త్వరలో మార్కెట్‌లోకి అధునాతమైన Vivo X200T, ఫీచర్లు, ధర వివరాలు

త్వరలో Vivo నుంచి మరో అదిరిపోయే ఫోన్ విడుదలకానుంది. ఈ హ్యాండ్‌ సెట్‌లో 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 4 50 MP కెమెరాలు ఉండనున్నాయి. వివిధ కలర్‌ ఆప్షన్లలో కూడా ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది.

త్వరలో మార్కెట్‌లోకి అధునాతమైన Vivo X200T, ఫీచర్లు, ధర వివరాలు

Photo Credit: Vivo

Vivo X200T लवकरच भारतात लाँच होणार आहे.

ముఖ్యాంశాలు
  • Vivo X200Tలో అధునాతనమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
  • 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 6200mAh బ్యాటరీ గల ఫోన్
  • Vivo X200Tకి IP68/IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్
ప్రకటన

Vivo నుంచి మరో అదిరిపోయే ఫోన్ అలరించనుంది. Vivo కంపెనీని ఇష్టపడే వినియోగదారులకు ఇది శుభవార్త. Vivo X200T స్మార్ట్‌ఫోన్ త్వరలో భారత మార్కెట్‌లోకి విడుదల కానుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్ సెట్ ఇటీవల బ్లూటూత్ SIG, భారతదేశం BIS సర్టిఫికేషన్ ప్లాట్‌ఫార్మ్‌లలో కనిపించింది. దీనికి సంబంధించిన రిపోర్టులు ఈ నెలాఖరు నాటికి ఇది విడుదలయ్యే అవకాశ ఉంది. ఇటీవలి రిపోర్టులో మొబైల్ కలర్ వేరియంట్లు, అంచనా ధర గురించి వివరాలు ఉన్నాయి. ఇప్పుడు టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ సౌజన్యంతో కొత్త లీక్ ఫోన్ గురించి అంచనాగా కొన్ని వివరాలు తెలిశాయి.

Vivo X200T స్పెసిఫికేషన్స్ (అంచనా)

టిప్‌స్టర్ ప్రకారం Vivo X200T 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందించే 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. సాఫ్ట్‌వేర్ ముందు ఇది ఆండ్రాయిడ్ 16 అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో వస్తుంది. 5 ప్రధాన Android OS అప్‌డేట్‌లు, 7 సంవత్సరాల భద్రతా ప్యాచ్‌ల అద్భుతమైన వాగ్దానంతో దీర్ఘకాలిక సపోర్ట్‌ను నిర్ధారిస్తుంది. ఈ పరికరానికి ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ MediaTek Dimensity 9400+ SoC పవర్‌ని ఇస్తుంది. ఇది తగినంత RAM, స్టోరేజ్ ఆప్షన్లతో జత చేయబడింది (కొన్ని వేరియంట్‌లలో 16GB RAM, 1TB స్టోరేజ్). ఇది 90W వైర్డ్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో భారీ 6200mAh బ్యాటరీని కలిగి ఉండనుంది.

X200T ట్రిపుల్ కెమెరా సెటప్‌లో 50-మెగాపిక్సెల్ సోనీ LYT-702 ప్రధాన సెన్సార్ OIS (Zeiss సూపర్ ఫోటో సెన్సిటివ్), 50-మెగాపిక్సెల్ Samsung JN1 (అల్ట్రా-వైడ్), 50-మెగాపిక్సెల్ LYT-600 పెరిస్కోప్ టెలిఫోటో ఉంటాయి. ముందు భాగంలో షార్ప్ పోర్ట్రెయిట్‌ల కోసం 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండే ఛాన్స్ ఉంది.

అంతేకాకుడా Wi-Fi 7, బ్లూటూత్ 5.4, USB-C పోర్ట్, అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, IP68/IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, స్థిరమైన పనితీరు కోసం 4.5K నానోఫ్లూయిడ్ VC కూలింగ్, eSIM సపోర్ట్ ఉన్నాయి.

Vivo X200T ధర (అంచనా)

ఇటీవలి రిపోర్టుల ప్రకారం ఇది భారతదేశంలో దాదాపు రూ. 55,000ల ధరతో ఆన్‌లైన్‌లో మాత్రమే లభించే ఫోన్ కావచ్చు. ఇది నలుపు, ఊదా రంగుల్లో వచ్చే అవకాశం ఉంది. సమగ్రంగ చెప్పాలంటే, ఈ ఫోన్ ఏప్రిల్ 2025లో ప్రకటించిన చైనా Vivo X200s రీబ్రాండెడ్ వెర్షన్‌గా కనిపిస్తుంది.

ces_story_below_text

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. ప్రస్తుతం OnePlus 13R ఫ్లిప్కార్ట్లో రూ.40,889 ధరకు లిస్ట్ అయింది
  2. ఈ ఏడాది ఒప్పో ‘డ్యూయల్ ఫోల్డబుల్ స్ట్రాటజీ’ని అనుసరించనుందని సమాచారం
  3. ఇది ఫియర్లెస్ బ్లూ, లోన్ బ్లాక్, నోవా వైట్ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది
  4. త్వరలో మార్కెట్‌లోకి అధునాతమైన Vivo X200T, ఫీచర్లు, ధర వివరాలు
  5. Samsung నుంచి మరో అదిరిపోయే ఫోన్, త్వరలో అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్
  6. ఈ ఫోన్ IP68/IP69 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్, అలాగే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ను కూడా సపోర్ట్ చేస్తుంది.
  7. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2.0పై పనిచేస్తుంది.
  8. ఇక Oppo Reno 15 Pro 5G ప్రారంభ ధర రూ.67,999.
  9. ఈ నెల 19 విడుదల కానున్న ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్, అదిరిపోయే ఫీచర్లు
  10. త్వరలోనే లాంఛ్ కాబోతోన్న మోటో ఎక్స్ 70 ఎయిర్ ప్రో.. కళ్లు చెదిరే ఫీచర్స్ ఇవే
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »