జ‌న్యు నియంత్ర‌ణ పురోగ‌తిలో స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌.. 2024 నోబెల్ బ‌హుమ‌తిని తెచ్చిపెట్టింది

జన్యువులను, జీవక్రమాన్ని మైక్రో RNA ఎలా ప్రభావితం చేస్తుందో చెబుతూ.. మనుషులతో పాటు ఇతర జీవజాలాన్ని ఎలా నియంత్రిస్తుందన్న విష‌యాల‌పై లోతుగా పరిశోధన చేసినందుకు ఈ ఇద్ద‌రికీ అరుదైన నోబెల్‌ గౌర‌వం ద‌క్కింది

జ‌న్యు నియంత్ర‌ణ పురోగ‌తిలో స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌.. 2024 నోబెల్ బ‌హుమ‌తిని తెచ్చిపెట్టింది

Photo Credit: microRNA

Victor Ambros and Gary Ruvkun won the 2024 Nobel Prize for discovering microRNA

ముఖ్యాంశాలు
  • ప్రోటీన్ ఉత్పత్తిని నియంత్రించడంలో మైక్రో RNAలు కీలక పాత్ర పోషిస్తాయి
  • ఇప్ప‌టికే చర్మ క్యాన్సర్‌ చికిత్సలో వీటి పనితీరుపై క్లినికల్‌ ట్రయల్స్
  • ఈ మైక్రో RNAను సూక్ష్మ జన్యుపదార్థ సమూహంగా చెప్పుకొవ‌చ్చు
ప్రకటన

జన్యు నియంత్రణకు సంబంధించి స‌రికొత్త‌ ఆవిష్కరణను అందించిన‌ మసాచుసెట్స్ విశ్వవిద్యాలయం నుండి విక్టర్ అంబ్రోస్, హార్వర్డ్ మెడికల్ స్కూల్ నుండి గ్యారీ రువ్‌కున్‌ను వైద్య‌శాస్త్రంలో విభాగంలో 2024 నోబెల్ బహుమతి వ‌రించింది. వీరిద్ద‌రూ పరిశోధన ద్వారా మైక్రో RNA విభాగాలను గుర్తించి, ఇవి శరీరంలో ప్రోటీన్ ఉత్పత్తిని నియంత్రించడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయని క‌నుగొన్నారు. జన్యువులను, జీవక్రమాన్ని మైక్రో RNA ఎలా ప్రభావితం చేస్తుందో చెబుతూ.. మనుషులతో పాటు ఇతర జీవజాలాన్ని ఎలా నియంత్రిస్తుందన్న విష‌యాల‌పై లోతుగా పరిశోధన చేసి, అందించిన‌ స‌రికొత్త‌ ఆవిష్కరణకుగానూ ఈ ఇద్ద‌రికీ అరుదైన గౌర‌వం ద‌క్కింది.

సాధార‌ణ‌ జీవుల ఎదుగుదలతోపాటు పనితీరుకు సంబంధించిన అనేక అంశాల‌ను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు వీరి ప‌రిశోధ‌న‌లు స‌హాయ‌ప‌డ‌తాయి. ఈ ఇద్ద‌రి పరిశోధన ఫలితాలు క్యాన్సర్‌ చికిత్సలో స‌రికొత్త అధ్య‌య‌నానికి తెర‌లేపినట్ల‌ని లండన్‌ ఇంపీరియల్‌ కాలేజీలో మాలిక్యులార్‌ అంకాలజీ లెక్చరర్‌ డాక్టర్‌ క్లెయిరీ ఫ్లెచర్ స్ప‌ష్టం చేశారు. అలాగే, చర్మ క్యాన్సర్‌ చికిత్సలో వీటి పనితీరుపై క్లినికల్‌ ట్రయల్స్ ఇప్పటికే నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆమె వెల్ల‌డించారు.

మైక్రో RNA కొత్త ఆవిష్క‌ర‌ణ‌..

వీరి పరిశోధనల ద్వారా జన్యువుల ప్రవర్తనను నియంత్రించేందుకు కొత్త అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. దీని ద్వారా అనేక‌ రకాల వ్యాధుల‌లో వ‌స్తోన్న మార్పుల‌ను ఎప్పటికప్పుడు తెలుసుకోవ‌డంతోపాటు చికిత్స‌కు కూడా అవ‌కాశం దొరుకుతుంది. అంతేకాదు, శ‌రీర‌ కణజాలంలోని ప్రొటీన్లను లక్ష్యంగా చేసుకున్నవే ఇప్పుడు మ‌న‌కు అందుబాటులో ఉన్న చాలావ‌ర‌కూ థెరపీలు. అలా కాకుండా, ఈ మైక్రో RNA స్థాయిలో జోడించ‌గ‌లిగితే మాత్రం దీని ద్వారా జన్యువులను నేరుగా నియంత్రించే అవ‌కాశం ఉంటుంది.

జన్యు నియంత్రణే కారకంగా..

విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లు కనిపెట్టిన ఈ మైక్రో RNAను సూక్ష్మ జన్యుపదార్థ సమూహంగా చెప్పుకొవ‌చ్చు. అలాగే, ఈ స‌మూహం కణజాల స్థాయిలోనే జన్యువుల పనితీరు నియంత్రించడంతోపాటు మార్చివేయ‌డంతో దీని పాత్ర కీల‌కం. అంటే, వీటి నియంత్ర‌ణ‌లో ఇది ఒక స్విచ్‌లా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఎందుకంటే, కణాలన్నింటిలో ఉండేది ఒకేలాంటి క్రోమోజోముల‌న్న విష‌యం తెలిసిందే. అయినప్పటికీ అనేక‌ జీవుల‌లో ఈ క‌ణాలు కండరాలుగా, నరాలుగా వేటికవే ప్రత్యేక లక్షణాలతో డెవ‌ల‌ప్ అవుతాయి. జీవ వికాసానికి అత్యంత కీలకమైన ఈ వ్యత్య‌సాల‌కు జన్యు నియంత్రణే కారకంగా ప‌నిచేస్తుంది.

వ్యాధిని నియంత్రించ‌వ‌చ్చు..

అయితే, డీఎన్‌ఏ నుంచి ఆర్‌ఎన్‌ఏకు వెళ్లే జన్యు సమాచారం రూపంలోనే ఈ నియంత్రణ అనేది జరుగుతుందని విక్ట‌ర్‌ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కువ్‌లు కనిపెట్టారు. ఈ మైక్రో RNA తాలూకు సంతులనంలో వ్య‌త్యాసాలే క్యాన్సర్‌తోపాటు అనేక వ్యాధులకు కారణమని వైద్యులు నిర్ధారించారు. అలాగే, కొన్ని కణాల్లో నిర్దిష్ట జన్యువులు మరీ ఎక్కువగా పని చేయడం లేదా ఉత్పరివర్తనం చెందడాన్ని వ్యాధిగా చెబుతారు. ఈ జన్యు కార్యకలాపాన్ని మార్చగలిగే మైక్రో RNAను ఎంపిక చేసు కోవడం ద్వారా వ్యాధిగ్రస్త కణాల్లో ఉత్పరివర్తనాలను అరిక‌ట్టేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. అంటే, వ్యాధిని పూర్తిగా నియంత్రించ‌వ‌చ్చు. అలాంటి మైక్రో RNAను ఉనికినే వీరిద్ద‌రూ క‌నిపెట్టారన్న మాట‌!

Comments

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. మార్కెట్లోకి రానున్న Realme GT 8 Pro.. అదిరిపోయే ఫీచర్స్ ఇవే
  2. రియల్‌మీ ఈ సిరీస్‌ను తొలిసారిగా అక్టోబర్ 21న చైనాలో ఆవిష్కరించింది
  3. ఐకూ 15 మోడల్ వివరాలు లీక్.. ఈ ప్రత్యేకతలు తెలుసుకున్నారా?
  4. ఈ రెండు ఫోన్లు నవంబర్ 3 నుంచి యూరప్‌లో విక్రయానికి వస్తాయి. Vivo అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు
  5. iQOO Neo 11 ధర చైనాలో CNY 2,599 (దాదాపు రూ. 32,500) నుంచి ప్రారంభమవుతోంది
  6. భారత వినియోగదారులు OnePlus 15 లాంచ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
  7. మార్కెట్లోకి అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4కె సెలెక్ట్.. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్
  8. అదిరిపోయే ఫీచర్లతో నథింగ్ ఫోన్ 3ఏ లైట్.. ఇంకా ఇతర విషయాలు తెలుసుకోండి
  9. ఈ ఫోన్‌లో Snapdragon 7s Gen 2 ప్రాసెసర్ అమర్చబడింది.
  10. ANC ఆఫ్‌లో ఉన్నప్పుడు ఒక్కసారి ఛార్జ్‌పై ఇయర్‌బడ్స్ 11 గంటల వరకు పనిచేస్తాయి.
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »