Photo Credit: Vivo
Vivo X200 series was launched in China earlier this week with a starting price tag of CNY 4,300
ఈ వారం మొదట్లో చైనాలో Vivo X200 సిరీస్ Vivo X200, X200 Pro, X200 Pro Mini మోడల్‌లు లాంచ్ అయ్యాయి. అయితే, మన భారత్‌లో ఈ కొత్త లైనప్ ప్రారంభ తేదీని Vivo ఇంకా ప్రకటించలేదు. కానీ, లాంచ్‌కు ముందునుంచే ఈ ఏడాది చివరిలోపు భారతదేశంలోకి ఈ మోడల్స్ విడుదల అవుతాయని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. Vivo X200 సిరీస్‌లోని మూడు ఫోన్‌లు న్యూ MediaTek Dimensity 9400 ప్రాసెసర్, ఫీచర్ కెమెరా సిస్టమ్‌లు జర్మన్ ఆప్టిక్స్ బ్రాండ్ Zeiss కో-ఇంజనీరింగ్‌తో రూపొందించబడ్డాయి. మరెందుకు ఆలస్యం.. Vivo X200 సిరీస్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను మనమూ చూసేద్దామా..
పరిశ్రమ వర్గాల అంచనాలను బట్టీ Vivo X200 సిరీస్ నవంబర్ చివరిలో లేదా డిసెంబర్ మొదటి వారంలో భారతదేశంలో లాంచ్ అవుతుందని 91Mobiles పేర్కొంది. ఇందుకు కారణం.. ఇదే కంపెనీకి చెందిన Vivo X100, Vivo X100 Pro నవంబర్ 2023లో చైనాలో లాంచ్ అయిన తర్వాత ఈ ఏడాది జనవరిలో మన దేశంలో విడుదల అయ్యాయి. ఈ ఫార్ములా ప్రకారం.. ఈ కొత్త సిరీస్ కూడా ఇదే తరహాలో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.
Vivo X200 సిరీస్ వనిల్లా Vivo X200 బేస్ 12GB + 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ వేరియంట్ CNY 4,300 (దాదాపు రూ. 51,000) ప్రారంభ ధరతో ఈ వారం మొదట్లో చైనాలో విడుదల అయ్యింది. అలాగే, Vivo X200 Pro ధర CNY 5,999 (దాదాపు రూ. 63,000) నుండి మొదలవుతుంది. అయితే, Vivo X200 Pro Mini బేస్ మోడల్ ధర మాత్రం CNY 4,699 (దాదాపు రూ. 56,000)గా ఉంది.
Vivo X200 సిరీస్ నుంచి వస్తున్న ఈ మూడు ఫోన్‌లు కూడా హుడ్ కింద MediaTek డైమెన్సిటీ 9400 ప్రాసెసర్‌ను కలిగి ఉంటాయి. అలాగే, 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను అమర్చబడి ఉంటాయి. ఈ కొత్త లైనప్ నెక్స్ జనరేషన్ మీడియాటెక్ ప్రాసెసర్‌ను కలిగి ఉన్న మొదటి సిరీస్‌గా గుర్తింపు పొందుతోంది. ఈ మూడు స్మార్ట్ ఫోన్‌లలో కెమెరా యూనిట్‌లను జీస్ కో-ఇంజనీరింగ్ రూపొందించింది. ఇవి ఆరిజిన్ OS 5లో రన్ అవుతాయి.
ఇక, వనిల్లా Vivo X200 90W వైర్డు ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 5,800mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే Vivo X200 Pro, X200 Pro Mini వరుసగా 6,000mAh, 5,800mAh బ్యాటరీ సామర్థ్యంతో 90W వైర్డు ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి రానున్నాయి. ఇవి ఇండియాలో ఎప్పుడూ లాంచ్ అవుతుందనే విషయం తెలియాంటే మాత్రం మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
ప్రకటన
ప్రకటన