అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025: iPhone 16, iPhone 15తోపాటు ఇతర మోడళ్లపై ఉత్తమ డీల్స్ చూసేయండి
మన దేశంలో ప్రైమ్ సభ్యుల కోసం ముందుగానే మొదలైన అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025 ప్రస్తుతం అందరు వినియోగదారులకూ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. కొత్త ఏడాది మొదటి సేల్ ఈవెంట్ స్మార్ట్ ఫోన్‌లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, గృహోపకరణాలతోసహా అనేక ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు ఈ నూతన సంవత్సరంలో స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్‌ను ప్లాన్ చేస్తున్నా, మంచి డిస్కౌంట్ ఆఫర్ ధర కోసం మార్కెట్‌ను వెతుకుతున్నా, అమెజాన్ అద్భుతమైన తగ్గింపు ధరలను అందిస్తోంది. కొనుగోలుదారులు Apple, OnePlus, Samsung వంటి పలు బ్రాండ్‌లపై ఉన్న టాప్ ఆఫర్‌లను సద్వినియోగం చేసుకోవచ్చు.