ఇండియాలో మొబైల్ డేటా వినియోగం గత పది సంవత్సరాలుగా 288 రెట్లు పెరిగిందని వోడాఫోన్ - ఐడియా(VI) పేర్కొంది. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) లెక్కల ప్రకారం 2023లో 88.1 కోట్లు ఉన్న ఇంటర్నెట్ సబ్స్క్రైబర్లు 2024 మార్చికి 95.4 కోట్లకు పెరిగినట్టు తెలిపింది.
Photo Credit: Vi
Vi తన కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో రోజంతా అపరిమిత డేటాను అందిస్తుంది
ఇండియాలో ఉన్న ప్రముఖ టెలికాం ఆపరేటర్ వోడాఫోన్ - ఐడియా(VI) తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ప్లాన్స్ ను ప్రకటిస్తుంది. వోడాఫోన్, ఐడియా రెండు విలీనమైన తర్వాత తమ కస్టమర్ల సంఖ్య పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంది. మరోపక్క టాప్ టెలికాం ఆపరేటర్లైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ నుండి వస్తున్న పోటీని తట్టుకుని నిలబడేందుకు ట్రై చేస్తుంది. ప్రస్తుతం 3వ స్థానంలో ఉన్న VI మరింత టాప్ కి వెళ్లేందుకు చూస్తుంది.తాజాగా VI కలకత్తా మరియు ఇతర సర్కిల్స్ లో ఉన్న తమ కస్టమర్లు కొరకు కొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించింది. ఈ ప్లాన్ కు నాన్ స్టాప్ హీరో అని పేరు పెట్టింది. ఈ ప్లాన్ ద్వారా సింగిల్ ప్యాకేజీ లో అన్లిమిటెడ్ కాల్స్, డేటా మరియు ఇతర బెనిఫిట్లు అందించనుంది. ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ లో VI డిఫరెంట్ వేరియేషన్లను తీసుకువచ్చింది. ఒక్కొక్క రీఛార్జ్ కి అనుగుణంగా బెనిఫిట్లు, వ్యాలిడిటీలు అందనున్నాయి.
ఈ VI ప్రీపెయిడ్ నాన్ స్టాప్ హీరో ప్లాన్ ద్వారా రూ.398తో రీఛార్జ్ చేసుకుంటే అన్లిమిటెడ్ లోకల్ & STD కాల్స్, ప్రతిరోజు అన్లిమిటెడ్ డేటా, 100 smsలు అందిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ వచ్చేసి 28 రోజులు. అలాగే ఇదే ప్లాన్లో రూ. 698 రీఛార్జ్ తో 56 రోజుల వ్యాలిడిటీ, రూ. 1048 రీఛార్జ్ తో 84 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. ఈ ప్లాన్స్ కి కూడా అన్లిమిటెడ్ లోకల్ & STD కాల్స్, ప్రతిరోజు అన్లిమిటెడ్ డేటా, 100 smsలు ఇన్క్లూడ్ అవుతాయి.
ఈ నాన్ స్టాప్ హీరో ప్రీపెయిడ్ ప్లాన్ ను కలకత్తా, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో VI ప్రవేశపెట్టింది. ఈ సర్కిల్స్ తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛతీస్ గఢ్, తమిళనాడు, అస్సాం, ఒడిస్సా తో పాటు నార్త్ - ఈస్ట్ రాష్ట్రాల్లో కూడా ఆ ప్లాన్ను ప్రవేశపెట్టనున్నారు.
సెంటర్ ఫర్ డిజిటల్ ఎకనామి & పాలసీ రీసెర్చ్ రిపోర్ట్స్ ఆధారంగా...ఇండియాలో మొబైల్ డేటా కన్సెప్షన్ అనేది గత పది సంవత్సరాలుగా 288 రెట్లు పెరిగిందని వోడాఫోన్ - ఐడియా(VI) పేర్కొంది. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) లెక్కల ప్రకారం 2023లో 88.1 కోట్లు ఉన్న ఇంటర్నెట్ సబ్స్క్రైబర్లు 2024 మార్చికి 95.4 కోట్లకు పెరిగినట్టు తెలిపింది. సాధారణంగా ఒక యూజర్ నెలకి 20.27GB డేటా వాడుతున్నట్లు ఈ రిపోర్ట్లు పేర్కొన్నాయి.
మొబైల్ డేటా కు డిమాండ్ పెరగడంతో ఈ అవకాశాన్ని VI అందుపుచ్చుకోవాలని కొత్త ప్లాన్లను తీసుకువచ్చింది. తాజాగా ప్రకటించిన నాన్ స్టాప్ హీరో ప్లాన్ ద్వారా ఒక యూజర్ అన్లిమిటెడ్ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఎంజాయ్ చేస్తూ డేటా అయిపోతుంది అనే ఆందోళన చెందనవసరం లేదు.తమకు తగ్గ రీఛార్జ్ చేసుకుంటూ ప్లాన్ వాలిడిటీని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ ద్వారా టెలికాం ఇండస్ట్రీలో VI కొత్త గేమ్ మొదలుపెట్టిందనే చెప్పవచ్చు. సిగ్నల్ స్ట్రెంత్ సరిగ్గా ఉంటే PORT ఆప్షన్ ద్వారా ఇతర నెట్వర్క్ల కస్టమర్లు VI కి వచ్చే ఛాన్స్ కూడా ఉంది.
ప్రకటన
ప్రకటన
ChatGPT Atlas, Perplexity’s Comet and Other AI Browsers Can Bypass Paywalls: Report
Vivo S50, Vivo S50 Pro Mini Reportedly Clear Radio Certification Before Launch in China