Photo Credit: Vivo
త్వరలోనే గ్లోబల్ మార్కెట్‌లలో Vivo కంపెనీ పలు మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. Vivo V50 సిరీస్‌లోని రెండు మోడళ్లతో సహా మూడు హ్యాండ్‌సెట్‌లు ఇప్పటివరకూ ఈ జాబితాలో చేరాయి. Vivo V40 లైనప్‌కు కొనసాగింపుగా Vivo V50 స్మార్ట్ ఫోన్ రానున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే, దీని తాజా మోడల్ సెప్టెంబర్ 25న ప్రారంభించబడింది. ఒక నివేదిక ప్రకారం.. Vivo Y29 4G స్మార్ట్ ఫోన్ కూడా అదే ప్లాట్‌ఫారమ్‌లో రానున్నట్లు నిర్థారణ అయ్యింది.
MySmartPrice నివేదిక ప్రకారం.. Vivo V50, Vivo V50eలు వరుసగా V2427, V2428 మోడల్ నంబర్‌లతో EEC డేటాబేస్‌లో ప్రత్యక్షమయ్యాయి. అలాగే, Vivo Y29 4G స్మార్ట్ ఫోన్ మోడల్ నంబర్ V2434ను కలిగి ఉన్నట్లు ధృవీకరించింది. అలాగే, టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ (IMEI) డేటాబేస్‌లో Vivo V50, Vivo V50e లిస్టింగ్‌ను హైలైట్ చేసిన కొన్ని రోజుల తర్వాత ఈ డెవలప్‌మెంట్ జరిగింది. అయితే, ఈ జాబితాలో ఉన్న ఏ ఒక్క హ్యాండ్‌సెట్‌లకు సంబంధించిన స్పెసిఫికేషన్‌లను కూడా ఇక్కడ వెల్లడించలేదు. ఈ స్మార్ట్‌ఫోన్‌లు వాటి మునుపటి మోడల్స్ Vivo V40, Vivo V40e స్పెసిఫికేషన్స్ ఆధారంగా అంచనా వేయబడుతున్నాయి.
ఇక Vivo V40 స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 4,500nits గరిష్ట బ్రైట్‌నెస్‌తో 6.78-అంగుళాల ఫుల్-HD+ (1,260x2,800 పిక్సెల్‌లు) AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 4nm Qualcomm Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ ఆధారితంగా 12GB RAM, 512GB ఆన్‌బోర్డ్ స్టోరేజీతో వస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే.. హ్యాండ్‌సెట్‌లో జీస్‌తో కో-ఇంజనీర్‌డ్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), ఆటో-ఫోకస్ (AF), 50-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాతో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 5,500mAh బ్యాటరీతో వస్తుంది.
అలాగే, Vivo V40e స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే.. ఇది 6.77-అంగుళాల ఫుల్-HD+ (1,080 x 2,392 పిక్సెల్‌లు) 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్‌తో SGS లో బ్లూ లైట్ సర్టిఫికేషన్‌తో వస్తుంది. 4nm MediaTek డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఆధారితంతో 8GB LPDDR4X RAM, 256GB వరకు UFS 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో అటాచ్ చేయబడింది. హ్యాండ్‌సెట్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ Sony IMX882 ప్రైమరీ సెన్సార్, ఆరా లైట్ యూనిట్‌తో పాటు 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్‌తో వస్తుంది. Vivo V40e 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీని అందించారు. మరి కొత్త లైనప్‌లో వస్తోన్న మోడల్స్ స్పెసిఫికేషన్స్ తెలియాంటే మాత్రం కంపెనీ అధికారిక ప్రకటన రావాల్సిందే.
ప్రకటన
ప్రకటన