ఇక Vi ప్రధాన పోటీదారు అయిన భారతీ ఎయిర్‌టెల్ ఇటీవలే తన కొత్త రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఇందులో అపరిమిత లోకల్, STD మరియు రోమింగ్ కాల్స్ అందించనుంది.
Photo Credit: Reuters
వోడాఫోన్ ఐడియా యొక్క రూ. 199 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో ఉంది
ప్రముఖ టెలికాం సంస్థ వోడాఫోన్ ఐడియా (Vi) తాజాగా తన రెండు ప్రీపెయిడ్ ప్లాన్లపై ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది. అయితే ఈ ఆఫర్లు అందరికీ కాకుండా కేవలం కొంతమంది ఎంపికైన వినియోగదారులకే వర్తించనున్నాయని టెలికాం నివేదిక పేర్కొంది. ప్రస్తుతానికి కంపెనీ అధికారికంగా ఈ ఆఫర్లపై ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే టెలికాం వెబ్సైట్లో అందుతున్న సమాచారం ప్రకారం వోడాఫోన్ ఐడియా రూ.199 మరియు రూ.179 ప్లాన్స్ మీద ఈ ప్రత్యేకమైన ఆఫర్లను అందించడం ఉందని సమాచారం. ఈ ప్లాన్స్ కు మీరు అర్హులా కాదా అనే విషయాన్ని VI అఫీషియల్ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవాలి. అయితే ప్రస్తుతం ఈ ప్లాన్ మీద పొందుతున్న బెనిఫిట్లను ఒకసారి పరిశీలిస్తే ఈ విధంగా ఉన్నాయి.
ప్రస్తుతం కంపెనీ వెబ్‌సైట్‌లో లభ్యమవుతున్న సమాచారం ప్రకారం, రూ.199 ప్లాన్‌లో వినియోగదారులు 28 రోజుల కాలపరిమితిలో అపరిమిత కాలింగ్, 2GB మొబైల్ డేటా, 300 SMSలను పొందొచ్చు. అయితే తాజా నివేదిక ప్రకారం, ఈ ప్లాన్‌పై రోజుకు అదనంగా 1GB డేటా ఉచితంగా అందించనుంది. అంటే మొత్తం 30GB వరకు డేటా వినియోగించేందుకు అవకాశం ఉండొచ్చని అంటున్నారు.
ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే... రూ.179 ప్లాన్‌పై కూడా కొత్త ప్రయోజనాలను వోడాఫోన్ ఐడియా అందించనుందని అంటున్నారు. ఈ ప్లాన్‌లో ఇప్పటివరకు 24 రోజుల వ్యాలిడిటీ ఉండగా, ఇప్పుడు అదనంగా 4 రోజులు మరింత కాలపరిమితిని కలిపి మొత్తం 28 రోజులకు పొడిగించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో కూడా అపరిమిత కాలింగ్, 300 SMSలతో పాటు 1GB డేటా అందించనున్నారు. అయితే, ఈ 1GB డేటా పొడిగించిన డేస్‌కి వర్తించదనే విషయాన్ని గమనించాలి.ఈ ప్రత్యేక ఆఫర్లు ప్రాంతాలవారీగా ఎంపికైన వినియోగదారులకే వర్తించనుంది
ఇక Vi ప్రధాన పోటీదారు అయిన భారతీ ఎయిర్‌టెల్ ఇటీవలే తన కొత్త రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఇందులో అపరిమిత లోకల్, STD మరియు రోమింగ్ కాల్స్ అందించనుంది. ఈ ప్లాన్ ప్రీపెయిడ్ వినియోగదారులకు అత్యంత తక్కువ ధరకు కాలింగ్ సౌకర్యం అందిస్తోంది.
ఇక ఇటీవలే వోడాఫోన్ ఐడియా తన 5G సేవలను మైసూరు నగరంలో ప్రారంభించింది. 5G స్మార్ట్‌ఫోన్ కలిగిన వినియోగదారులు ఇప్పుడు ఈ నగరంలో అపరిమిత 5G డేటా ను ఉపయోగించవచ్చు. ఇది కంపెనీ అందిస్తున్న ప్రాథమిక ఆఫర్‌లో భాగంగా ఉండనుంది. 5G విస్తరణ కోసం Vi సంస్థ సామ్‌సంగ్‌తో భాగస్వామ్యం అయ్యింది. మైసూరులో నెట్‌వర్క్ కవరేజ్ మెరుగుపర్చేందుకు అదనపు స్పెక్ట్రమ్‌ను వినియోగిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.
ప్రస్తుతం వోడాఫోన్ ఐడియా తీసుకొస్తున్న ఈ ప్రయోజనాలు అధికారికంగా ధృవీకరించబడినవి కావు. అయితే, వినియోగదారులందరూ తమ Vi యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా తమకు అందుబాటులో ఉన్న ఆఫర్లను చెక్ చేసుకోవచ్చు. మీరు ఎంపికైన యూజర్ అయితే, ఈ అదనపు ప్రయోజనాలు మీకూ లభించే అవకాశముంది. ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా ఇండియాలో మొబైల్ కస్టమర్ విషయంలో మూడో స్థానంలో కొనసాగుతుంది. అయితే టాప్ నెట్వర్క్లు జియో, భారతి ఎయిర్టెల్ కు గట్టి పోటీ ఇవ్వాలనే ఉద్దేశంతో సరికొత్త వ్యూహాలతో మార్కెట్లోకి రావాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రకటన
ప్రకటన