Photo Credit: Reuters
దేశంలోని ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు కొత్త ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి
ప్రముఖ టెలికాం ఆపరేటర్ భారతీ ఎయిర్‌టెల్ ఇండియాలో జియోతో పోటీ పడుతూ నెంబర్ వన్ టెలికాం ఆపరేటర్ గా ఉంటుంది. అయితే ఎయిర్‌టెల్ ఎప్పటికప్పుడు కొత్త కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త ప్లాన్స్ తో ముందుకు వస్తూ ఉంటుంది. అలాగే తన కస్టమర్లకు కొత్త బెనిఫిట్స్ అందించాలని కొత్త ప్లాన్స్ ను పరిచయం చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఇండియా టెలికాం మార్కెట్లో జియో 40% కస్టమర్ షేర్ తో ముందు ఉంటే, 33% షేర్ తో భారతీ ఎయిర్‌టెల్ రెండో స్థానంలో ఉంది.తాజాగా ఇండియాలో ఉన్న పోస్ట్ పెయిడ్వినియోగదారుల కోసం కొత్త ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్స్ ను పరిచయం చేసింది. ఈ ప్లాన్స్ ,189 దేశాల్లో వాయిస్ కాల్స్, అన్ ఎయిర్‌టెల్ డేటాని పొందవచ్చు. విదేశాలకు ప్రయాణించే ఎయిర్టెల్ కస్టమర్స్ కొత్తగా ప్రకటించిన ఈ ప్లాన్స్ ద్వారా ఇన్-ఫ్లైట్ బెనిఫిట్స్ పొందే అవకాశం కూడా ఉంది. ఈ ప్లాన్ నిత్యం విదేశాలకు ప్రయాణం చేసే ఎయిర్టెల్ కస్టమర్లకు బాగా ఉపయోగపడుతుందని టెక్ పండితులు చెబుతున్నారు.
ఎయిర్టెల్ తన అఫీషియల్ వెబ్సైట్లో ఈ రెండు ప్లాన్ల డీటెయిల్స్ ఉంచింది. ఈ ప్లాన్స్ వివరాలు చూస్తే.. రూ.2,999 రీఛార్జ్ చేస్తే 10 రోజుల పాటు వ్యాలిడిటీ పొందొచ్చు. అలాగే రూ.3,999 రీఛార్జ్ చేస్తే 30 రోజుల పాటు వ్యాలిడిటీ పొందవచ్చు. ఈ రెండు ప్లాన్స్ ఉపయోగించుకునే యూజర్స్ 100
గంటల ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ ని ఎంజాయ్ చేయవచ్చు. ఈ ప్లాన్స్ కస్టమర్స్ కి ఇన్-ఫ్లైట్ బెనిఫిట్స్ కూడా అందిస్తున్నాయి. దీనిలో భాగంగా 100 నిమిషాల అవుట్ గోయింగ్ కాల్స్, 100 ఫ్రీ SMSలు, 250MB డేటాను పొందవచ్చు. ఈ ఇన్- ఫ్లైట్ బెనిఫిట్స్ 24 గంటల వ్యాలిడిటీ ఉంటాయి.
ఈ ప్లాన్స్ ఉపయోగిస్తున్న కస్టమర్లు విదేశాలకు వెళ్ళినపుడు రోమింగ్ బెనిఫిట్స్ పొందేందుకు ఇప్పుడు కొత్తగా సిమ్ మార్చాల్సిన పనిలేదు. ఒక్కసారి డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత ఈ ప్లాన్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది. దీంతో కస్టమర్లకు సిమ్ మార్చే కష్టాలు తప్పినట్లే.
ఆకట్టుకునేందుకు ఇలాంటి ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. దీనిలో ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి. గల్ఫ్ దేశాలతో పాటు, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) దేశాల్లో ఈ ప్లాన్లు పనిచేస్తాయి. వీటి వ్యాలిడిటీ 20 రోజులు నుండి 40 రోజుల వరకు ఉంటుంది. ఈ ప్లాన్స్ పనిచేస్తాయి. ఇక ఇండియా టెలికాం మార్కెట్లో VI 17% కస్టమర్లతో మూడో స్థానంలో ఉన్నది.
మొత్తంగా, ఎయిర్‌టెల్ తాజా ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్స్ తో తరచుగా విదేశాలకు ప్రయాణించే కస్టమర్లకు మంచి బెనిఫిట్స్ అందించే ప్లాన్స్ గా కనిపిస్తున్నాయి. ఈ కొత్త ప్లాన్స్ తో అయినా ఎయిర్‌టెల్ మార్కెట్లో తన కస్టమర్ షేర్ ని పెంచుకుంటుందేమో చూడాలి.
ప్రకటన
ప్రకటన