Infinix

Infinix - ख़बरें

  • గ్లోబ‌ల్ మార్కెట్‌లోకి విడుదలైన Infinix Note 50 Pro+ 5G.. ధ‌రతోపాటు స్పెసిఫికేష‌న్స్ ఇవే
    Infinix కంపెనీ త‌మ Infinix Note 50 Pro+ 5G మోడ‌ల్‌ను గ్లోబ‌ల్ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్టిమేట్ ప్రాసెస‌ర్‌పై ర‌న్ అవుతుంది. అలాగే, 144Hz రిఫ్రెష్ రేట్‌తో AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. Infinix Note 50 Pro+ 5G కంపెనీ Note 50 సిరీస్ నుంచి వ‌చ్చిన మూడవ మోడల్. ఇందులో Infinix Note 50, Note 50 ప్రోలను మొదటగా ఇండోనేషియా మార్కెట్‌లో లాంఛ్ చేశారు. Infinix Note 50 Pro+ 5G మోడ‌ల్ Infinix AI ఫీచర్లతో రానుంది. అలాగే, 100W వైర్డ్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌కు స‌పోర్ట్‌తో 5,200mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
  • మార్చి 27న Infinix Note 50X 5G భార‌త్‌లో లాంఛ్‌.. డిజైన్ అధికారిక ప్ర‌క‌ట‌న‌
    త్వ‌ర‌లోనే Infinix Note 50X 5G మ‌న దేశంలోకి రాబోతోంది. తాజాగా, కంపెనీ లాంచ్ తేదీని ప్రకటించింది. అలాగే, రాబోయే హ్యాండ్‌సెట్ డిజైన్‌ను కూడా వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ లైవ్‌లో వచ్చిన మైక్రోసైట్ ఈ-కామర్స్ సైట్‌లో దీని లభ్యతను ధృవీకరించింది. లాంచ్‌కు ముందు రోజుల్లో ఈ స్మార్ట్ ఫోన్ గురించి మరిన్ని వివరాలను వెల్ల‌డించే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ వారం ప్రారంభంలోనే Infinix ఇండోనేషియాలో బేస్ Note 50, Note 50 ప్రో, Note 50 ప్రో+ లను ఆవిష్కరించింది. భార‌త్‌లో ఈ వేరియంట్‌ల లాంఛ్‌పై ఇంకా స్ప‌ష్ట‌త లేదు.
  • Infinix Note 50 సిరీస్ లాంఛ్‌ తేదీ ప్ర‌క‌టించిన కంపెనీ.. మొదటగా ఇండోనేషియాలో విడుద‌ల‌
    మార్చి నెల‌లో Infinix Note 50 సిరీస్ లాంఛ్ కానున్న‌ట్ల కంపెనీ ప్ర‌క‌టించింది. రాబోయే స్మార్ట్ ఫోన్ లైనప్ దాదాపు ఏడాది క్రితం విడుద‌లైన Infinix Note 40 మోడ‌ల్‌కు కొన‌సాగింపుగా వ‌స్తోంది. ఈ సిరీస్‌ మొదటగా ఇండోనేషియాలో విడుద‌ల కానుంది. అలాగే, కంపెనీ ప‌బ్లిష్ చేసిన‌ టీజర్‌లో Infinix Note 50 సిరీస్‌లోని హ్యాండ్‌సెట్‌లలో ఒక దాని వెనుక కెమెరా మాడ్యూల్‌ను కూడా చూడొచ్చు. ఈ రాబోయే Note 50 సిరీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లకు కూడా స‌పోర్ట్ చేస్తుంద‌ని కంపెనీ అధికారికంగా వెల్ల‌డించింది.
  • రెండు 50-మెగాపిక్సెల్ ఔటర్ కెమెరాల‌తో విడుద‌లైన‌ Infinix Zero Flip స్మార్ట్‌ఫోన్‌
    Infinix కంపెనీ నుంచి మొట్టమొదటి క్లామ్‌షెల్-స్టైల్‌ ఫోల్డబుల్ ఫోన్‌ Infinix Zero Flipను దేశీయ మార్కెట్‌లోకి విడుద‌ల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ 6.9-అంగుళాల LTPO AMOLED ఇన్న‌ర్‌ స్క్రీన్, 3.64-అంగుళాల AMOLED కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది MediaTek Dimensity 8020 ప్రాసెసర్‌తో గరిష్టంగా 16GB RAMతో అటాచ్ చేయబడింది. Infinix Zero Flipలో రెండు 50-మెగాపిక్సెల్ ఔటర్ కెమెరాలు ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్ 14లో ర‌న్ అవుతుంది. అలాగే, రెండు ఆండ్రాయిడ్ OS వెర్షన్ అప్‌గ్రేడ్‌లతోపాటు మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందొచ్చ‌న్ని కంపెనీ వెల్ల‌డించింది
  • 5,000mAh బ్యాటరీతో లాంచ్ అవుతోన్న Infinix Hot 50i ధరతోపాటు స్పెసిఫికేష‌న్స్‌
    గ్లోబ‌ల్ మార్కెట్‌లో ఎంపిక చేసిన కొన్ని చోట్ల‌ Infinix Hot 40iకి కొన‌సాగింపుగా వ‌స్తున్న Infinix Hot 50i లాంచ్ కాబోతోంది. చైనా ట్రాన్స్‌షన్ హోల్డింగ్స్ యాజమాన్యంలోని బ్రాండ్ ద్వారా కొత్త Hot సిరీస్ ఫోన్‌లో MediaTek Helio G81 ప్రాసెస‌ర్‌తోపాటు గరిష్టంగా 6GB RAM ఉంటుంది. Infinix Hot 50i స్మార్ట్‌ఫోన్‌ 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో హోల్ పంచ్ డిస్‌ప్లేని క‌లిగి ఉంటుంది. 5,000mAh బ్యాటరీ సామ‌ర్థ్యంతో 48-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ క‌లిగిన‌ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో అందుబాటులోకి రానుంది. నీరు, ధూళిని నిరోధించేందుకు IP54 రేటింగ్‌ను కలిగి ఉంటుంది
  • భార‌త్ మార్కెట్‌లోకి Infinix Zero Flip ఫోన్‌.. అక్టోబర్ 17న అడుగుపెడుతోంది
    దేశీయ మార్కెట్‌లోకి Infinix Zero Flip త్వరలోనే విడుద‌ల కానుంది. కంపెనీ యొక్క మొట్టమొదటి క్లామ్‌షెల్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ గత నెలలోనే గ్లోబల్ మార్కెట్‌లలో లాంచ్ అయ్యింది. తాజాగా అక్టోబర్ మధ్య నాటికి మ‌న‌దేశంలో అడుగుపెట్ట‌నున్న‌ట్లు కంపెనీ ధృవీకరించింది. Infinix Zero Flip మీడియాటెక్ డైమెన్సిటీ 8020 ప్రాసెస‌ర్‌తో వ‌స్తుంది. అలాగే, 3.64-అంగుళాల కవర్ డిస్‌ప్లేతో పాటు 6.9-అంగుళాల లోపలి స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. దీనిలో 50-మెగాపిక్సెల్ డ్యూయల్ ఔటర్ కెమెరా సెటప్‌ను కూడా అందించారు. అయితే, మూడవ 50-మెగాపిక్సెల్ కెమెరా లోపలి స్క్రీన్‌పై హోల్‌-పంచ్ కటౌట్‌లో ఉంటుంది
  • 7,000mAh బ్యాటరీతో Infinix Xpad వ‌చ్చేసింది
    దేశీయ మార్కెట్‌లోకి Infinix Xpad లాంచ్ అయింది. మ‌న భార‌త‌దేశంలో Infinix కంపెనీ నుంచి వ‌చ్చిన మొట్టమొదటి ట్యాబ్ ఇది. ఈ Infinix Xpad 11-అంగుళాల ఫుల్‌-HD+ స్క్రీన్, 8-మెగాపిక్సెల్ మెయిన్‌ కెమెరా, క్వాడ్ స్పీకర్ యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఇది Wi-Fi అలాగే 4G LTE కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తూ.. ఆండ్రాయిడ్ 14-ఆధారిత XOS 14తో ప‌నిచేస్తుంది. కొత్తగా లాంచ్ అయిన ఈ ట్యాబ్ 8GB వరకు RAMతో 256GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో జత చేయబడిన ఆక్టా-కోర్ MediaTek Helio G99 ప్రాసెస‌ర్‌తో వస్తుంది. అంతేకాదు, ఈ ట్యాబ్‌ నెలాఖరులో దేశీయ మార్కెట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. నిజానికి Infinix Xpad గ‌త నెల‌లోనే గ్లోబ‌ల్ మార్కెట్‌లో విడుద‌ల అయింది. ఇప్పుడు తాజాగా మ‌న దేశంలో దీనిని లాంచ్ చేశారు
  • Infinix XPad ట్యాబ్ స్పెసిఫికేష‌న్స్‌తోపాటు పూర్తి వివ‌రాలు ఇవే
    గ‌త‌నెల‌లో గ్లోబల్ మార్కెట్‌లో Infinix కంపెనీ XPadని విడుదల చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ మోడ‌ల్‌ను దేశీయ మార్కెట్‌లో సెప్టెంబర్ 13వ తేదీన లాంచ్ చేయ‌నున్న‌ట్లు కంపెనీ ప్ర‌క‌టించింది. ఈ కంపెనీ నుంచి భారతదేశంలో విడుద‌ల‌వుతోన్న మొట్టమొదటి ట్యాబ్ ఇది. దేశీయ మార్కెట్‌లో ఫ్రాస్ట్ బ్లూ, టైటాన్ గోల్డ్, స్టెల్లార్ గ్రే రంగులలో అందుబాటులోకి రానుంది. ఈ ట్యాబ్‌ మెటల్ యూనిబాడీ డిజైన్‌ను కలిగి ఉంటుందని Infinix స్ప‌ష్టం చేసింది. అలాగే ఇందులో 11 అంగుళాల‌ (1920 x 1200 పిక్సెల్‌లు) ఫుల్ HD+ స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్, 83 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, క్వాడ్ స్పీకర్లు, 4G LTE సపోర్ట్‌తో రూపొందించారు. ChatGPT ఆధారితమైన వాయిస్ అసిస్టెంట్‌ని కంపెనీ పెద్ద స్థాయిలో ప్ర‌చారం చేస్తోంది
  • Infinix Zero 40 సిరీస్ నుంచి వ‌చ్చిన ఫోన్‌ల ధ‌ర‌ల‌తోపాటు ఫీచ‌ర్స్ ఇవే
    దిగ్గ‌జ స్మార్ట్‌ఫోన్‌ల త‌యారీ కంపెనీ Infinix త‌న Infinix Zero 40 సిరీస్‌ను ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్‌ల‌లో లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో Infinix Zero 40 5G, Infinix Zero 40 4G హ్యాండ్‌సెట్‌లు ఉన్నాయి. ఇవి 108-మెగాపిక్సెల్ ప్రైమ‌రీ కెమెరా, 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో అందిస్తున్నారు. అలాగే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో కూడిన 6.74-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో వీటిని అందుబాటులోకి తీసుకువ‌చ్చారు. మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లతో పాటు ఆండ్రాయిడ్ 16 వరకు - రెండు OS అప్‌గ్రేడ్‌లను ఈ హ్యాండ్‌సెట్‌లు అందుకోనున్నాయి.
  • మోడ్ర‌న్ ఫీచ‌ర్స్‌తో Infinix XE27, Infinix Buds Neo దేశీయ మార్కెట్‌లోకి!
    Infinix Buds Neo వైర్‌లెస్ హెడ్‌సెట్‌ను కూడా ఆవిష్కరించింది. ఈ రెండు TWS ఇయర్‌ఫోన్‌లు దుమ్ము, స్ప్లాష్ నిరోధించేందుకు IPX4 రేటింగ్‌ను కలిగి ఉన్నాయి.
  • ద‌ఏశ‌దేశీయ మార్కెట్‌లోకి ఆగ‌స్టు 21న Infinix InBook Y3 Max ల్యాప్‌ట్యాప్ లాంచ్‌!
    Infinix InBook Y3 Max బాడీ అల్యూమినియం అల్లాయ్ బాడీతో కఠినమైన బ్రష్ మెటల్ ఫినిషింగ్‌తో ఉంటుంది. అలాగే, 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 70Wh బ్యాటరీని కలిగి ఉంది.
  • Infinix Xpad ట్యాబ్ దేశీయ మార్కెట్‌లోకి ఎప్పుడు లాంచ్ అవుతుందంటే..?!
    Infinix నైజీరియన్ ఆర్మ్ నుంచి టీచ‌ర్‌ను విడుద‌ల చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీని ద్వారా ట్యాబ్‌కు సంబంధించిన అనేక స్పెసిఫికేషన్లను కంపెనీ ధృవీకరించినట్లు స్ప‌ష్ట‌మైంది.
  • Infinix Note 40X ఫీచ‌ర్స్ తెలిస్తే.. ఫిదా అయిపోతారు!
    Infinix Note 40X 5G మాదిరిగా 108 మెగా పిక్సెల్ ఆల్ట్రాతో కూడిన మెయిన్ సెన్స‌ర్ కెమెరాతో ట్రిపుల్ రేర్ కెమెరాతోపాటు 2 మెగా పిక్సెల్ సెన్స‌ర్ కెమెరా, లైట్ సెన్స‌ర్‌తో కూడిన మూడో కెమెరాతో రూపొందించారు.

Infinix - वीडियो

ప్రకటన
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »