రూ. 279 ప్రారంభ ధ‌ర‌తో ఎయిర్ టెల్‌ కొత్త ఆల్-ఇన్-వన్ OTT ప్యాక్‌లు వ‌చ్చేశాయి

24 రోజులు, 84 రోజుల చెల్లుబాటుతో వ‌రుస‌గా రూ. 598, రూ. 1729 ధ‌ర‌ల్లో ఎంట్రైన్‌మెంట్ రీఛార్జ్ ప్యాక్‌ల‌ను సైతం అందుబాటులోకి తీసువ‌చ్చింది

రూ. 279 ప్రారంభ ధ‌ర‌తో ఎయిర్ టెల్‌ కొత్త ఆల్-ఇన్-వన్ OTT ప్యాక్‌లు వ‌చ్చేశాయి

Photo Credit: Reuters

ఎయిర్‌టెల్ కొత్త ఆల్-ఇన్-వన్ OTT ప్రీపెయిడ్ రీఛార్జ్ పోర్ట్‌ఫోలియోలో నాలుగు ప్లాన్‌లు ఉన్నాయి

ముఖ్యాంశాలు
  • ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఎయిర్ టెల్ కొత్త ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్‌లు
  • రూ. 598 ప్లాన్‌తో OTT యాక్సెస్‌తోపాటు డేటా, కాలింగ్ ప్రయోజనాలు
  • రూ. 279 ప్యాక్‌తో ప్రధాన OTT ప్లాట్‌ఫామ్‌లకు ఒక నెల సభ్యత్వాన్ని పొందొచ్చ
ప్రకటన

ప్ర‌ముఖ టెలికాం కంపెనీ భార‌తీ ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ వినియోగ‌దారుల కోసం స‌రికొత్త ఓటీటీ ప్లాన్ ను తీసుకు వ‌చ్చింది. ఇది దేశంలోనే ఆల్ ఇన్ వ‌న్ ఓటీటీల‌తో కూడిన మొట్ట‌మొద‌టి ప్లాన్ గా చెప్పొచ్చు. ఇందులో ఒక్క రీఛార్జ్‌తో 25కి పైగా స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫాంల‌ను యాక్సెస్ చేయ‌వ‌చ్చు. ఒక నెల చెల్లుబాటు అయ్యేలా రూ. 279ల‌తో ఎంట్రీ లెవ‌ల్ ప్లాన్‌ను అందిస్తోంది. అలాగే, ఇందులో జియో సినిమా, జీ5, నెట్‌ఫ్లిక్స్‌, సోనీలివ్ వంటి ప్ర‌ముఖ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫాంల‌ను పొందొచ్చు. అంతేకాదు, 24 రోజులు, 84 రోజుల చెల్లుబాటుతో వ‌రుస‌గా రూ. 598, రూ. 1729 ధ‌ర‌ల్లో ఎంట్రైన్‌మెంట్ రీఛార్జ్ ప్యాక్‌ల‌ను సైతం అందుబాటులోకి తీసువ‌చ్చింది.ఆల్ ఇన్ వ‌న్ ఓటీటీ ప్యాక్‌,మ‌న దేశంలో ఎయిర్ టెల్ తీసుకువ‌చ్చిన కొత్త ఆల్ ఇన్ వ‌న్ ఓటీటీ ప్యాక్‌తో యూజ‌ర్స్‌ను మ‌రింత ఆక‌ర్షించేందుకు కంపెనీ ప్ర‌ణాళిక‌లు వేస్తున్న‌ట్లు స్ప‌ష్టంగా అర్థ‌మైపోతుంది. ముఖ్యంగా, రూ.279, రూ. 598, రూ. 1729 రీఛార్జ్ ప్లాన్‌లకు వినియోగ‌దారు నుంచి మంచి స్పంద‌న వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఈ ప్లాన్‌ల‌తో నెట్‌ఫ్లిక్స్‌, జియో హాట్‌స్ట‌ర్‌, జీ5, సోనీలివ్‌, ఆహాతోపాటు మంచి ప్రాచుర్యం పొందిన ఫ్లాట్‌ఫాంల‌ను యాక్సెస్ చేసేందుకు అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్లు కంపెనీ స్ప‌ష్టం చేసింది.

16 భాష‌ల కంటే ఎక్కువ

పై రీఛార్జ్ ప్లాన్‌ల‌తో 16 భాష‌ల కంటే ఎక్కువ ఇంట‌రాక్టివ్‌, రీజ‌న‌ల్ కంటెంట్‌, ఆప్ష‌న‌ల్‌గా ఒకే స‌బ్‌స్క్రిప్ష‌న్‌లో అన్ లిమిటెడ్ 5G డేటాను కూడా అందిస్తోంది. నెల రోజుల పాటు చెల్లుబాటు అయ్యేలా రూ. 279 రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఇందులో ఎయిర్ టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్‌తోపాటు నెట్‌ఫ్లిక్స్ బేసిక్‌, జియోహాట్‌స్ట‌ర్‌, జీ5 యాక్సెస్ కూడా పొందొచ్చు.

రూ. 750 విలువ చేసే

అంతే కాదు, ఈ రూ. 279 ప్లాన్‌తో యూజ‌ర్స్ రూ. 750 విలువ చేసే అనేక ప్ర‌ముఖ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫాంల‌ను యాక్సెస్ చేసేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని కంపెనీ చెబుతోంది. రూ. 279 ధ‌ర‌తో ప్రీపెయిడ్‌ కంటెంట్ ఓన్లీ ప్యాక్‌ను కూడా ఒక నెల చెల్లుబాటుతో తీసుకువ‌చ్చింది. దీని ద్వారా నెట్‌ఫిక్స్ బేసిక్‌తోపాటు జీ5, జియోహాట్‌స్ట‌ర్‌, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియంతోపాటు ఆ నెల‌కు 1GB డేటాను కూడా సొంతం చేసుకోవ‌చ్చు.

84 రోజుల వ్యాలిడిటీతో

కొత్త ప్లాన్‌ల‌లో రూ. 598 ప్రీపెయిడ్ ప్లాన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి. ఈ ఎయిర్ టెల్ రీఛార్జ్ ప్లాన్‌తో అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌తోపాటు అన్ లిమిటెడ్ 5G డేటాను కూడా పొంద‌వ‌చ్చు. దీంతోపాటుగా ఈ 28 రోజుల చెల్లుబాటు అయ్యే ప్లాన్ ద్వారా ఓటీటీ ఫ్లాట్‌ఫాంల యాక్సెస్‌ను సొంతం చేసుకోవ‌చ్చు. ఇక‌, రూ. 1729 ప్లాన్ ద్వారా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్‌, అన్ లిమిటెడ్ 5G, ఓటీటీ ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే, దీని వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది.

Comments

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. మార్కెట్లోకి రానున్న Realme GT 8 Pro.. అదిరిపోయే ఫీచర్స్ ఇవే
  2. రియల్‌మీ ఈ సిరీస్‌ను తొలిసారిగా అక్టోబర్ 21న చైనాలో ఆవిష్కరించింది
  3. ఐకూ 15 మోడల్ వివరాలు లీక్.. ఈ ప్రత్యేకతలు తెలుసుకున్నారా?
  4. ఈ రెండు ఫోన్లు నవంబర్ 3 నుంచి యూరప్‌లో విక్రయానికి వస్తాయి. Vivo అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు
  5. iQOO Neo 11 ధర చైనాలో CNY 2,599 (దాదాపు రూ. 32,500) నుంచి ప్రారంభమవుతోంది
  6. భారత వినియోగదారులు OnePlus 15 లాంచ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
  7. మార్కెట్లోకి అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4కె సెలెక్ట్.. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్
  8. అదిరిపోయే ఫీచర్లతో నథింగ్ ఫోన్ 3ఏ లైట్.. ఇంకా ఇతర విషయాలు తెలుసుకోండి
  9. ఈ ఫోన్‌లో Snapdragon 7s Gen 2 ప్రాసెసర్ అమర్చబడింది.
  10. ANC ఆఫ్‌లో ఉన్నప్పుడు ఒక్కసారి ఛార్జ్‌పై ఇయర్‌బడ్స్ 11 గంటల వరకు పనిచేస్తాయి.
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »