8K వీడియో రికార్డింగ్, AI ఫీచర్లతో Insta360 Ace Pro 2 లాంచ్.. ధర ఎంతో తెలుసా
Insta360 Ace Pro 2 గ్లోబల్ మార్కెట్‌లోకి Ace Proకి సక్సెసర్‌గా అడుగుపెట్టింది. యాక్షన్ కెమెరా ఈ Ace సిరీస్‌కి సరికొత్త జోడింపుగా చెప్పుకోవచ్చు. గతంలో వచ్చిన మోడళ్ల కంటే మెరుగైన ఇమేజ్ క్వాలటీ, సులభంగా క్యాప్చర్ చేయడం, అప్‌గ్రేడ్ చేసిన ఆడియో, డిజైన్, మెరుగైన కృత్రిమ మేధస్సు (AI) సామర్థ్యాలను పొందవచ్చని కంపెనీ చెబుతోంది. ఇది 8K వీడియో రికార్డింగ్, 39 మీటర్ల వరకు వాటర్‌ఫ్రూఫింగ్, డెడికేటెడ్ ప్రో ఇమేజింగ్ చిప్, లైకా-ఇంజనీరింగ్ కలర్ ప్రొఫైల్‌లు వంటి ఫీచర్స్‌ను కలిగి ఉంది