Vivo S50 సిరీస్‌లో వేర్వేరు సైజు డిస్‌ప్లేలతో రెండు మోడల్‌లు రానున్నాయి. ఇందులో స్టాండర్డ్ మోడల్ 1.5K రిజల్యూషన్‌ను అందించే 6.59-అంగుళాల ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
Photo Credit: Vivo
ఈ నెల ప్రారంభంలో వివో X300 సిరీస్
వివో నుంచి నవంబర్‌లో కొత్త మోడల్ రానుంది. అక్టోబర్‌లో Vivo X300 సిరీస్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. Vivo నుంచి నెక్ట్స్ S50 సిరీస్ రానుంది. నివేదికల ప్రకారం కొత్త S-సిరీస్ వచ్చే నెల (నవంబర్) చైనాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ లాంచ్‌కు ముందే.. విశ్వసనీయ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ (DCS) Vivo S50, S50 ప్రో మినీ గురించి కీలక వివరాలను లీక్ చేసింది. డీసీఎస్ ప్రకారం వివో S50 సిరీస్‌లో వేర్వేరు సైజు డిస్‌ప్లేలతో రెండు మోడల్‌లు ఉంటాయి. లీక్ ప్రకారం స్టాండర్డ్ మోడల్ 1.5K రిజల్యూషన్‌ను అందించే 6.59-అంగుళాల ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది మెటల్ మిడిల్ ఫ్రేమ్, పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో అటాచ్ చేసి ఉంటుంది. టెలిఫోటో యూనిట్ ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ నాణ్యత మీడియం-సైజ్ సెన్సార్‌ను కలిగి ఉందని చెబుతున్నారు. ఇది జూమ్ ఫోటోగ్రఫీలో గుర్తించదగిన అప్‌గ్రేడ్‌ను సూచిస్తుంది.
మరోవైపు వివో S50 ప్రో మినీ 1.5K రిజల్యూషన్‌కు సపోర్ట్ చేస్తూ 6.31-అంగుళాల ఫ్లాట్ డిస్‌ప్లేతో కూడిన కాంపాక్ట్ ఆఫర్‌గా ఉంటుంది. ప్రో మోడల్ కావడంతో ఇది టాప్-టైర్ కెమెరా హార్డ్‌వేర్‌ను కలిగి ఉంటుంది. రెండు ఫోన్‌లలో 50-మెగాపిక్సెల్ ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా ఉంటుందని తెలుస్తోంది.
వివో S50 సిరీస్‌కు ఏ చిప్‌సెట్ శక్తినిస్తుంది అని ఓ యూజర్ అడిగినప్పుడు.. టిప్‌స్టర్ ప్రో వేరియంట్‌కు 3M AnTuTu స్కోర్‌ను సాధించగల ఫ్లాగ్‌షిప్ చిప్‌ను సూచించినట్లు తెలుస్తోంది. ఇది వరకు వచ్చిన లీక్ ప్రకారం ఈ పరికరం గత సంవత్సరం Vivo X200 సిరీస్‌కు శక్తినిచ్చిన డైమెన్సిటీ 9400తో అమర్చబడి ఉండవచ్చు.
ఈ లీక్ ప్రకారం వివో S50 ప్రో మినీలో పెరిస్కోప్ కెమెరాతో కూడిన ట్రిపుల్-కెమెరా సెటప్‌ను అమర్చవచ్చని కూడా సూచించింది. సెక్యూరిటీ కోసం అల్ట్రాసోనిక్ ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా పెట్టారని తెలుస్తోంది.
Vivo S50 సిరీస్ ఒప్పో రెనో 15 లైనప్, హానర్ 500 సిరీస్ నుండి పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది. ఇవి నవంబర్‌లో చైనాలో లాంచ్ కానున్నాయి.
Vivo కూడా ప్రపంచ మార్కెట్ కోసం Vivo X300 FE పై పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. చైనా-ప్రత్యేకమైన Vivo S30 Pro Miniని ప్రపంచవ్యాప్తంగా Vivo X200 FE గా రీబ్రాండ్ చేశారు. అందువల్ల X300 FE అనేది S50 Pro Mini రీబ్యాడ్జ్ చేయబడిన వెర్షన్ కావచ్చని తెలుస్తోంది.
ఇక చైనాలో నాలుగు అనేది అన్ లక్కీ నంబర్ కావడంతో Vivo S40 సిరీస్‌ను లాంఛ్ చేయలేదని తెలుస్తోంది. ఎస్30 తరువాత నేరుగా ఎస్50 సిరీస్‌ను వివో లాంఛ్ చేసినట్టుగా సమాచారం.
ప్రకటన
ప్రకటన