త్వరలో భారత్‌లోకి అడుగుపెట్టనున్న Vivo V60. ఫీచర్లు, లాంచ్ డేట్, మరియు ప్రత్యేకతలు మీకోసం

ఇప్పటికీ Vivo సంస్థ ఈ ఫోన్‌ను అధికారికంగా ప్రకటించలేదు. కానీ, Vivo V60 మోడల్ నెంబర్ V2511తో SIRIM మరియు TUV సర్టిఫికేషన్ వెబ్‌సైట్లలో లిస్టింగ్ కావడంతో దీని డీటెయిల్స్ బయటకు వచ్చాయి. ఈ లిస్టింగ్ ప్రకారం, ఫోన్‌కు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది.

త్వరలో భారత్‌లోకి అడుగుపెట్టనున్న Vivo V60. ఫీచర్లు, లాంచ్ డేట్, మరియు ప్రత్యేకతలు మీకోసం

Photo Credit: Vivo

వివో V60, వివో S30 యొక్క సవరించిన వెర్షన్‌గా ప్రారంభమవుతుందని ఊహిస్తున్నారు (చిత్రంలో)

ముఖ్యాంశాలు
  • వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెట్ అప్
  • 6000mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీ బ్యాకప్
  • తొలిసారి పరిచయం కానున్న OriginOS
ప్రకటన

ప్రముఖ చైనా మొబైల్ బ్రాండ్ వివో సంస్థ త్వరలో భారత మార్కెట్‌లోకి తన కొత్త స్మార్ట్‌ఫోన్ Vivo V60ను తీసుకొస్తుందన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ఫోన్ ఇటీవల వచ్చిన Vivo V50కి కంటిన్యూషన్ గా తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ ఫోన్ భారత మార్కెట్‌లో OriginOS అనే యూజర్ ఇంటర్‌ఫేస్‌తో విడుదలయ్యే అవకాశం ఉంది, ఇది ఇప్పటివరకు కేవలం చైనా మార్కెట్‌కే పరిమితమైన ప్రత్యేక సాఫ్ట్‌వేర్.ప్రముఖ టెక్నాలజీ నిపుణుడు అభిషేక్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం, Vivo V60 భారతదేశంలో 2025 ఆగస్టు 19న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్‌తో పాటు Android 16 ఆధారంగా రూపొందించిన OriginOS కూడా తొలిసారి భారత వినియోగదారులకు పరిచయం కానుంది. ఇప్పటి వరకు భారతదేశంలో విడుదలైన Vivo ఫోన్లన్నీ FuntouchOSతో వచ్చినప్పటికీ, ఈసారి OriginOS పరిచయం కావడం వినియోగదారులకు కొత్త అనుభవం దొరుకుతుంది.

ఇప్పటికీ Vivo సంస్థ ఈ ఫోన్‌ను అధికారికంగా ప్రకటించలేదు. కానీ, Vivo V60 మోడల్ నెంబర్ V2511తో SIRIM మరియు TUV సర్టిఫికేషన్ వెబ్‌సైట్లలో లిస్టింగ్ కావడంతో దీని డీటెయిల్స్ బయటకు వచ్చాయి. ఈ లిస్టింగ్ ప్రకారం, ఫోన్‌కు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది.

Vivo V60 స్పెసిఫికేషన్ల అంచనా:

లీకైన సమాచారం ప్రకారం, Vivo V60లో 6.67 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే (1260x2800 పిక్సెల్స్) ఉండనుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుందని భావిస్తున్నారు. ప్రాసెసర్ పరంగా, ఇది స్నాప్ డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్‌తో రాబోతుందని సమాచారం. RAM పరంగా 12GB వరకు ఉండే అవకాశం ఉంది, అలాగే స్టోరేజ్ ఎంపికల్లో 256GB నుండి 512GB వరకు ఉండొచ్చు.

ఈ ఫోన్‌లో 50MP ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది. వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుందని భావిస్తున్నారు, ఇందులో 50MP Sony LYT700V ప్రైమరీ సెన్సార్, 50MP పెరిస్కోప్ లెన్స్ మరియు 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటాయని సమాచారం.

ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే 6,500mAh సామర్థ్యంతో కూడిన భారీ బ్యాటరీకి 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇవ్వనుంది. అదనంగా, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ మరియు ఫేస్ అన్‌లాక్ వంటి ఆధునిక భద్రతా ఫీచర్లు ఈ ఫోన్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

ఇప్పటి వరకు VIVO నుండి ఈ ఫోన్ గురించి ఎటువంటి అధికారిక సమాచారం రాకపోయినా, లీక్ అయిన ఫీచర్లు చూస్తే Vivo V60 ఫోన్ మీడియం ధర స్మార్ట్‌ఫోన్ విభాగంలో ఆకట్టుకునే ఫీచర్లతో రానుంది అనిపిస్తోంది. వినియోగదారులు మరింత స్పష్టత కొరకు అధికారిక ప్రకటన కోసం ఎదురు చూడాల్సి ఉంది. అయితే లీకైన డీటెయిల్స్ చూసిన వివో అభిమానులు ఈ ఫోన్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Comments

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. భారత వినియోగదారులు OnePlus 15 లాంచ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
  2. మార్కెట్లోకి అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4కె సెలెక్ట్.. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్
  3. అదిరిపోయే ఫీచర్లతో నథింగ్ ఫోన్ 3ఏ లైట్.. ఇంకా ఇతర విషయాలు తెలుసుకోండి
  4. ఈ ఫోన్‌లో Snapdragon 7s Gen 2 ప్రాసెసర్ అమర్చబడింది.
  5. ANC ఆఫ్‌లో ఉన్నప్పుడు ఒక్కసారి ఛార్జ్‌పై ఇయర్‌బడ్స్ 11 గంటల వరకు పనిచేస్తాయి.
  6. Samsung సాధారణంగా తన ఫ్లాగ్‌షిప్ ఫోన్లను జనవరి లేదా ఫిబ్రవరిలో విడుదల చేస్తుంది
  7. Realme ఇప్పటికే వియత్నాం మార్కెట్‌లో ఈ ఫోన్‌ను అధికారికంగా టీజ్ చేసింది
  8. Oppo ఐదు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, ఆరు సంవత్సరాల భద్రతా అప్‌డేట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది
  9. మార్కెట్లోకి రానున్న ఐకూ నియో 11.. 7,500mAh బ్యాటరీతో రానున్న మోడల్
  10. 7,500mAh బ్యాటరీ సపోర్ట్‌తో రానున్న రెడ్ మీ టర్బో 5.. స్పెషాలిటీ ఏంటంటే?
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »