Photo Credit: Vivo
వివో T3 అల్ట్రా (చిత్రంలో) డిజైన్ ప్రీమియం వివో V-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల నుండి ప్రేరణ పొందింది
Vivo నుంచి ఇటీవలే మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో Vivo T4 పరిచయం అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ T సిరీస్ నుంచి Vivo T4 Ultra పేరుతో హై ఎండ్ వేరియంట్ అందుబాటులోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి, Vivo T సిరీస్కు మిడ్ రేజ్ వేరియంట్కు హై ఎండ్ లేబుల్ వేరియంట్ కొత్తేమీ కాదు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న Vivo T3 Ultra మోడల్ రూ. 27,999 ధరతో కొనుగోలుకు అందుబాటులో ఉంది. కొత్తగా రాబోయే Vivo T4 Ultra కు సంబంధించిన కీలక స్సెసిఫికేషన్స్ తోపాటు లాంఛ్ టైం లైన్ ను ఓ టిప్‌స్టర్ వెల్లడించారు.6.67 అంగుళాల pOLED ప్యానెల్,Vivo నుంచి కొత్తగా మార్కెట్‌కు పరిచయం కాబోయే ఈ Vivo T4 Ultra మోడల్ స్మార్ట్ ఫోన్ 120 హెచ్జెడ్ స్క్రీన్ రేట్‌తో వస్తోంది. ఇది 6.67 అంగుళాల pOLED ప్యానెల్ తో రూపొందించబడింది. ఈ సిరీస్ మీడియాటెక్ Dimensity 9300 ప్రాసెసర్ ద్వారా శక్తిని గ్రహిస్తుంది. రాబోయే Vivo T4 Ultra హ్యాండ్‌సెట్ ఏ ప్రాసెసర్ తో ప్రత్యేకంగా వస్తుందనే విషయాన్ని మాత్రం టిప్‌స్టర్ బహిర్గతం చేయలేదు.
ఈ మొబైల్ కు సంబంధించి టిప్‌స్టర్ షేర్ చేసిన దాని ప్రకారం.. దీని కెమెరా విభాగం బిగ్ అప్ గ్రేడ్ ను కలిగి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇందులోని ప్రైమరీ కెమెరా గతంలో మాదిరిగానే 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్921 సెన్సార్ తో రూపొందించినట్లు భావిస్తున్నారు. 50 మెగాపిక్సెల్ ఆల్ట్రావైడ్ కెమెరాను 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో కవర్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.90 W ఛార్జింగ్ కు సపోర్ట్,Vivo T4 Ultra స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 తో రన్ అవుతుందని తెలుస్తోంది. అలాగే, దీని బ్యాటరీ సామర్థ్యానికి సంబంధించిన వివరాలు వెల్లడించినప్పటికీ, ఇది 90 W ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుందని షేర్ చేయడంతో, ఇదే నిజమైతే మాత్రం అవుట్ గోయింగ్ మోడల్ కంటే రాబోయే మోడల్ మరింత ప్రత్యేకతను సంతరించుకుంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న Vivo T3 Ultra మోడల్ 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+120 హెచ్‌జెడ్ AMOLED డిస్‌ప్లేతో రూపొందించబడింది. ఇది మీడియాటెక్ Dimensity+ ప్రాసెసర్ ద్వారా శక్తిని గ్రహిస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతోపాటు వెనుక 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాను దీనికి అందించారు. దీనికి 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కూడా అందించారు. ఈ ఫోన్ 5,550 mAh బ్యాటరీతో 80 W వైర్డు ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీని 8జీబీ+ 128జీబీ బేస్ వేరియంట్ ధర రూ. 27,999 ఉండగా, 12జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ. 31,999గా ఉంది.
ప్రకటన
ప్రకటన