ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో మరీ ముఖ్యంగా సెప్టెంబరు 22న శరదృతువు విషువత్తు సమయంలో శక్తివంతమైన అరోర ఉత్తర వెలుగును చూసేందుకు అవకాశం ఉంటుంది. ఈ సమయంలో రస్సెల్-మెక్‌ఫెరాన్ ఎఫెక్ట్ కారణంగా భూ అయస్కాంత తుఫానులు సాధారణం కంటే బలంగా ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిజానికి, ఈ దృగ్విషయాన్ని మొదటగా 1973లో వివరించారు. విషువత్తుల సమయంలో భూమి యొక్క అయస్కాంత క్షేత్రం సౌర గాలితో ఢీకొన్నప్పుడు మరింత శక్తిని గ్రహించిన కణాలు సులభంగా లోపలకు చొచ్చుకుపోయేలా చేస్తుంది. దీని ఫలితంగా తీవ్రమైన అరోరల్ కార్యకలాపాలకు దారి తీసి, ఆకాశంలో అద్భుతమైన ఆవిస్కరణ సృష్టించబడుతుంది.
సంవత్సరానికి రెండుసార్లు మార్చి, సెప్టెంబరు విషువత్తుల సమయంలో అరోరాస్ ఎందుకు ఎక్కువగా కనిపిస్తాయి అనేదానికి రస్సెల్-మెక్‌ఫెర్రాన్ ఎఫెక్ట్ ఒక ముఖ్య కారణంగా చెప్పొచ్చు. సంవత్సరానికి రెండు సార్లు వచ్చే విషువత్తు రోజుల్లో (మార్చి 20/21, సెప్టెంబరు 22/23) భూమధ్యరేఖాతలంలో సూర్యుని కేంద్రం ఉంటుంది. ఆ రోజున భూ అక్షం యొక్క వంపు సూర్యునికి దగ్గరగాగానీ, దూరంగాగానీ కాకుండా సమాన దూరంలో ఉంటుంది. ఈ కాణంగా విషువత్తు రోజున భూమిపైన రాత్రీ, పగళ్ళ నిడివి సమానంగా ఉంటుంది. ఇవి రెండు రకాలు వసంత విషువత్తు (మార్చిలో), శరత్ విషువత్తు (సెప్టెంబరులో) సంభవిస్తుంది. ఈ సెప్టెంబర్‌లో భూమి యొక్క అయస్కాంత ధ్రువాలు వంగి, సౌర గాలితో సమలేఖనం అవుతాయి. ఆ సమయంలో శక్తిని పొందిన కణాలు మన వాతావరణంతో సంకర్షణ చెందుతాయి. ఈ కణాలు వాతావరణంలోని ఆక్సిజన్, నైట్రోజన్ అణువులను తాకినప్పుడు అవి ప్రకాశవంతమైన రంగులను విడుదల చేయడం ద్వారా అరోరాలను ఏర్పరుస్తాయి. సెప్టెంబర్ విషువత్తు సమయంలో ఈ ప్రత్యేకమైన అమరిక ఉత్తర వెలుగుకు ఉత్తర అర్ధగోళంలో అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.
ముఖ్యంగా, సూర్యుని యొక్క అయస్కాంత చర్య ప్రస్తుతం 11-సంవత్సరాల సౌర చక్రంలో గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇది భూ అయస్కాంత తుఫానుల సంభావ్యతకు దోహదపడుతోంది. రెండు దశాబ్దాలలో ఎప్పుడూ చూడని అత్యంత శక్తివంతమైన భూ అయస్కాంత తుఫాను సృష్టించిన అరోరాలను దక్షిణ ఫ్లోరిడా నుంచి మెక్సికో వరకు ఈ సంవత్సరం ప్రారంభంలోను, మే నెలలోనూ సంభవించాయి. ఈ తరహా సౌర తుఫానులు పెరుగుతూనే ఉండటంతో సెప్టెంబరులో ఇదే విధమైన అరోరాల ఆవిస్కరణ జరగవచ్చని అంచనా వేస్తున్నారు. దీని ద్వారా మరో అద్భుతమైన సహజ సిద్ధమైన శక్తివంతమైన ఆవిస్కరణను వీక్షించే అవకాశం ఉండబోతోంది.
ఈ ఏడాది సెప్టెంబర్ విషువత్తును మరింత ఉత్తేజపరిచేది పగలు మరియు చీకటి మధ్య సమతుల్యత. ఈ సమయంలో ఉత్తర అర్ధగోళం 12 గంటల పగలు మరియు 12 గంటల రాత్రిని సూచిస్తుంది. ఇది అరోరాలను వీక్షించడానికి సరైన సమయాన్ని అందిస్తుంది. ఏటా వేసవి నెలల కంటే ముదురు రంగులో ఉన్న ఆకాశంతో అద్భుతమైన ఉత్తర వెలుగులను మరింతగా వీక్షించేందుకు ఈసారి ఎక్కువ అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రకటన
ప్రకటన