భారతదేశంలో Vivo Y28s 5G ధరలను తగ్గించిన తర్వాత ప్రారంభ ధర 4GB వేరియంట్‌లో రూ. 13,499గా ఉంది. అలాగే, 6GB, 8GB వేరియంట్‌లు వరుసగా రూ. 14,999, రూ 16,499గా ఉన్నాయి. ఈ ఫోన్ 128GB ఇన్‌బిల్డ్ స్టోరేజీతో వస్తుంది
Photo Credit: Vivo
Vivo Y28s 5G comes in Vintage Red and Twinkling Purple colour options
ఈ ఏడాది జూలైలో దేశీయ మార్కెట్‌లోకి Vivo Y28e 5Gతో పాటు Vivo Y28s 5G విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా Vivo Y28s 5G ధరను రూ. 500 తగ్గించినట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ హ్యాండ్‌సెట్ ప్రస్తుతం మార్కెట్‌లో మూడు RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది. ఇది MediaTek డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో 8GB వరకు LPDDR4X RAMతో అటాచ్ చేయబడింది. Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ను అందించారు. ఇది 6.56-అంగుళాల HD+ LCD స్క్రీన్‌తోపాటు IP64-రేటెడ్ బిల్డ్‌తో వస్తుంది. ఈ మోడల్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.
భారతదేశంలో Vivo Y28s 5G ప్రారంభ ధర 4GB వేరియంట్‌లో రూ. 13,499గా ఉంది. అలాగే, 6GB, 8GB వేరియంట్‌లు వరుసగా రూ. 14,999, రూ 16,499గా ఉన్నాయి. ఈ ఫోన్ 128GB ఇన్‌బిల్డ్ స్టోరేజీతో వస్తుంది. ఇది వింటేజ్ రెడ్, ట్వింక్లింగ్ పర్పుల్ షేడ్స్‌లో ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్ ద్వారా అందుబాటులో ఉంది. నిజానికి, ఈ మోడల్ విడుదల సమయంలో 4GB వేరియంట్ ధర రూ. 13,999, 6GB 8GB వెర్షన్‌ల ధరలు వరుసగా రూ. 15,499, రూ. 16,999గా ఉన్నాయి. తాజాగా కంపెనీ రూ.500 తగ్గింపు ధరను ప్రకటించడం మార్కెట్ వర్గాల్లో చర్చకు దారి తీసింది.
Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్ 6.56-అంగుళాల HD+ (720 x 1,612 పిక్సెల్‌లు) LCD స్క్రీన్‌తో 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. అలాగే, 840 nits అధిక బ్రైట్‌నెస్ స్థాయిని కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 8GB వరకు LPDDR4X RAM, 128GB eMMC 5.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో అటాచ్ చేసి రూపొందించారు. అలాగే, MediaTek డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను అందించారు. ఇది Android 14-ఆధారిత Funtouch OS 14తో రన్ చేయబడుతుంది. అయితే, గతంలో లాంచ్ అయిన మోడల్స్‌తో పోల్చితే Vivo Y28s 5G మోడల్ మెరుగైన పనితీరును కనబరుస్తున్నట్లు చెప్పొచ్చు.
ఇక కెమెరా విభాగం విషయానికి వస్తే.. Vivo Y28s 5G మోడల్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 0.08-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌తో సహా డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటుంది. USB టైప్-C పోర్ట్ ద్వారా 15W వైర్డు ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. 5G, బ్లూటూత్ 5.4, GPS, Wi-Fi ఉన్నాయి. భద్రత కోసం హ్యాండ్‌సెట్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇది దుమ్ము, స్ప్లాష్ నిరోధకత కోసం IP64 రేటింగ్‌తో వస్తుంది. మరి కంపెనీ అధికారికంగా తగ్గింపు ధరలను ప్రకటించిన తర్వాత కొనుగోలుదారులనుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
ప్రకటన
ప్రకటన
Jurassic World: Rebirth OTT Release: Know When, Where to Watch the Scarlett Johansson-Starrer
Karam Is Now Streaming Online: Where to Watch Vineeth Sreenivasan's Malayali Action Thriller
Kamaro 2 Is Streaming Now on Sun NXT: Know All About the Horror Suspense Film
Saali Mohabbat OTT Release: Know When and Where to Watch the Radhika Apte-Starrer