Photo Credit: ESA/Hubble/ NASA/ T. Megeath
భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రాలతో రూపొందిన ప్రాంతమైన ఓరియన్ నెబ్యులాకు చెందిన అసాధారణ దృశ్యాన్ని హబుల్ స్పేస్ టెలిస్కోప్ క్యాప్చూర్ చేసింది. ఇది దాదాపు 1,500 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ కొత్త చిత్రం ప్రోటోస్టార్‌లు HOPS 150, HOPS 153లను మరింత ప్రభావవంతగా చేస్తుందనే చెప్పాలి. నిజానికి, ఇవి వాటి చుట్టుపక్కల వాతావరణాన్ని పునర్నిర్మించడంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. అంతే కాదు, ఓరియన్ నక్షత్రరాశి బెల్ట్ దగ్గర న్యాక్‌డ్‌గా కంటికి కనిపించే నెబ్యులా, ఈ యువ నక్షత్రాల కార్యకలాపాల ద్వారా ప్రకాశిస్తుంది. అలాగే, ఇది శాస్త్రవేత్తలకు నక్షత్ర నిర్మాణం ప్రారంభ దశలపై అధ్యయనానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
తాజాగా ESA హెర్షెల్ స్పేస్ అబ్జర్వేటరీని ఉపయోగించి నిర్వహించిన హెర్షెల్ ఓరియన్ ప్రోటోస్టార్ సర్వే ప్రకారం.. HOPS 150 అనేది రెండు యువ నక్షత్రాలను కలిగి ఉన్న ఒక బైనరీ స్టార్ సిస్టమ్. ఇది దుమ్ముతో కూడిన డిస్క్‌లతో చుట్టుముట్టబడి ఉంది. ఈ ప్రోటోస్టార్‌లు ఇప్పటికీ వాటి పరిసరాల నుండి పదార్థాలను సేకరిస్తున్నాయి. అంతే కాదు, భూమి, సూర్యుడి మధ్య దూరం కంటే 2,000 రెట్లు ఎక్కువ విస్తరించి ఉన్న వాయువు, ధూళితో భారీ మేఘం వాటి పెరుగుదలకు దోహదపడుతోంది. అలాగే, హెర్షెల్ ఓరియన్ ప్రోటోస్టార్ సర్వే వెలువరించిన అంశాలు పలు కీలక అధ్యయానాలకు ఉపయోగపడతాయని ఖగోల శాస్త్రవేత్తలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రధానంగా NASA చెబుతున్నదాని ప్రకారం, విడుదలయ్యే ఇన్‌ఫ్రారెడ్ కాంతి పరిశీలనలను బట్టీ HOPS 150 పరిణతి చెందిన నక్షత్ర వ్యవస్థగా పరిణామం చెందే దశలో ఉందని సూచిస్తున్నాయి.చిత్రంలో కనిపించే నేరో జెట్ HOPS 153 నుండి ఉద్భవించింది. అలాగే, దీని సమీపంలో ఉన్న మరొక ప్రోటోస్టార్, ఇప్పటికీ దట్టమైన వాయువులో నిక్షిప్తం చేయబడింది. HOPS 153 ఉద్భవం అస్పష్టంగా ఉన్నప్పటికీ, చుట్టుపక్కల పదార్థాలపై జెట్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ జెట్ ఇంటర్స్టెల్లార్ మీడియంలోని ప్రాంతాలను వేరు చేయడంతోపాటు శక్తిని విడుదల చేస్తుంది. అలాగే, సమీపంలోని నక్షత్రాల ఏర్పాటును ప్రభావితం చేసేలా అవాంతరాలను సృష్టిస్తుంది. అంతే కాదు, యువ నక్షత్రాలు వాటి వాతావరణాలను ఎలా రూపొందిస్తాయో అర్థం చేసుకునేందుకు వాయువుల ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో మధ్య పరస్పర చర్యలు చాలా ముఖ్యమైనవిగా చెప్పొచ్చు. ఇప్పటికే వీటిపై పూర్తి స్థాయిలో అధ్యయనాలు జరుగుతున్నాయి.
NASA, ESA నుండి వచ్చిన డేటాను ఆధారంగా చేసుకుని వెలువడుతోన్న ఈ ఈ పరిశోధనలు, ప్రోటోస్టార్‌లు పూర్తిగా అభివృద్ధి చెందిన నక్షత్రాలుగా ఎలా మారతాయో అధ్యయనం చేసేందుకు ఉపయోగపడతాయి. అలాగే, వాటి పరిసరాలను ఎలా మారుస్తాయో, ఇంటర్స్టెల్లార్ మీడియంను ఎలా ప్రభావితం చేస్తాయో వెల్లడిస్తాయి. ముఖ్యంగా, ఈ ప్రక్రియలు మన గెలాక్సీలో నక్షత్ర నిర్మాణం గతిశీలత గురించి కీలకమైన ఆధారాలను కలిగి ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన