Vivo Y19s స్మార్ట్‌ఫోన్ ధరతోపాటు స్పెసిఫికేషన్స్ వచ్చేశాయి.. ఓ లుక్కేయండి
ప్రపంచవ్యాప్తంగా Vivo Y19sను కంపెనీ అక్టోబర్‌లో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అయితే, ఆవిష్కరన సమయంలో ఈ హ్యాండ్‌సెట్ ధరకు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. ఇప్పుడు తాజాగా ఈ Vivo స్మార్ట్‌ఫోన్ RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లతో పాటు ధరను కూడా వెల్లడించింది. ఈ బ్రాండ్ లోకల్ వెబ్‌సైట్‌లలోని ఒక సైట్‌లో ఫోన్ వివరాలు బహిర్గతం అయ్యాయి. ఇది 6.68-అంగుళాల 90Hz HD+ LCD స్క్రీన్, Unisoc T612 ప్రాసెసర్, 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతోపాటు 15W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అయితే, బడ్జెట్ స్మార్ట్ ఫోన్ భారత్ లాంచ్ టైంను ఇంకా ధృవీకరించలేదు