Photo Credit: Reuters
రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్లు ఎంపిక చేసుకుని జియో హాట్‌స్టార్‌కు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ అందిస్తున్నాయి.
ఇండియాలో రాబోయే క్రికెట్ సీజన్‌కు ముందు ఎంపిక చేసిన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లపై రిలయన్స్ జియో బంపర్ ఆఫర్స్‌ను ప్రకటించింది. ఈ టెలికాం ప్రొవైడర్ రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ విలువైన మొబైల్ రీఛార్జ్‌లతో జియోహాట్‌స్టార్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను, దీని వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సేవైన జియో ఎయిర్‌ఫైబర్ సేవలను ఉచితంగా పొందవచ్చు. ఈ ప్రకటనతో జియో వినియోగదారులు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) నుండి రాబోయే క్రికెట్ మ్యాచ్‌లను, ఇతర సినిమాలు, షోలు, అనిమే, డాక్యుమెంటరీలను వారి మొబైల్, టీవీలో 4Kలో చూసేందుకు అవకాశం ఉంటుంది.
రిలయన్స్ జియో ప్రకటన ప్రకారం.. ప్రస్తుత వినియోగదారులతోపాటు కొత్త యాక్టివేషన్‌లకు రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవడం ద్వారా జియో హాట్‌స్టార్‌కు 90 రోజుల ఉచిత యాక్సెస్ పొందొచ్చు. ఇది మొబైల్ డివైజ్‌లతోపాటు టీవీల్లో 4K స్ట్రీమింగ్‌ను అందింస్తుండడంతో కుటుంబ సమేతంగా వీక్షించవచ్చు. అంతేకాదు, వీటితోపాటు 50 రోజుల జియోఫైబర్ లేదా జియో ఎయిర్‌ఫైబర్ సేవలను కూడా ఉచింతంగా అందిస్తోంది. ఇందులో అపరిమిత Wi-Fi, 800+ OTT ఛానెల్‌లు, 11 కంటే ఎక్కువ OTT యాప్‌లు అందుబాటులో ఉన్నాయి.
ఇప్పటికే జియోలో ఉన్న వినియోగదారులు రూ. 299 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇది అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 1.5GB డేటా, 100 SMSలను అందిస్తుంది. అలాగే, JioCloud, JioTV వంటి బండిల్ చేయబడిన యాప్‌లకు యాక్సెస్‌ను అందించనుంది. అంతే కాదు, కొత్త వినియోగదారులు పైన తెలిపిన లేదా అంతకు మించి అధిక ధర గల ప్లాన్‌తో కొత్త సిమ్‌ను కొనుగోలు చేసి ఆ ప్రయోజనాలను పొందొచ్చు. అలాగే, అపరిమిత 5G ఇంటర్నెట్‌ను ఆస్వాదించాలనుకునే వారు రోజుకు 2GB లేదా అంతకంటే ఎక్కువ అందించే ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకోవచ్చు.
ఈ తాజా ఆఫర్ మార్చి 17 నుండి మార్చి 31 వరకు చెల్లుబాటులో ఉంటుంది. మార్చి 17కి ముందు రీఛార్జ్ చేసుకున్నవారు, ఇప్పటికే యాక్టివ్ ప్లాన్ కలిగి ఉన్న వినియోగదారులు రూ. 100 ప్యాక్‌ను ఎంచుకోవడం ద్వారా ఈ బెనిఫిట్స్ పొందొచ్చని కంపెనీ ప్రకటించింది. మార్చి 22న ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి ముందే ఈ ప్లాన్‌లను ప్రకటించారు. దీంతో యూజర్స్ నుంచి మంచి స్పందన వస్తుందని కంపెనీ గట్టి నమ్మకంతో ఉంది.
అలాగే, ఈ టెలికాం ప్రొవైడర్ చెబుతున్నదానిని బట్టీ.. కాంప్లిమెంటరీ జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ మ్యాచ్ మొదటి రోజు నుంచి 90 రోజుల పాటు యాక్టివేట్ చేయబడుతుంది. వీటితోపాటు జియో అనేక ఇతర ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను కూడా అందిస్తోంది. ఇవి స్ట్రీమింగ్ సర్వీస్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్ అందిస్తాయి. వినియోగదారులు ఇలాంటి ప్రయోజనాలను పొందడానికి రూ. 100, రూ. 195 లేదా రూ. 949తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రకటన
ప్రకటన