Photo Credit: Samsung
Samsung Galaxy Tab S10 FE సిరీస్ బూడిద, లేత నీలం మరియు వెండి షేడ్స్‌లో అందించబడుతుంది
భారత్ సహా ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్లలో Samsung Galaxy Tab S10 FE సిరీస్ లాంఛ్ అయ్యింది. ఈ లైనప్‌లో Wi-Fi, 5G ఆప్షన్‌లలో Galaxy Tab S10 FE, Tab S10 FE+ మోడల్స్ ఉన్నాయి. ఈ ట్యాబ్‌లు 12GB వరకు RAM, 256GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో అటాచ్ చేయబడిన ఇన్-హౌస్ Exynos 1580 ప్రాసెసర్‌ల ద్వారా శక్తిని గ్రహిస్తాయి. ఇవి Android 15-ఆధారిత One UI 7 తో వస్తున్నాయి. అలాగే, IP68-రేటెడ్ డస్ట్, వాటర్-రెసిస్టెంట్ బిల్డ్‌లను కలిగి ఉంటాయి. ఈ Galaxy Tab S10 FE ట్యాబ్‌లు Google సర్కిల్ టు సెర్చ్, ఆబ్జెక్ట్ ఎరేజర్, సాల్వ్ మ్యాథ్, బెస్ట్ ఫేస్ లాంటి అనేక AI ఫీచర్‌లతో అందుబాటులోకి వస్తున్నాయి.ధరలు ఇలా,ఇండియాలో Galaxy Tab S10 FE మోడల్ Wi-Fi వెర్షన్ 8GB + 128GB వేరియంట్ ధర రూ. 42,999 నుండి మొదలవుతుంది. 5G వెర్షన్ 8GB + 128GB, ధర రూ. 50,999, రూ. 61,999గా ఉంది. Galaxy Tab S10 FE+ Wi-Fi ఆప్షన్ 8GB + 128GB వేరియంట్ ధర రూ. 55,999, 5G వెర్షన్ ట్యాబ్ 8GB + 128GB వేరియంట్ ధర రూ.63,999గా ఉంది. ఈ Tab S10 FE సిరీస్ మన దేశంలో Samsung India వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. రెండు మోడల్స్ గ్రే, లైట్ బ్లూ, సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తాయి.
కొత్త Galaxy Tab S10 FE 10.9-అంగుళాల WUXGA+ (1,440x2,304 పిక్సెల్స్) TFT LCD స్క్రీన్ విజన్ బూస్టర్ సపోర్ట్‌తో వస్తోంది. Galaxy Tab S10 FE+ కు 13.1-అంగుళాల డిస్‌ప్లేను అందించారు. Galaxy Tab S10 FE సిరీస్ వెనుక భాగంలో 13-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను, సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 12-మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు. డ్యూయల్ స్పీకర్ యూనిట్ ఉంటుంది.
ఈ రెండు ట్యాబ్‌లకు Samsung Notes వంటి ఉత్పాదకత టూల్స్‌లో Solve Math, Handwriting Help వంటి ఫీచర్స్‌ను అందించారు. ట్యాబ్‌ల కోసం బుక్ కవర్ కీబోర్డ్ ప్రత్యేకమైన Galaxy AI కీ ని కలిగి ఉంటుంది. ఇది ఒకే ట్యాప్‌తో customisable AI అసిస్టెంట్‌ను లాంఛ్ చేయగలరు. ట్యాబ్‌లు ఆబ్జెక్ట్ ఎరేజర్, బెస్ట్ ఫేస్, ఆటి ట్రిమ్ వంటి AI-ఆధారిత ఇమేజింగ్, వీడియో ఎడిటింగ్ టూల్స్‌కు సపోర్ట్ చేస్తాయి.
Galaxy Tab S10 FE, Galaxy Tab S10 FE+ వరుసగా 8,000mAh, 10,090mAh బ్యాటరీలను కలిగి ఉన్నాయి. ఇవి 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్నాయి. సెక్యూరిటీ కోసం వీటికి సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. అలాగే, వీటిలో Samsung Knox సెక్యూరిటీ కూడా ఉంది.
ప్రకటన
ప్రకటన