సాలెపురుగులు రసాయన సంకేతాల ద్వారా సంభావ్య సహచరులను గుర్తించే వాటి సామర్థ్యాన్ని ఈ బృందం గుర్తించింది
Photo Credit: Pixabay/Fleischturbine
సాలెపురుగులు గాలిలోని సువాసనలను గుర్తించేందుకు తమ కాళ్లపై ప్రత్యేకమైన వెంట్రుకలను ఉపయోగిస్తాయి
సాలెపురుగులు తమ కాళ్లపై ప్రత్యేకమైన వెంట్రుకలను గాలిలో వ్యాపించే సువాసనలను గుర్తించడానికి ఉపయోగిస్తాయని కొత్త పరిశోధనలో వెల్లడైంది. ఈ అరాక్నిడ్‌ల ఇంద్రియ సామర్థ్యాలపై కొత్త అధ్యయనానికి ఇది ఎంతో ఉపకరిస్తుంది. కీటకాల వంటి యాంటెన్నా లేని సాలెపురుగులు ఫెరోమోన్‌ల వంటి వాసనలను ఎలా గుర్తించగలవనే దానిపై చాలా కాలంగా ఉన్న ప్రశ్నకు ఈ పరిశోధన పరిష్కారం చూపింది. ఆడ సాలెపురుగులు విడుదల చేసే సెక్స్ ఫెరోమోన్‌లను గ్రహించడానికి వాల్-పోర్ సెన్సిల్లా అని పిలువబడే ఘ్రాణ వెంట్రుకలను ఉపయోగించే మగ సాలెపురుగులను పరిశీలించారు. రసాయన సంకేతాల ద్వారా సంభావ్య సహచరులను గుర్తించే వాటి సామర్థ్యాన్ని ఈ బృందం గుర్తించింది.
జీవరాశులపై సాగించే పలు పరిశోధనలు ఎన్నో ఆసక్తికరమైన అంశాలను భవిష్యత్తు తరాలకు అందిస్తాయని ఇప్పటికే చాలా సందర్భాలలో నిరూపితమైంది. తాజాగా, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. వయోజన మగ సాలెపురుగుల (ఆర్జియోప్ బ్రూయెన్నిచి)పై కాళ్లపై వాల్-పోర్ సెన్సిల్లా గుర్తించబడింది. ఈ సూక్ష్మ నిర్మాణాలు ఫెరోమోన్‌లను గుర్తించడంలో కీలకమని విశ్వసిస్తారు. హై-రిజల్యూషన్ స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీలో ఈ సెన్సిల్లాలు వేలాదిగా కనిపించాయి. ఇవి ఆడ, చిన్న మగ సాలెడులలో లేవు. ఇవి ఆడ సాలెడు సహచరుడిని గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిర్ధారణ అయ్యింది.
గతంలో సాలెపురుగులలో లేదని భావించిన అంతుచిక్కని సెన్సిల్లాను ఈ పరిశోధనలు మ్యాప్ చేసి గుర్తించాయని పరిశోధకులు phys.org కి స్పష్టం చేశాయి. ఈ సెన్సిల్లాలు ఫెరోమోన్ సమ్మేళనాలు ఎంత సున్నితంగా ఉంటాయో ప్రయోగాలు వెల్లడించాయి. 20 నానోగ్రాముల చిన్న మొత్తంలో ఈ పదార్ధం గణనీయమైన నాడీ సంబంధిత ప్రతిస్పందనలను కలిగించినట్లు వెల్లడైంది. సెన్సిల్లాను ఫెరోమోన్ పఫ్‌లకు గురిచేసేలా వివిధ కాళ్ళ జతలలో ప్రతిస్పందనలు స్థిరంగా ఉన్నట్లు ప్రయోగాలలో గుర్తించబడ్డాయి. దీనిపై ఇప్పటికే పూర్తి స్థాయిలో స్పష్టత ఇచ్చింది.
సాలెపురుగుల ఘ్రాణ వ్యవస్థలు కీటకాలలో కనిపించే సున్నితత్వానికి పోటీగా నిలుస్తాయని, వాటి అధునాతన రసాయన గుర్తింపు వీటి సామర్థ్యాలను ప్రాచుర్యంలోకి తీసుకువస్తాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అధ్యయనం 19 ఇతర సాలెపురుగు జాతులపై సాగింది. అంతేకాదు, చాలా మగ సాలెపురుగులలో వాల్-పోర్ సెన్సిల్లాను గుర్తించారు. ఈ లక్షణం పలు దఫాలుగా పరిణామం చెందిందని నిర్ధారించారు. అలాగే, కొన్ని ఆదిమ జాతులలో ఈ నిర్మాణాలు లేవని కూడా గుర్తించారు.
ఈ అంశంపై భవిష్యత్తు పరిశోధన ఆడ సాలెపురుగులు వాసనలను ఎలా గుర్తిస్తాయో, వాటి ప్రవర్తనలకు సంబంధించిన రసాయనాల రకాలు, సాలెపురుగులలో వాసన పరిణామ అంశాలపై ఉండడనున్నట్లు భావిస్తున్నారు. తాజా పురోగతి సాలెపురుగు ప్రవర్తనను నియంత్రించే అధునాతన ఇంద్రియ విధానాలను అర్థం చేసుకోవడానికి ఒక పునాది లాంటిదిగా చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా, సాలిపురుగులపై చేసిన ఈ అధ్యయనం ఎలాంటి ఉపయోగకరమైన విషయాలను వెలుగులోకి తీసుకు వస్తుందో వేచి చూడాలని పలుపురు శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు.
ces_story_below_text
ప్రకటన
ప్రకటన
NOAA Issues G2 Solar Storm Watch; May Spark Auroras but Threaten Satellite Signals