Photo Credit: Vivo
భారతీయ మొబైల్ మార్కెట్‌లోకి Vivo X200 Pro, Vivo X200 హ్యాండ్‌సెట్‌లు విడుదల అయ్యాయి. ఈ కొత్త Vivo X సిరీస్ స్మార్ట్ ఫోన్‌లు MediaTek డైమెన్సిటీ 9400 ప్రాసెసర్‌తో రన్ అవుతాయి. నీరు, ధూళి నియంత్రణ కోసం IP68, IP69 రేటింగ్‌లను కలిగి ఉన్నాయి. Zeiss కో-ఇంజనీరింగ్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను Vivo X200 సిరీస్‌లో అందించారు. అలాగే, ప్రో మోడల్‌లో Vivo అంతర్గత V3+ ఇమేజింగ్ చిప్‌తో వస్తుంది. ఇవి వరుసగా 5800mAh, 6000mAh సామర్థ్యం గల బ్యాటరీలను కలిగి ఉన్నాయి. అక్టోబర్‌లో ఈ Vivo X200 సిరీస్ చైనాలో లాంచ్ చేశారు.
Vivo X200 Pro 16GB RAM + 512GB స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 94,999గా ఉంది. ఇది కాస్మోస్ బ్లాక్, టైటానియం గ్రే కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. వెనిలా Vivo X200 12GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 65,999గా ఉంది. ఈ ఫోన్ కాస్మోస్ బ్లాక్, నేచురల్ గ్రీన్ షేడ్స్‌లో లభిస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ-బుకింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. డిసెంబర్ 19నుండి అమ్మకాలు జరగనున్నాయి. తొమ్మిది నెలల నో-కాస్ట్ EMI ఆప్షన్‌ను అందిస్తోంది. రూ. 9500 తక్షణ తగ్గింపు, సంవత్సరం పొడిగించిన వారంటీతోపాటు రూ. 9500ఎక్స్చేంజ్ బోనస్ ఉంది.
డ్యూయల్ సిమ్ (నానో)తో Vivo X200 Pro, X200లు Android 15 ఆధారంగా Funtouch OS 15పై రన్ అవుతున్నాయి. ప్రో మోడల్‌లో 6.78-అంగుళాల 1.5K రిజల్యూషన్ (1,260x2,800) LTPO AMOLED డిస్‌ప్లే 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. రెండో మోడల్‌కు 6.67-అంగుళాల 1.5K రిజల్యూషన్ (1,260x2,800 పిక్సెల్) AMOLED 8T LTPS డిస్‌ప్లేను అందించారు. రెండు ఫోన్‌లలోని స్క్రీన్‌లు 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 2,160Hz PWM డిమ్మింగ్ అందిస్తాయని అంచనా.
X200 సిరీస్‌లో ప్రో మోడల్‌లో OIS సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ Sony LYT-818 సెన్సార్, ఆటోఫోకస్‌తో 50-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ కెమెరా, 3.7x ఆప్టికల్ జూమ్ ఉన్నాయి. X200 వెనుక కెమెరా సెటప్‌లో OIS సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ Sony IMX921 1/1.56-అంగుళాల సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50-మెగాపిక్సెల్ సోనీ IMX882 టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి. ముందుభాగంలో రెండు ఫోన్‌లలోనూ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.
5G, Wi-Fi, బ్లూటూత్ 5.4, NFC, GPS, BeiDou, GLONASS, గెలీలియో, QZSS, NavIC, A-GPS, NavIC, OTG, USB టైప్-C పోర్ట్ వంటివి ఉన్నాయి. Vivo X200 Pro 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 30W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్నాయి. 162x75.95x8.49mm పరిమాణంలో 228 గ్రాముల బరువు ఉంటుంది. అలాగే, X200 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 162x74.81x7.99mm పరిమాణం, 202 గ్రాముల బరువు ఉంటుంది.
ప్రకటన
ప్రకటన