రాబోయే Vivo X200 ఫోన్ 2K OLED డిస్‌ప్లేతోపాటు 6000mAh బ్యాటరీతో అందించనున్నట్లు టీజర్ ద్వారా గ్రహించవచ్చు.
Photo Credit: Vivo
వివో ఎక్స్200 అల్ట్రా 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది
Vivo X200 తోపాటు Vivo X200 Ultra ను కంపెనీ ఈ ఏప్రిల్ 21న చైనాలో విడుదల చేయబోతోంది. దీని అధికారిక ప్రకటనకు ముందే Vivo ఫోన్ కెమెరా సామర్థ్యాలను తెలిపుతూ Weibo లో multiple టీజర్‌ను పోస్ట్ చేసింది. Vivo X200 Ultra వైడ్ యాంగిల్ కెమెరా కోసం సోనీ LYT-818 సెన్సార్‌ను అందిస్తోంది. ఇది ఫోటోగ్రఫీ కిట్ యాక్సెసరీకి కూడా సపోర్ట్ చేస్తుంది. రాబోయే ఈ స్మార్ట్ ఫోన్ 2K OLED డిస్‌ప్లేతోపాటు 6000mAh బ్యాటరీతో అందించనున్నట్లు టీజర్ ద్వారా గ్రహించవచ్చు. అలాగే, ఇది స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో అమర్చబడి ఉంటుంది.Weibo లో కొత్త టీజర్,Weibo లో వచ్చిన కొత్త టీజర్‌ను పరిశీలిస్తే.. Vivo X200 Ultra గురించిన అనేక విషయాలు ఇట్టే అర్థమైపోతాయి. రాబోయే ఈ హ్యాండ్‌సెట్ 14mm అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 35mm ప్రైమరీ కెమెరా, 85mm జీస్ APO లెన్స్‌తో కూడిన జీస్-బ్రాండెడ్ కెమెరా సెటప్‌తో వస్తోంది. అలాగే, 14mm అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్, 35mm ప్రైమరీ కెమెరా ఒకే 1/1.28-అంగుళాల సోనీ LYT-818 సెన్సార్‌ను ఉపయోగిస్తాయి. కెమెరాలు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటాయి.
కంపెనీ చెబుతున్న దానినిబట్టీ.. కొత్త స్మార్ట్ ఫోన్ లో అందించిన 85mm టెలిఫోటో సెన్సార్, Vivo X100 Ultraలో వచ్చిన దానికంటే 38 శాతం ఎక్కువ బ్రైట్‌నెస్‌తో రానుంది. అలాగే, కెమెరా యూనిట్, Vivo V3+, VS1 ఇమేజింగ్ చిప్‌లతోపాటు అద్భుతమైన పని తీరును కనబరుస్తుందని విశ్వాసంతో ఉంది. VS1 AI ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ (ISP) 80 (ట్రిలియన్ ఆపరేషన్స్ పర్ సెకెన్) కంప్యూటింగ్ పవర్‌ను అందిస్తుందని వెల్లడించింది.
చాలా కెమెరా నమూనాలను Weibo మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫాంలో పోస్ట్ చేసింది. ఇందులో ప్రతి కెమెరా డెవలప్‌మెంట్‌ను ప్రదర్శిస్తుంది. ఈ ఫోన్ 10-బిట్ లాగ్‌తో 120fps, 4K 60fps వద్ద 4K వీడియోలను రికార్డ్ చేయగలదు. అలాగే, ఇది DCG HDRని కలిగి ఉంటుంది. దీని కెమెరా యూనిట్ అనేక AI- ఆధారిత ఫీచర్స్‌ను అందిస్తోంది. అంతే కాదు, ఇది అప్షనల్ ఫోటోగ్రఫీ కిట్‌తో అందించబడుతోంది.
ఆర్మల్ గ్లాస్ ప్రొటక్షన్‌తో 2K OLED జైస్ బ్రాండెడ్ డిస్‌ప్లేతో Vivo X200 Ultra వస్తుందని ఇప్పటికే టీజ్ చేయబడింది. ఇది 40W వైర్‌లెస్, 90W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. బయోమెట్రిక్స్ కోసం అల్ట్రాసోనిక్ 3D ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అందించారు. ఇది స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఈ కొత్త మోడల్ ఫోన్ ఏప్రిల్ 21న చైనాలో లాంఛ్ కానుంది. ఈ హ్యాండ్‌సెట్ Vivo X200, Vivo ప్యాడ్ SE, Vivo ప్యాడ్ 5 ప్రో, Vivo వాచ్ 5 లతోపాటు విడుదలవుతోంది.
ప్రకటన
ప్రకటన
Single Papa Now Streaming on OTT: All the Details About Kunal Khemu’s New Comedy Drama Series
Scientists Study Ancient Interstellar Comet 3I/ATLAS, Seeking Clues to Early Star System Formation
Spider-Like Scar on Jupiter’s Moon Europa Could Indicate Subsurface Salty Water