ఫోన్ శాంసంగ్ గెలాక్సి ఎస్ 25 అల్ట్రా(Samsung Galaxy S25 Ultra)పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. జనవరిలో భారత్‌లో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.1,29,999. ప్రస్తుతం ఈ మోడల్‌పై రూ.12,000 క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. వినియోగదారులు ఎక్స్‌ఛేంజ్, బ్యాంక్ కార్డ్‌లు, ఈఎంఐ ఆప్షన్ల మరింత డిస్కౌంట్ పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌లో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్‌ను ఉపయోగించారు. ఇది 12GB RAM, 1TB వరకు స్టోరేజ్‌తో వస్తోంది. 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా యూనిట్‌తో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.డిస్కౌంట్స్ ఇలా,శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా(Samsung Galaxy S25 Ultra) అన్ని వేరియంట్లపై ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. రూ. 12,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. ఈ ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే ఉండనుంది. ఈ స్మార్ట్ ఫోన్ 256GB బెస్ వేరియంట్ అసలు ధర రూ.1,29,999 ఉండగా.. ప్రస్తుతం 1,17,999కే లభిస్తోంది. 512GB స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర రూ.1,41,999 ఉండేది. ఇప్పుడు దీనిని రూ.1,29,999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ మోడల్‌లో టాప్ 1TB వేరియంట్ అసలు ధర రూ. 1,65,999. ఇది ప్రస్తుతం రూ. 1,53,999 వద్ద కొనుగోలు చేయవచ్చు.
అతి తక్కువ నో-కాస్ట్ ఈఎంఐ
వినియోగదారులు అమెజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.3,222 క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు. కస్టమర్లు అతితక్కువ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ద్వారా నెలకు రూ. 3,278 చెల్లించి ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.
భారీ ఎక్స్చేంజ్ ధమాకా
అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్స్చెంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. పాతఫోన్ ఎక్స్చెంజ్ చేయడం ద్వారా రూ. 75,000 వరకు తగ్గింపు పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రాలో అద్భుతమై AI ఫీచర్లు ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారంగా వన్ యూఐ 7 స్కిన్‌పై పనిచేస్తుంది. ఇందులో 5,000mAh బ్యాటరీ అమర్చారు. ఇది 45W వైర్డ్ ఛార్జింగ్‌తో పాటు 15W వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
ఇది టైటానియం సిల్వర్‌బ్లూ, టైటానియం గ్రే, టైటానియం బ్లాక్, టైటానియం వైట్ సిల్వర్ రంగుల్లో లభిస్తోంది. అయితే, శాంసంగ్ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేసే కస్టమర్లకు సరికొత్త రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. టైటానియం జేడ్‌గ్రీన్, టైటానియం జెట్‌బ్లాక్, టైటానియం పింక్‌గోల్డ్ రంగులలో కూడా కొనవచ్చు.
ఈ గ్యాడ్జెట్ 120hz రిఫ్రెష్ రేట్‌తో 6.9 అంగుళాల QHD+ అమోల్డ్ డిస్‌ప్లెతో వచ్చింది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ కలిగి ఉంది. 12GB వరకు ర్యామ్, 1TB వరకు స్టోరేజీతో వస్తుంది.
క్వాడ్ కెమెరా సిస్టమ్
ఇక కెమెరా విషయానికొస్తే.. ఇందులో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 200MP మెయిన్ కెమెరా ఉంది. ఇదికాక 50MP అల్ట్రా వైడ్ కెమెరా, మరొక 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 3x జూమ్‌తో కూడిన 10MP టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో 12MP సెల్ఫీ కెమెరా సిస్టమ్ ఉంది.
ప్రకటన
ప్రకటన