Photo Credit: Huawei
ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిపుల్-స్క్రీన్ ఫోల్డబుల్ ఫోన్ హువావే మేట్ XT అల్టిమేట్ డిజైన్‌ను గత సంవత్సరం ఆవిష్కరించి, కంపెనీ స్మార్ట్ ఫోన్ వినియోగదారులను అకట్టుకుంది. అయితే, Samsung తన సొంత ట్రై-ఫోల్డ్ ఫోన్‌ను పరిచయం చేయడం ద్వారా హువావేకి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ దక్షిణ కొరియా బ్రాండ్ తన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2025 ఈవెంట్ సందర్భంగా తన మొదటి మల్టీ-ఫోల్డ్ ఫోన్‌ను టీజ్ చేసింది. తాజాగా ఈ మోడల్ పేరును సూచించే కొత్త లీక్ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యింది. ఈ Samsung ట్రై-ఫోల్డ్ ఫోన్ 10-అంగుళాల డిస్‌ప్లేతో వచ్చే అవకాశం ఉంది.
దక్షిణ కొరియా బ్లాగ్ నేవర్‌లోని యూక్స్1122 అనే ఒక టిప్‌స్టర్ ద్వారా.. దీనిని Z ఫోల్డ్ సిరీస్ పేరుతో వచ్చిన డిజైన్ ఆధారంగా, ఈ Samsung మల్టీ-ఫోల్డ్ ఫోన్‌ను గెలాక్సీ G ఫోల్డ్ అని పలిచే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది. అలాగే, పరిశ్రమ వర్గాలతోపాటు డిస్‌ప్లే విశ్లేషకుడు రాస్ యంగ్‌ను గుర్తు చేస్తూ.. ఈ హ్యాండ్‌సెట్ వచ్చే ఏడాది జనవరిలో విడుదల అవుతుందని టిప్‌స్టర్ పేర్కొన్నాడు. దీనిపై పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది.
Samsung నుంచి రాబోయే గెలాక్సీ G ఫోల్డ్ ఫోన్ 9.96-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని, ఇది గెలాక్సీ Z ఫోల్డ్ 6 ఫోన్‌కు చెందిన 7.6-అంగుళాల స్క్రీన్ కంటే పెద్దదిగా ఉంటుందని భావిస్తున్నారు. ఇది మడతపెట్టినప్పుడు 6.54 అంగుళాల పరిమాణం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. శామ్‌సంగ్ ట్రై-ఫోల్డ్ ఫోన్ మడత పెట్టే విధానం హువావే మేట్ XT అల్టిమేట్ డిజైన్‌కు భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ రాబోయే హ్యాండ్‌సెట్‌లో డిస్‌ప్లే రెండు వైపుల నుండి లోపలికి మడవడానికి అనువుగా ఉండే మడత విధానం ఉందని ప్రచారంలో ఉంది.
బ్లాగ్ పోస్ట్‌లో గెలాక్సీ G ఫోల్డ్ బరువు H బరువుతో సమానంగా ఉంటుందని చెప్పబడింది. ఇది హువావే మేట్ XT అల్టిమేట్ డిజైన్‌ను సూచిస్తున్నట్లు కావచ్చు. అయితే, Samsung ట్రై-ఫోల్డబుల్ హ్యాండ్‌సెట్ కొంచెం మందంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. గెలాక్సీ G ఫోల్డ్‌లో కొత్తగా డెవలప్ చేసిన డిస్‌ప్లేలు, ప్రొటెక్టివ్ ఫిల్మ్‌లను ఉపయోగించనున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతేకాదు, దీని స్పెసిఫికేషన్స్‌లో కూడా అనేక మార్పులు ఉండొచ్చని భావిస్తున్నారు.
ఇటీవల ముగిసిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2025 ఈవెంట్ సందర్భంగా, Samsung ప్రొడక్ట్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫీస్ అధిపతి జే కిమ్ ట్రై-ఫోల్డింగ్ ఫోన్ గురించి క్లుప్తంగా వివరించారు. కంపెనీ, ఈ బ్రాండ్ ట్రిపుల్ ఫోల్డింగ్ ఫోన్ 3,00,000 యూనిట్లను (లేదా అంతకంటే తక్కువ) తయారు చేస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. అలాగే, ఇది అధిక ధరల జాబితాలో అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. మరి, ఈ హ్యాండ్‌సెట్ హువావేకు ఎంతవరకూ పోటీ ఇస్తుందో చూడాలి.
ప్రకటన
ప్రకటన