Photo Credit: BSNL
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ మధ్యలో కొత్త BSNL ప్లాన్ వస్తుంది.
మన దేశంలోని తమ ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారుల కోసం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. స్పెషల్ టారిఫ్ వోచర్ (STV)గా పరిచయం చేసిన దీని ధర రూ. 251గా ఉంది. అంటే, ఇది యాక్టీవ్ సర్వీస్ వాలిడిటీతో రాదన్నమాట. ప్రభుత్వ ఆధీనంలో నడిచే ఈ టెలికమ్యూనికేషన్స్ ఆపరేటర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ వోచర్ భారత్‌లో ప్రస్తుతం జరుగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ను వీక్షించే వారికి ఉపయోగపడేలా డేటా ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ప్లాన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను చూద్దాం!యాక్టివ్ బేస్ ప్లాన్ తప్పనిసరి,IPL 251గా పిలువబడే ఈ BSNL స్పెషల్ టారిఫ్ వోచర్ ధరను రూ. 251గా నిర్ణయించడంతోపాటు 60 రోజుల పాటు 251GB వరకు డేటాను అందిస్తోంది. అలాగే, ఫెయిర్ యూసేజ్ పాలసీ (FUP) ప్రకారం.. వినియోగదారులు పరిమితి అయిపోయినట్లయితే అపరిమిత ఇంటర్నెట్‌ను ఆస్వాదించే అవకాశం ఉంటుంది. అయితే, ఆ తర్వాత వేగం 40 Kbpsకి తగ్గిపోతుంది. అలాగే, ఈ రూ. 251 STV ప్లాన్ ఓన్ సర్వీస్ వాలిడిటీతో రాదని మాత్రం గుర్తుంచుకోవాలి. ఈ కారణంగా, ఇది పనిచేసేందుకు యాక్టివ్ బేస్ ప్లాన్ తప్పనిసరి.
మన దేశంలో IPL-ఫోకస్డ్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టిన టెలికాం ఆపరేటర్ BSNL ఒక్కటే కాదు. దీనికి, పోటీదారులుగా ఉన్న Airtel, Reliance Jio, Vodafone Idea (Vi) కూడా ఈ తరహా డేటా ప్రయోజనాలతో కూడిన ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. అలాగే, Jio రూ. 100 ప్లాన్‌తో 90 రోజుల కాలపరిమితికి JioHotstar కు ad-supported సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌కు వినియోగదారుల నుంచి మంచి స్పందన వచ్చినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
మరో పోటీదారుగా ఉన్న ఎయిర్‌టెల్ జియోహాట్‌స్టార్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో రెండు కొత్త క్రికెట్ ప్యాక్‌లను సైతం తీసుకువచ్చింది. 30 రోజుల చెల్లుబాటుతో రూ. 100 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్ 5GB డేటాను అందించడం ద్వారా కంపెనీ వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. అంతే కాదు, జియోహాట్‌స్టార్‌కు 30 రోజుల యాక్సెస్‌ను కూడా అందిస్తోంది. అలాగే, రూ. 195 ప్లాన్ OTT స్ట్రీమింగ్ సర్వీస్‌కు 90 రోజుల సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 15GB డేటాను పొందేందుకు అవకాశం కల్పిస్తోంది.
BSNL భోపాల్, చండీగఢ్, చెన్నై, జైపూర్, లక్నో, పాట్నా వంటి ప్రముఖ నగరాల్లో తమ 5G మౌలిక సదుపాయాలను పరీక్షించడం ప్రారంభించిందనే నివేదికల సమయంలో ఈ ప్రకటన వెలువడింది. అలాగే, ఈ టెలికాం ఆపరేటర్ రాబోయే మూడు నెలల్లో ఢిల్లీలో నెట్‌వర్క్-యాజ్-ఎ-సర్వీస్ (NaaS) మోడల్‌ను తీసుకురావడం ద్వారా తమ 5G సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇతర పోటీదారులకు BSNL గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ప్రకటన
ప్రకటన