Photo Credit: Xiaomi
Xiaomi 15 Ultra 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,400mAh బ్యాటరీతో అమర్చబడింది.
చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi 15 Ultraను బార్సిలోనాలో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC 2025) ముందు గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేసింది. కంపెనీ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను ఫిబ్రవరి 27న చైనాలో ఆవిష్కరించగా, స్టాండర్డ్, ప్రో మోడల్‌లను అక్టోబర్ 2024లో లాంఛ్ చేసింది. Xiaomi 15 సిరీస్‌లో 16GB వరకు RAMతో అటాచ్ చేయబడిన Snapdragon 8 Elite ప్రాసెసర్ ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌లకు LTPO AMOLED డిస్‌ప్లేలతోపాటు 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో, సిలికాన్ కార్బన్ బ్యాటరీలను అందించారు.
బేస్ మోడల్ Xiaomi 15 Ultra 16GB RAM, 512GB స్టోరేజ్ ధర EUR 1,499 (సుమారు రూ. 1,36,100), 12GB + 256GB మోడల్ స్టాండర్డ్ Xiaomi 15 ధర EUR 999 (సుమారు రూ. 90,700)గా ఉంది. కొనుగోలు చేసిన మొదటి సంవత్సరంలోపు వారంటీతో సంబంధంలేని ఒక రిపేర్‌ను సర్వీస్ ఛార్జ్ లేకుండా కూడా అందిస్తామని చెబుతోంది. మొదటి ఆరు నెలల్లో ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను అందిస్తోంది.
15 Ultra Android 15పై నడుస్తూ, Xiaomi HyperOS 2 స్కిన్ పైన రన్ అవుతోంది. నాలుగు OS అప్‌గ్రేడ్‌లను పొందేందుకు షెడ్యూల్ చేయబడింది. ఇది 6.73-అంగుళాల WQHD+ (1,440x3,200 పిక్సెల్‌లు) క్వాడ్ కర్వ్డ్ LTPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండి, 120Hz రిఫ్రెష్ రేట్, 3,200nits వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో లభిస్తుంది.
హ్యాండ్‌సెట్‌కు నాలుగు లైకా-ట్యూన్ చేయబడిన కెమెరాలను అందించారు. ఇది 1-అంగుళాల టైప్ LYT-900 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరాను కలిగి ఉంది. 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, OIS, 3x ఆప్టికల్ జూమ్‌తో 50-మెగాపిక్సెల్ సోనీ IMX858 టెలిఫోటో కెమెరా సెన్సార్, 4.3x ఆప్టికల్ జూమ్‌తో 200-మెగాపిక్సెల్ ISOCELL HP9 పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతోపాటు 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.
ఈ కొత్త మోడల్ 512GB వరకు UFS 4.1 స్టోరేజ్‌ను పొందొచ్చు. ఇది 5G, 4G LTE, Wi-Fi 7, బ్లూటూత్ 6, GPS, NFC, USB 3.2 Gen 2 టైప్-C పోర్ట్‌ను అందిస్తుంది. బోర్డులోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, కంపాస్, బేరోమీటర్, ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి. హ్యాండ్‌సెట్ ఛాసిస్ ఏరోస్పేస్-గ్రేడ్ గ్లాస్ ఫైబర్‌ను ఉపయోగించి నిర్మించారు.
Xiaomi 15 ఫ్లాగ్‌షిప్ 15 Ultra మాదిరిగానే అదే ప్రాసెసర్‌తో అమర్చబడి ఉంటుంది. 16GB వరకు RAMతో వస్తుంది. 6.36-అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్, 3,200nits వరకు పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. అలాగే, 1TB వరకు UFS 4.0 స్టోరేజీతో వస్తుంది. ఇది 5,240mAh బ్యాటరీతో వస్తుంది. దీనిని 90W (వైర్డ్), 50W (వైర్‌లెస్) వద్ద ఛార్జ్ చేయవచ్చని కంపెనీ వెల్లడించింది.
ప్రకటన
ప్రకటన