Photo Credit: Vivo
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీ Vivo Y సిరీస్ నుంచి Vivo Y19s స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇది 8GB RAM, 128GB స్టోరేజ్‌తో పాటు ఆక్టా కోర్ యూనిసోక్ ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.68-అంగుళాల LCD స్క్రీన్‌తో రూపొందించబడింది. అలాగే, 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరాను కలిగి ఉంది. కంపెనీ ప్రకటన ప్రకారం.. ఇది 5,500mAh బ్యాటరీతో వస్తుంది. Vivo Y19s కంపెనీ Funtouch OS 14 ఇంటర్‌ఫేస్‌తో పాటు Android 14లో రన్ అవుతుంది.
కంపెనీ Vivo Y19s ధర ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అంతేకాదు, ఈ స్మార్ట్‌ఫోన్ ఇంకా కంపెనీ ఆన్‌లైన్ స్టోర్‌ల జాబితాలో కూడా కనిపించడం లేదు. ఇది బంగ్లాదేశ్, యుఎఇ, రష్యా, వియత్నాం, మయన్మార్, పాకిస్తాన్, సౌదీ అరేబియా, కంబోడియా, ఈజిప్ట్, థాయిలాండ్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌లలో నలుపు, నీలం, వెండి రంగులలో అందుబాటులో ఉంటుంది. అయితే, ఈ హ్యాండ్‌సెట్ మన దేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందన్న విషయాన్నిపై ఎలాంటి సమాచారం లేదు. గ్లోబల్ మార్కెట్‌లో ఇన్ని దేశాలలో అందుబాటులోకి వచ్చిన ఈ Vivo Y19s స్మార్ట్ ఫోన్ మన దేశంలో అడుగుపెట్టకపోవడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
కొత్తగా విడుదలైన ఈ Vivo Y19s స్మార్ట్ ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో+నానో)తో ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఫన్‌టచ్ OS 14పై రన్ అవుతుంది. అలాగే, 6.68-అంగుళాల HD+ (720x1,608 పిక్సెల్‌లు) LCD స్క్రీన్‌తో 90Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 6GB LPDDR4X RAMతో అటాచ్ చేయబడిన 12nm ఆక్టా కోర్ Unisoc T612 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్ 5,500mAh బ్యాటరీ కలిగి, ఛార్జింగ్ అడాప్టర్‌తో దీనిని 15W వద్ద ఛార్జ్ చేయవచ్చు. బయోమెట్రిక్ కోసం సైడ్ మౌంటెడ్ కెపాసిటివ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఇది 165.75×76.10×8.10mm పరిమాణంతో 198 గ్రాముల బరువు ఉంటుంది. కంపెనీ ప్రకటన ప్రకారం.. థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్‌లోని కొనుగోలుదారులు మొబైల్ బాక్స్‌లో ఛార్జర్‌ను పొందలేరని తెలిపింది.
అలాగే, ఈ Vivo Y19sలో ఫోటోలు, వీడియోల కోసం 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను f/1.8 ఎపర్చరుతో పాటు f/3.0 ఎపర్చర్‌తో 0.08-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్‌లు కోసం పంచ్ కటౌట్‌లో ఉన్న 5-మెగాపిక్సెల్ కెమెరాను ఉపయోగించుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌లో 128GB eMMC 5.1 స్టోరేజీని అందించారు. అలాగే, దీనిని మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చు. ఫోన్ USB టైప్-సి పోర్ట్‌తో పాటు 4G LTE, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.2, GPS కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. బోర్డ్‌లోని సెన్సార్‌లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్, వర్చువల్ గైరోస్కోప్ ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన