ఈ నెల ప్రారంభంలో Galaxy Unpacked ఈవెంట్‌లో కంపెనీ యొక్క ఫ్లాగ్‌షిప్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రారంభించిన తర్వాత ఈ సంవత్సరం చివర్లో Samsung Galaxy Tab S10 సిరీస్‌ను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. మార్కెట్ విశ్లేషకుల అంచనా ప్రకారం.. కంపెనీ నుంచి రాబోయే టాబ్లెట్‌ల ఉత్పత్తి వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. ముఖ్యంగా, Samsung తన Galaxy Tab S10 సిరీస్‌ను అక్టోబర్‌లో రెండు మోడళ్లతో విడుదల చేయవచ్చని ఇటీవలి నివేదిక ఆధారంగా స్పష్టమవుతోంది. మరెందుకు ఆలస్యం.. Samsung Galaxy Tab S10 సిరీస్‌కు సంబంధించి మరింత సమాచారాన్ని ఇక్కడ తెలుసుకుందాం!
ఈ సంవత్సరం రెండు మోడల్స్
డిస్‌ప్లే సప్లై చైన్ కన్సల్టెంట్స్ (DSCC) CEO రాస్ యంగ్ X (గతంలో ట్విట్టర్)లో ఒక పోస్ట్ చేశారు. అందులో ఆగస్ట్ నెలలో Samsung తన Tab S10 సిరీస్ ఉత్పత్తిని ప్రారంభిస్తుందని పేర్కొన్నారు. యంగ్ పోస్టును బట్టీ ఎస్ 10 సిరీస్ ప్రారంభం ధృవీకరించినట్లయింది. ఈ సంవత్సరం రెండు మోడల్స్‌ను మాత్రమే ప్రారంభించనున్నారని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే, గెలాక్సీ టాబ్ ఎస్ 10 ప్లస్, గెలాక్సీ టాబ్ ఎస్ 10 అల్ట్రా, శామ్‌సంగ్ బేస్ ట్యాబ్ మోడల్‌ను నిలిపివేస్తుందని భావిస్తున్నారు. విశ్లేషకుల అంచనాలను బట్టీ.. రెండు ట్యాబ్‌లు గ్రే మరియు సిల్వర్ కలర్స్‌లో అందుబాటులోకి రావచ్చు. ప్రొడక్షన్ టైమ్‌లైన్‌తో పాటు అక్టోబర్‌లో Samsung Galaxy Tab S10 సిరీస్‌ను ప్రారంభించవచ్చని సమాచారం. అయితే, ట్యాబ్‌ల లాంచ్‌కు సంబంధించిన ఇతర వివరాలను యంగ్ తెలియబరచలేదు. కానీ, మునుపటి సమాచారాన్ని బట్టీ Samsung నుంచి రాబోయే ట్యాబ్‌ల గురించిన సమాచారాన్ని అంచనా వేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. క్వాడ్ స్పీకర్‌లను కలిగి
Samsung Galaxy Tab S10 Plus అలాగే Galaxy Tab S10 Ultra కనీసం 12 అంగుళాల పరిమాణంలో పెద్ద AMOLED స్క్రీన్‌లను కలిగి ఉంటాయని తెలుస్తోంది. Galaxy Tab S10 Ultra సింగిల్-కోర్ రౌండ్‌లో 2,141, మల్టీ-కోర్ విభాగంలో 5,533 స్కోర్‌లను సాధించింది. ఈ బెంచ్‌మార్క్ ఫలితాలను బట్టీ ఇది 12GB RAMతో జత చేయబడి MediaTek డైమెన్సిటీ 9300+ ప్రోసెసర్ ద్వారా శక్తిని పొందవచ్చని అంచనాలు ఉన్నాయి. అలాగే, ఈ ట్యాబ్ మోడల్ నంబర్ SM-X828Uతో వస్తూ.. ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. మదర్‌బోర్డ్ విభాగం 'gts10uసని సూచిస్తుంది. ఇది ట్యాబ్ యొక్క మార్కెటింగ్ పేరును వెల్లడిస్తుంది. దీంతోపాటు Samsung Galaxy S10 అల్ట్రా 14.6-అంగుళాల AMOLED స్క్రీన్‌తో రూపొందించి, Galaxy Tab S10 Ultra యొక్క పరిమాణం Galaxy Tab S9 Ultraకి దాదాపు సమానంగా ఉంటాయి.
ఈ మోడల్ సింగిల్-కోర్ రౌండ్‌లో 2,141, మల్టీ-కోర్ విభాగంలో 5,533 స్కోర్‌లను సాధించింది. ఈ కొత్త ట్యాబ్ క్వాడ్ స్పీకర్‌లను కలిగి ఉండనుంది. బహుశా AKG ద్వారా ట్యూన్ చేయవచ్చు. పరికరం కుడి వైపున పవర్ వాల్యూమ్ బటన్‌లను అందించారు. ఈ ట్యాబ్ వెనుక భాగంలో S పెన్ కోసం మాగ్నెటిక్ ఛార్జింగ్‌ను అందించారు. Galaxy Tab S10 Ultra మోడల్ 12GB, 16GB RAMతో రానున్నట్లు అంచనా వేస్తున్నారు. అలాగే, ఇది Galaxy Tab S9 Ultra ద్వారా సెట్ చేసిన నమూనాకు అనుగుణంగా 256GB, 512GB, 1TB స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉండనుంది. మరి Samsung Galaxy Tab S10 సిరీస్ మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం అక్టోబర్‌లో రెండు మోడళ్లతో విడుదల చేస్తే తప్ప దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం లేదు. Samsung ట్యాబ్ ప్రియులంతా అప్పటివరకూ వేచి చూడాల్సిందే!