Galaxy S25 Ultraపై డిస్కౌంట్ పరిమితకాల ఆఫర్ అని కంపెనీ స్పష్టం చేసింది. ఈ మొబైల్‌కు స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా యూనిట్, Galaxy AI ఫీచర్స్ సూట్ వంటివి అందించారు.
Samsung Galaxy S25 Ultra అంతర్నిర్మిత S-పెన్ స్టైలస్‌తో వస్తుంది
ఎలక్ట్రానిక్ ఉత్పత్తులలో దిగ్గజంగా పేరొందిన Samsung సరికొత్త తగ్గింపు ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఈ ఏడాది జనవరిలో విడుదలైన Samsung Galaxy S25 Ultraపై డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ మొబైల్ కొనుగోలుదారులు కంపెనీ ఇచ్చే ఆఫర్‌లో భాగంగా స్పెషల్ డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే, కంపెనీ అధికారిక వెబ్ సైట్‌లో అదనపు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లతోపాటు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌లను పొందడం ద్వారా మరింత తగ్గింపు ధరను సొంతం చేసుకోవచ్చు. అయితే, ఇది పరిమితకాల ఆఫర్ అని కంపెనీ స్పష్టం చేసింది. ఈ మొబైల్‌కు స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా యూనిట్, Galaxy AI ఫీచర్స్ సూట్ వంటివి అందించారు.12000 డిస్కౌంట్ ఆఫర్,Samsung Galaxy S25 Ultra బేస్ 12జీబీ RAM +256జీబీ స్టోరేజీ వేరియంట్ ప్రారంభ ధర మన దేశంలో రూ. 1,29,999గా కంపెనీ నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, కంపెనీ ఆఫర్‌లో భాగంగా ఈ హ్యాండ్‌సెట్‌పై రూ. 12000 డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ పరిమిత కాల ఆఫర్ ద్వారా Galaxy S25 Ultra స్మార్ట్ ఫోన్‌ను రూ. 1,17,999లకు కొనుగోలుదారులు సొంతం చేసుకోవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. ఈ ఆఫర్ సేల్‌లో S25 Ultra అమ్మకాలు మరింత పెరుగుతాయని కంపెనీ భావిస్తోంది.
పై వేరియంట్‌తోపాటు ఈ మోడల్‌లో ఇతర కాన్ఫిగరేషన్‌లకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. రిటైల్ దర రూ. 1,41,999గా ఉన్న 12జీబీ RAM+ 512జీబీ స్టోరేజ్ వేరియంట్ Galaxy S25 Ultra ఆఫర్‌లో భాగంగా రూ. 1,29,999లకు లభించనుంది. ఈ ధరను మరింత తగ్గించేందుకు ట్రేడ్ ఇన్ ఆఫర్‌లను కూడా కొనుగోలుదారులు వినియోగించవచ్చని కంపెనీ తెలిపింది. వినియోగంలో ఉన్న పాత ఫోన్ మోడల్, కండిషన్, ఆఫర్‌లను బట్టీ రూ. 75,000 వరకూ తగ్గింపును పొందొచ్చు.
ట్రేడ్ ఇన్ ఆఫర్ విషయంలో పూర్తి నిర్ణయాధికారం కంపెనీకే ఉంటుంది. ఇందులో తగ్గింపు అవకాశాలను పరిశీలిస్తే, వినియోగంలో మంచి కండీషన్‌లో ఉన్న Galaxy S24 Ultra స్మార్ట్ ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకోవడం ద్వారా ఏకంగా రూ. 57,650 వరకూ డిస్కౌంట్‌తో కొత్త మొబైల్‌ను సొంతం చేసుకోవచ్చు. దీంతో Galaxy S25 Ultra ను కేవలం రూ. 60,349 కే కొనుగోలు చేయవచ్చు.
లైవ్‌లో మల్టీ బై ఆఫర్ సైతం మొబైల్‌పై ప్రకటించింది. Samsung Galaxy S25 Ultra స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే సమయంలో Galaxy Watch Ultra, Galaxy Buds 3 సిరీస్ బండిల్‌పై సుమారు రూ. 18000 వరకూ ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. అంతే కాదు, నెలకు 9,833.24 నుంచి మొదలయ్యే నెల ఈఎంఐను ఆఫర్‌లో భాగంగా రూ. 5,721.37 లకు అందించేందుకు Samsung ముందుకు వచ్చింది. మరెందుకు ఆలస్యం.. ఈ పరిమితకాల ఆఫర్‌ను అస్సలు మిస్సవ్వొద్దు.
ప్రకటన
ప్రకటన