Photo Credit: Redmi
Redmi Note 14 5G 6.67-అంగుళాల 120Hz డిస్‌ప్లేను కలిగి ఉంది
హోలీ సేల్‌లో భాగంగా Xiaomi వివిధ రకాల స్మార్ట్ ఫోన్ మోడళ్లపై డిస్కౌంట్‌లను ప్రకటించింది. ఈ ఆఫర్లలో భాగంగా కంపెనీ Redmi Note 14 5G పై డిస్కౌంట్‌ను పరిచయం చేసింది. దీంతో తాజాగా ఈ మోడల్ లిస్టెడ్ MRP కంటే తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చింది. అలాగే, Redmi Note 13 సిరీస్, Redmi 13C 4G ఫోన్‌తో సహా ఇతర స్మార్ట్ ఫోన్‌లు కూడా డిస్కౌంట్‌తో అందుబాటులోకి వచ్చాయి. ధరలను మరింత తగ్గించుకునేందుకు కొనుగోలుదారులు అదనపు డిస్కౌంట్ కూపన్‌లతో పాటు బ్యాంక్ ఆఫర్‌లను కూడా వినియోగించుకోవచ్చు.
మన దేశంలో Redmi Note 14 5G ఫోన్ బేస్ మోడల్ 6GB + 128GB కాన్ఫిగరేషన్ ధర రూ. 18,999గా ఉంది. అయితే, హోలీ ఆఫర్‌లో భాగంగా Xiaomi ఈ ఫోన్ పై రూ. 1,000 డిస్కౌంట్‌ను ప్రకటించింది. దీంతో ప్రస్తుతం ఈ బ్రాండ్ వెబ్‌సైట్‌లో రూ. 17,999కి అందుబాటులోకి వచ్చింది. అంతే కాదు, హ్యాండ్‌సెట్ ఇతర వేరియంట్‌లకు కూడా ఇలాంటి డిస్కౌంట్ వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది.
ఈ ఆఫర్‌లో Redmi Note 13 సిరీస్ ధరలు సైతం తగ్గించబడ్డాయి. రూ. 31,999 ధరకు ప్రారంభించబడిన Redmi Note 13 Pro+ 5G ఇప్పుడు రూ. 28,999కే కొనుగోలు చేయొచ్చు. దీంతోపాటు Redmi Note 13 5G, Redmi Note 13 Pro 5G హ్యాండ్‌సెట్‌ల ధరలు వరుసగా రూ. 16,499, రూ. 22,999గా ఉన్నాయి. ఇప్పటికే మార్కెట్‌లో మంచి సేల్ ఉన్న ఈ మోడల్స్‌పై ఆఫర్‌లు ప్రకటించడంతో వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తుందని కంపెనీ భావిస్తోంది.
Redmi 13C 4G పై కూడా Xiaomi పరిమిత-కాల హోలీ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఫోన్ 4GB + 128GB వేరియంట్ ధర సాధారణంగా రూ. 7,999 ఉండగా, ఈ సేల్ సమయంలో రూ. 7,499 కు సొంతం చేసుకోవచ్చు. ఆఫర్లలో భాగంగా, చైనీస్ OEM కూడా యాక్సెసరీలతో కూడిన స్మార్ట్ ఫోన్‌లను బండిల్ చేస్తోంది. రూ. 26,798 కు వినియోగదారులు Redmi Note 13 Pro తోపాటు Redmi Buds 5 బండిల్‌ను కొనుగోలు చేయొచ్చు. అలాగే, Redmi Note 13 5G ఫోన్ 12 GB + 256 GB వేరియంట్ Redmi Buds 5తో కాంబో ధర రూ. 23,798గా కంపెనీ ప్రకటించింది.
ఈ హోలీ ఆఫర్‌లలో తగ్గింపు ధరలతో పాటు, కొనుగోలుదారులు Xiaomi స్మార్ట్ ఫోన్‌లపై బ్యాంక్ డిస్కౌంట్‌లను కూడా సొంతం చేసుకోవచ్చు. Xiaomi ICICI బ్యాంక్ డెబిట్, క్రెడిట్, EMI లావాదేవీలపై రూ. 5,000 వరకు డిస్కౌంట్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరిమిత కాల ఆఫర్‌లను సొంతం చేసుకునేందుకు వినియోగదారులకు ఇది మంచి అవకాశమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన